S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/18/2017 - 00:29

వాషింగ్టన్, జూన్ 17: దేశం లో అందుబాటులో ఉన్న అన్ని రంగాల్లో యువత ఉపాధి పొం దేందుకు వీలుగా శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంతో దేశ యువత అన్ని రంగాల్లో సాంకేతిక పరంగా అనుభవాన్ని గడించడమే కాకుం డా మెరికల్లా తయారవుతారని ఆకాంక్షించారు.

06/17/2017 - 00:47

ఐక్యరాజ్య సమితి, జూన్ 16: ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాలకు సంబంధించిన ప్రధాన విభాగంలో సభ్యురాలిగా భారత దేశం మరోసారి తిరిగి ఎన్నికయింది. ఎకనామిక్, సోషల్ కౌన్సిల్ (ఎకోసోక్)లో సభ్యులుగా ఎన్నికయిన 18 దేశాల్లో భారత్ కూడా ఉంది. మూడేళ్ల పాటు భారత్ ఈ మండలిలో సభ్యురాలుగా ఉంటుంది.

06/16/2017 - 03:07

ఇస్లామాబాద్, జూన్ 15: పనామా పేపర్స్ లీక్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురువారం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సంయుక్త దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన తన ప్రభుత్వంపై కొంతమంది అజ్ఞాత శత్రువులు కుట్రలు పన్నుతున్నారని షరీఫ్ అన్నారు.

06/16/2017 - 03:05

లండన్, జూన్ 15: వెస్ట్ లండన్‌లోని 27 అంతస్థుల నివాస భవనంలో బుధవారం సంభవించిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య గురువారానికి 17కు చేరుకుంది. మరోవైపు ఇప్పటికీ చాలా మంది జాడ తెలియనప్పటికీ దాదాపు పూర్తిగా భస్మీపటలం అయిపోయిన భవనంలో ఇంకా ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవని బుధవారం రాత్రంతా భవనాన్ని గాలించిన సహాయక సిబ్బంది అంటున్నారు.

06/15/2017 - 01:00

లండన్, జూన్ 14: పశ్చిమ లండన్‌లోని 24 అంతస్తుల ‘గ్రీన్‌ఫెల్ టవర్’లో బుధవారం సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అందోళన చెందుతున్నారు. లాంచెస్టర్ వెస్ట్ ఎస్టేట్‌లోని లాటిమెర్ రోడ్డులో ఈ బహుళ అంతస్తు భవనం ఉంది. స్థానిక కాలమానం ప్రకారం 01:16 గంటలకు టవర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది.

06/15/2017 - 00:58

లండన్, జూన్ 14: భారతీయ సం తతికి చెందిన 38సంవత్సరాల వైద్యు డు లియో వరాద్కర్ ఐర్లాండ్ తొలిగే ప్రధాన మంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇంత పిన్నవయస్కుడు క్యాథలిక్ మెజార్టీ కలిగిన ఐర్లాండ్ ప్రధాని కావడం కూడా ఇదే మొదటిసారి. భారత వైద్యుడు,ఐర్లాండ్ నర్సు దంపతులకు జన్మించిన వరాద్కర్ పార్లమెంట్ ఎన్నికల్లో 57ఓట్లు సాధిం చి ఈ పదవిని చేజిక్కించుకున్నారు.

06/15/2017 - 02:35

గ్వాటెమాల, జూన్ 14: పశ్చిమ గ్వాటెమాలలోని మెక్సికో సరిహద్దులో తీవ్ర భూకంపం సంభవించింది. అనేక నగరాలకు భూ ప్రకంపనలు వ్యాపించాయి. భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.6గా నమోదైంది. ఒక వ్యక్తి గాయపడినట్టు సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. ఎలాంటి సునామీ హెచ్చరికలూ జారీ చేయలేదన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 1:29కి భూమి కంపించిందని సాన్‌మార్కోస్‌లోని భూకంప పరిశోధన కేంద్రం తెలిపింది.

06/14/2017 - 02:39

న్యూయార్క్, జూన్ 13: బాలకార్మిక వ్యవస్థను రూపుమాపే దిశగా భారత్ బలమైన అడుగు వేసింది. ఇందుకు ఉద్దేశించిన రెండు అంతర్జాతీయ ఒడంబడికలను మంగళవారం ధృవీకరించింది. ప్రాథమిక హక్కుల సాధన దిశగా భారత్ తీసుకున్న సానుకూల నిర్ణయంగా దీన్ని ఐఎల్‌ఓ డైరెక్టర్ జనరల్ గాయ్ రైడర్ అభివర్ణించారు.

06/14/2017 - 02:11

ఢాకా, జూన్ 13: భారీ వర్షాలు, వరదలతో బంగ్లాదేశ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ఆ దేశ ఉత్తర ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి దాదాపు 90 మంది మృతిచెందారు. వీరిలో ఇద్దరు సైనిక అధికారులు కూడా ఉన్నారని, మట్టిపెళ్లల కింద ఇంకా ఎంతోమంది చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు మంగళవారం వెల్లడించారు.

06/14/2017 - 02:09

లండన్, జూన్ 13: వివాదాస్పద మద్యం వ్యాపారావేత్త విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమై బ్రిటన్ కోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విచారణ నిమిత్తం మంగళవారం ఆయన వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. ఆయనకు డిసెంబర్ 4 వరకు కోర్టు బెయల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణ జూలై 6కు వాయదా వేసింది.

Pages