S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/28/2017 - 01:47

వాషింగ్టన్, ఫిబ్రవరి 27: ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు, అక్రమ వలసదారుల్ని నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఉత్తర్వును సిద్ధం చేస్తున్నారు. తొలి కార్యనిర్వాహక ఆదేశం వివాదాస్పదం కావడం, కోర్టుల జోక్యంతో అది ఆగిపోవడంతో ఈ సారి ఎలాంటి చట్టపరమైన సమస్యలకు తావు లేని రీతిలోనే తాజా ఉత్తర్వుపై బుధవారమే ట్రంప్ సంతకం చేసే అవకాశం ఉంది.

02/28/2017 - 01:38

లాస్ ఏంజెల్స్, ఫిబ్రవరి 27: ప్రపంచ సినిమా పండుగ ఆస్కార్ 89వ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా మూన్‌లైట్ నిలిచింది. రికార్డు స్థాయిలో 14 నామినేషన్లు దక్కించుకుని హాట్ ఫేవరేట్‌గా చర్చల్లో నిలిచిన లాలా ల్యాండ్ చివరకు ఆరు అవార్డులతో సరిపెట్టుకుంది. అయితే కచ్చితంగా వస్తుందని ఊహించిన ఉత్తమచిత్రం పురస్కారం మాత్రం మిస్ చేసుకుంది. ఉత్తమచిత్రం అవార్డు ప్రకటనలో ఆస్కార్ న్యాయనిర్ణేతలు గందరగోళం సృష్టించారు.

02/28/2017 - 02:19

వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న ప్రతి భారతీయుడూ సురక్షితంగా ఉండాలంటే భారతీయ అమెరికన్లంతా ఐక్యం కావాలని ప్రముఖ అమెరికన్ సిక్కు నాయకుడు గురిందర్ సింగ్ ఖల్సా పిలుపునిచ్చారు. భారతీయ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ విషాద మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘‘మన మొట్ట మొదటి ప్రాధాన్యం అమెరికాలో నివసిస్తున్న ప్రతి భారతీయుడు, సిక్కులు భద్రంగా, సురక్షితంగా ఉండేలా చూడటం’’ అని ఆయన అన్నారు.

02/27/2017 - 02:51

వాషింగ్టన్, ఫిబ్రవరి 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి చివరికి వైట్‌హౌస్‌లో పని చేసే ఉద్యోగులకు సైతం నచ్చని పరిస్థితి వచ్చింది. ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారిపై ట్రంప్ నిషేధం విధించిన కారణంగా తాను ఉద్యోగంనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వైట్‌హౌస్‌లో పని చేస్తున్న రుమానా అహ్మద్ అనే ముస్లిం మహిళ తెలిపింది.

02/27/2017 - 02:50

మెక్సికోసిటీ, ఫిబ్రవరి 26: అమెరికా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం మెక్సికో నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై పన్ను వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు నిజమైన పక్షంలో తామూ ప్రతి చర్యకు పూనుకుంటామని మెక్సికో విదేశాంగ మంత్రి లూరుూస్ విడెగారే పేర్కొన్నారు. ట్రంప్ బెదిరింపులకు మెక్సికో ప్రభుత్వం తగిన రీతిలో ప్రతిస్పందిస్తుందని లూరుూస్ అన్నారు.

02/27/2017 - 01:54

లండన్, ఫిబ్రవరి 26: రుణ ఎగవేతదారులు కూడా లండన్‌లో నివసించేంత ఉదారంగా బ్రిటన్ ప్రజాస్వామ్యం ఉందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దీనివల్ల మామాలు అవసరాలకు కూడా విఘాతం కలుగుతోందని పేర్కొన్నారు. భారత్‌లో రుణాల ఎగవేత, ఇతర కేసుల్లో నిందితుడయిన లిక్కర్ బారన్ విజయ్ మాల్యా లండన్‌లో నివసిస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

02/27/2017 - 01:52

న్యూయార్క్, ఫిబ్రవరి 26: అంతర్జాతీయ సినిమా పండుగ ఆస్కార్ మరికొన్ని క్షణాల్లోనే మన కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది. 89వ పురస్కారాల వేడుకల్లో మొత్తం 24 కేటగిరీలలో ఈ సమున్నత పురస్కారాలను అందుకునేందుకు మేటి చిత్రాలు, దర్శకులు, కళాకారులు పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. ఈ సారి కచ్చితంగా అత్యధిక సంఖ్యలో ఆస్కార్ పురస్కారాలు 14 నామినేషన్లు దక్కించుకున్న లా లా ల్యాండ్‌కు దక్కే అవకాశం కన్పిస్తున్నది.

02/26/2017 - 03:00

వాషింగ్టన్, ఫిబ్రవరి 25: అమెరికాలో రుణ దాతలను మోసగించాడన్న అభియోగాలపై రామన్ హందా (67) అనే ఇండో-అమెరికన్ వ్యాపారిని అరెస్టు చేశారు. ఆల్ఫా ఒమేగా జ్యూయలర్స్ పేరుతో బోస్టన్‌లో నగల దుకాణాలను నడిపి ఎంతో ప్రజాదరణ పొందిన రామన్ హందాను 2007లో వివిధ బ్యాంకుల నుంచి రుణాలను పొంది తిరిగి చెల్లించలేదు. దీంతో ఆయనపై 12 అభియోగాలు నమోదు చేశారు.

02/26/2017 - 03:00

లాస్ ఏంజిలిస్, ఫిబ్రవరి 25: వినోద ప్రపంచంలో ఆస్కార్ పురస్కారానికి ఉన్న ప్రతిష్ఠ అంతా ఇంతా కాదు. ఈ పురస్కారం లభిస్తే ఎవరైనా తమ జన్మధన్యమయిందని భావిస్తుంటారు. అయితే, అంతటి ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ విగ్రహం విలువ మాత్రం కేవలం పది డాలర్లేనని ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ పేర్కొంది.

02/26/2017 - 02:49

వాషింగ్టన్, ఫిబ్రవరి 25: కొత్త ఉద్యోగాల కల్పనకు అడ్డంకిగా ఉండే నిబంధనలను తొలగించడానికి ఒక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని తన ప్రభుత్వాన్ని ఆదేశించే ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

Pages