S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/23/2017 - 08:35

వాషింగ్టన్, మార్చి 22: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు.

03/23/2017 - 08:52

న్యూయార్క్, మార్చి 22: ఆసియా ఖండంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న భారత్ మానవాభివృద్ధిలో మాత్రం అధ్వాన్న స్థాయిలో వుంది. మొత్తం 188 దేశాల్లో జరిగిన సర్వేలో భారత్‌కు 131వ స్థానం దక్కింది. దీని పొరుగున వున్న పాకిస్తాన్, భూటాన్, నేపాల్‌లతో సమానమైన స్థాయికి మానవాభివృద్ధిలో భారత్ దిగజారినట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా రూపొందించిన ఈ సర్వే నివేదికలో స్పష్టమవుతోంది.

03/23/2017 - 06:57

బ్రిటన్, మార్చి 22:బ్రిటన్ పార్లమెంట్‌పై దాడికి బుధవారం విఫలయత్నం జరిగింది. వెస్ట్‌మినిస్టర్ వంతెనపై అతివేగంగా కారునడుపుకుంటూ వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లోకి దూసుకొచ్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. కాల్పులు, కత్తిపోటు దాడి సంఘటనల్లో ఇద్దరు మరణించారు. పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ దాడిని ఉగ్రవాద ఘటనగా అధికారులు పేర్కొన్నారు.

03/22/2017 - 03:39

వాషింగ్టన్, మార్చి 21: ఎనిమిది ముస్లిం దేశాలలోని పది విమానాశ్రయాల నుంచి అమెరికా వచ్చే ప్రయాణికులపై ట్రంప్ ప్రభుత్వం సరికొత్త నిబంధనలు విధించింది. రహస్యంగా దాచుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా 9/11 తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్రపన్నారంటూ నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో కఠినమైన రక్షణ చర్యలు చేపట్టినట్లు వైట్‌హౌస్ అధికారులు ప్రకటించారు.

03/22/2017 - 00:33

వాషింగ్టన్, మార్చి 21:పాకిస్తాన్ తమపై అణు దాటికి పాల్పడే అవకాశం ఉందన్న స్పష్టమైన సంకేతాలు అందే పక్షంలో భారత్ ముందస్తు ఆ తరహా దాడులకు దిగే అవకాశం ఉంటుందని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ అణు వ్యూహకర్త స్పష్టం చేశారు.

03/21/2017 - 02:02

బీజింగ్, మార్చి 20: తన అభ్యంతరాలను ఖాతరు చేయని పక్షంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలుగుతుందని భారత్‌ను చైనా హెచ్చరించింది. బిహార్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బౌద్ధమత సదస్సుకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను ఆహ్వానించిన నేపథ్యంలో చైనా ఈ హెచ్చరిక చేసింది.

03/20/2017 - 23:51

వాషింగ్టన్, మార్చి 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశానికి మెక్సికోతో ఉన్న సరిహద్దు పొడవునా అందమైన పెద్ద గోడను నిర్మించడానికి కసరత్తు చేస్తున్నారని ఆయన పాలనా యంత్రాంగం తెలిపింది. ఈ గోడ చాలా ఎత్తుగా ఎవరూ ఎక్కడానికి వీలులేకుండా, ఈ గోడలోకి ఏ పరికరమూ చొరబడకుండా గట్టిగా ఉండాలని ఆయన భావిస్తున్నారని పేర్కొంది.

03/20/2017 - 23:51

వాషింగ్టన్, మార్చి 20: కన్నతల్లిని పాశవికంగా హత్యచేసిన 17 ఏళ్ల ఇండో అమెరికన్‌ను ఉత్తర కరోలినా పోలీసులు అరెస్టు చేశారు. 2015 డిసెంబర్ 17న జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నళినీ తెల్లప్రోలు (51) డ్యూక్ మెడికల్ సెంటర్‌లో పనిచేస్తుండేవారు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నారు.

03/20/2017 - 02:29

లీమా, మార్చి 19: భారీ వర్షాలు, వరదలతో పెరూ అల్లకల్లోలంగా మారింది. రెండు దశాబ్దాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోలేదని అధికారులు స్పష్టం చేశారు. దేశంలో సగం ప్రాంతం ప్రకృతి విలయం బారిన పడింది. ఎక్కడికక్కడ కుంభపోత వర్షం, వరదలు, మట్టిపెళ్లలు విరగిపడడం వంటి దృశ్యాలే కనిపించాయి. ఇళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలను వరద ముంచెత్తింది.

03/20/2017 - 00:45

సెయింట్ లూయిస్, మార్చి 19: అమెరికా పాపులర్ సంగీ తం అయిన రాక్ ఎన్ రోల్‌కు తన పాటలు, గిటార్ ద్వారా సరికొత్త నిర్వచనం చెప్పిన, ఎంతో మందికి మార్గదర్శకుడైన చక్ బెర్రీ శనివారం మి స్సోరిలోని తన ఇంట్లో కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు.

Pages