S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/04/2017 - 02:52

బీజింగ్, మార్చి 3: దలైలామా అరుణాచల్‌ప్రదేశ్‌ను సందర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చైనా శుక్రవారం భారత్‌ను హెచ్చరించింది. దీనివల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని, వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు విఘాతం కలుగుతుందని హెచ్చరించింది.

03/03/2017 - 02:39

వాషింగ్టన్, మార్చి 2: ఇండో-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను ప్రత్యేకించి వాణిజ్య, రక్షణ, భద్రత రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి అనుసరించాల్సిన మార్గాలపై భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ ఈ మేరకు అమెరికా జాతీయ భద్రత సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్ సహా ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.

03/03/2017 - 02:36

వాషింగ్టన్, మార్చి 2: అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం సిల్వర్ స్ప్రింగ్‌లో గల రెండు మసీదులకు విద్వేషంతో కూడిన రెండు బెదిరింపు ఉత్తరాలు వచ్చాయి. ఈ బెదిరింపు ఉత్తరాలలో ముస్లింలను వధించేవారికి నగదు బహుమతులను ప్రకటించారు. వీటికి బెదిరింపు ఉత్తరాలు పోస్టులో వచ్చాయి.

03/03/2017 - 02:29

లండన్, మార్చి 2: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన (బ్రెగ్జిట్) తరువాత తీసుకోవలసిన చర్యలపై దేశ ప్రధానమంత్రి థెరిసా మేకు ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్)లో ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగిన తరువాత బ్రిటన్‌లో ఉన్న ఇయు పౌరుల నివాసానికి సంబంధించిన హక్కులకు హామీ కల్పించాలని బిల్లుకు ప్రతిపాదించిన సవరణకు అనుకూలంగా ఎగువ సభ ఓటు వేసింది.

03/03/2017 - 01:59

కైరో, మార్చి 2:‘ఇరాక్‌లో మనం పతనమయ్యాం. ఘోర పరాజయం తప్పదు. పారిపోండి లేదా పేల్చుకుని చచ్చిపోండి..’ అంటూ ఐసిస్ అధినేత అల్ బాగ్దాదీ మిలిటెంట్లకు విజ్ఞప్తి చేశారు. ఇస్లాం సామ్రాజ్యానికి ఖలీఫాగా ప్రకటించుకున్న బాగ్దాదీ ఐసిస్‌లోని అరబ్బుయేతర మిలిటెంట్లకు ఈ రకంగా పిలువునివ్వడం ఈ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ మూలాలు కదులుతున్నాయనడానికి సంకేతంగా భావిస్తున్నారు.

03/02/2017 - 08:28

వాషింగ్టన్, మార్చి 1: కొంతకాలంగా తన ఇమ్మిగ్రేషన్ విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమేర వెనక్కుతగ్గారు. ఈ విషయంలో తన వైఖరి సడలించిన ఆయన ప్రతిభ ఆధారంగానే ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

03/02/2017 - 05:07

వాషింగ్టన్, మార్చి 1:అమెరికాలో జరుగుతున్న జాతి విద్వేష ఘటనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వౌనం వీడారు. కాన్సస్‌లో తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను జాతి విద్వేష హత్యగా, దుష్ట చర్యగా పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి గంటసేపు మాట్లాడిన ట్రంప్ కాన్సస్ ఘటనను ప్రస్తావించారు. శ్రీనివాస్ మరణానికి కాంగ్రెస్ సంతాపం పాటించడం గమనార్హం.

03/02/2017 - 05:00

లాహోర్, మార్చి 1: తొమ్మిదేళ్ల క్రితం ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి పునర్విచారణ జరపాలని పాకిస్తాన్‌కు భారత్ స్పష్టం చేసింది. ఆ దాడితో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న జమాత్ ఉద్ దవా అధినేత అఫీజ్ సరుూద్‌పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు దాఖలు చేయాలని కోరింది. ఈ దాడి కేసులో వాంగ్మూలాలను నమోదు చేయడానికి వీలుగా 24 మంది సాక్షులను పంపాలన్న పాక్ అభ్యర్థనకు భారత్ తీవ్రంగా స్పందించింది.

03/01/2017 - 04:39

హ్యూస్టన్, ఫిబ్రవరి 28: కాన్సాస్ బార్‌లో కాల్పులు జరిపి భారతీయ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ మృతికి కారకుడైన అమెరికా నేవీ మాజీ ఉద్యోగి ఆడమ్ పురింటన్ (51)ను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. జాన్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ జడ్జి నిందితుడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. ప్యూరింటన్ ఇద్దరు ఇండియన్ ఇంజనీర్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందారు.

03/01/2017 - 04:38

హూస్టన్, ఫిబ్రవరి 28: దేశంలో విద్వేష దాడులు పెరిగిపోతున్నాయంటూ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ స్పష్టం చేశారు. ఇలాంటి విద్వేష కాల్పులకు బలైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతి సంఘటనపై నోరువిప్పాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన తీవ్ర స్థాయిలో ఆందోళనలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఇంకా వౌనం వహించడం ట్రంప్‌కు ఎంత మాత్రం సమంజసం కాదన్నారు.

Pages