S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/09/2017 - 07:11

వాషింగ్టన్, మార్చి 8: అమెరికాలో హెచ్-1బి వీసాల గురించి భారతీయుల్లో మరో కొత్త గుబులు మొదలయింది. హెచ్-1బి వీసాలపై అమెరికా వచ్చిన విదేశీయుల జీవిత భాగస్వాములు కూడా అక్కడ పని చేయడానికి 2015లో అప్పటి బరాక్ ఒబామా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ‘సేవ్ జాబ్స్ యుఎస్‌ఏ’ అనే సంస్థ వాషింగ్టన్ డిసి అపీళ్ల కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది.

03/08/2017 - 03:22

వాషింగ్టన్, మార్చి 7: ఆరు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ కొత్తగా జారీ చేసిన ఆదేశాలను ఓ పక్క వైట్‌హౌస్ అధికారులు సమర్థిస్తుంటే, మరోపక్క భారత అమెరికన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అమెరికాను సురక్షితం చేయాలనే కారణంతో వలసలపై నిషేధం విధించటంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అమెరికా కాంగ్రెస్‌లో భారత అమెరికన్ సభ్యులు ట్రంప్‌కు హితవు పలికారు.

03/08/2017 - 03:25

జకార్తా, మార్చి 7: ఉగ్రవాద నిరోధనలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, 20 హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలు తీర్మానించాయి. అలాగే ఇందుకు సంబంధించి కీలక సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని, సహకారాన్ని విస్తతం చేసుకోవాలని కూడా ఈ దేశాలు నిర్ణయించాయి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐరాస తీర్మానాలను, ప్రకటనలను త్రికరణశుద్ధిగా అమలు చేయాలని సంకల్పించాయి.

03/08/2017 - 02:21

న్యూయార్క్, మార్చి 7: పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో 2016లో ఆసియాలో వెనుకబడి ఉన్న ఏకైక దేశం భారత్ ఒక్కటేనని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది.పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరడానికి, గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో సాధించిన పురోగతి వేగాన్ని అందుకోవడానికి మరిన్ని చర్యలతో పాటుగా బలమైన రాజకీయ చిత్తశుద్ధి అవసరమని ‘2016లో పార

03/07/2017 - 02:38

వాషింగ్టన్, మార్చి 6: ఇండియన్-అమెరికన్లపై జరుగుతున్న దాడులకు సంబంధించి దర్యాప్తు వేగిరం చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా చూస్తామని అమెరికా హామీ ఇచ్చింది. మరోపక్క ఎన్నారైలపై జరుగుతున్న విద్వేషపూరితపైన దాడులపై అమెరికా విదేశాంగ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘అమెరికా ప్రభుత్వం తరఫున యుఎస్ విదేశాంగశాఖ దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది.

03/07/2017 - 02:19

జెనీవా, మార్చి 6: వాతావరణంలో పెచ్చుమీరుతున్న కాలుష్యం చిన్నారులపై పడగ చాచింది. ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు కాలుష్యానికి బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 17లక్షల మంది పిల్లలు ఈ కారణంగానే మరణిస్తున్నారని ఈ నివేదిక సోమవారం వెల్లడించింది.

03/07/2017 - 01:26

వాషింగ్టన్, మార్చి 6: శరణార్థులు, వలసల్ని కట్టడి చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మరో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. మొదటి ఉత్తర్వులో పేర్కొన్న కొన్ని అంశాల్లో మార్పులు చేశారు. ఈ సారి నిషేధం వేటు నుంచి ఇరాక్‌ను మినహాయించి మిగిలిన ఆరు దేశాలకూ వర్తింపచేశారు. తాజా నిషేధ జాబితాలో సూడాన్, లిబియా, సిరియా, ఇరాన్, సోమాలియా, యెమన్ దేశాలు ఉన్నాయి.

03/06/2017 - 23:58

టోక్యో, మార్చి 6: జపాన్‌లో ఆదివారం ఓ హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మరణించారు. మరణించిన వారిలో ఆరు మృతదేహాలను సోమవారం స్వాధీనం చేసుకోగా, మిగతా మూడు మృతదేహాల జాడ తెలియడం లేదు. మరణించినవారిలో పైలెట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణం సరిగా లేకపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు పోలీసులు తెలిపారు.

03/06/2017 - 23:56

మెల్‌బోర్న్, మార్చి 6: అమెరికాలోని జాత్యహంకార పెడధోరణి న్యూజిలాండ్‌కూ పాకింది. ఆక్లాండ్‌లో నరిందర్‌వీర్ సింగ్‌ను మీ దేశానికి తిరిగి వెళ్లాల్సిందిగా బెదిరించింది. ‘‘నేను కారులో వెళ్తూ షూట్ చేస్తున్నా.. అతని కారు వచ్చినప్పుడు అతనికి దారి ఇచ్చా. అతను అకస్మాత్తుగా నన్ను దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. మీ సొంత దేశానికి వెళ్లిపొండని బెదిరించాడు. ఆ కారులో ఉన్న మహిళ నాకు అసభ్యకరంగా సైగలు చేసింది.

03/06/2017 - 23:56

ఇస్లామాబాద్, మార్చి 6: అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడడంతో పాకిస్తాన్‌కు చెందిన ఆరుగురు సైనికులు మృతిచెందారు. ఈ సంఘటనపై స్పందించిన పాక్ ప్రభుత్వం సరిహద్దుల్లో మిలిటెంట్లను మట్టుబట్టాలని అఫ్గాన్‌ను అభ్యర్థించింది. ఉగ్రవాదులు మూడు మిలిటరీ పోస్టులపై కాల్పులకు తెగబడ్డారని మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ విలేఖరులకు తెలిపారు.

Pages