S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/26/2017 - 02:48

న్యూయార్క్, ఫిబ్రవరి 25: అమెరికాలో శే్వతజాతీయుడి దురహంకారానికి తెలుగు యువ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ బలైపోయిన ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్రస్థాయిలో స్పందించారు. మతిలేని హింసకు, అసహనం వలన తలెత్తే విభేదాలకు, విద్వేషానికి సమాజంలో తావులేదని ‘మైక్రోసాఫ్ట్’ సిఇవో సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. శ్రీనివాస్ హత్యను ఐక్యరాజ్య సమతి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు.

02/26/2017 - 02:45

వాషింగ్టన్, ఫిబ్రవరి 25: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్నాళ్లూ తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలపై కేవలం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఇప్పుడు నేరుగా చర్యలకు దిగారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశానికి న్యూయార్క్ టైమ్స్, సిఎన్‌ఎన్, బిబిసిలాంటి పలు ప్రముఖ వార్తసంస్థల ప్రతినిధులను ఆహ్వానించలేదు.

02/26/2017 - 02:43

వాషింగ్టన్, ఫిబ్రవరి 25: అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల వేధింపులకు గురయిన వారి జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా బాక్సింగ్ లెజండ్ మహమ్మద్ అలీ కుమారుడు కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. జమైకానుంచి తిరిగి వస్తుండగా ఫ్లోరిడా విమానాశ్రయంలో దాదాపు రెండు గంటలపాటు ఆపేశారు.

02/26/2017 - 02:41

బీరుట్, ఫిబ్రవరి 25: సిరియాలో జనసమ్మర్థం కలిగిన రెండు ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 42 మంది మరణించారు. మరణించినవారిలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు అత్యంత సన్నిహితుడైన జనరల్ హసన్ దాబూల్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జనరల్ హసన్ దేశంలోని టాప్ ఇంటిలిజెన్స్ అధికారి కాగా ఆయన జెనీవాలో జరిగిన శాంతి చర్చల్లోనూ పాల్గొన్నారు.

02/26/2017 - 02:39

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 25: దాయాది పాకిస్తాన్ మరోసారి భారత్‌పై నోరు పారేసుకుంది. భారత్ అక్రమంగా కాశ్మీర్‌ను ఆక్రమించిందని నిందారోపణలకు దిగింది. అంతటితో ఆగకుండా భారత్ తన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే కాశ్మీర్‌ను ఖాళీ చేయాలని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ డిమాండ్ చేశారు.

02/26/2017 - 01:24

హ్యూస్టన్, ఫిబ్రవరి 25: విద్వేష నేరాలను ఎలా ఆపుతారంటూ కాల్పుల ఘటనలో మరణించిన శ్రీనివాస్ భార్య సనయన దుమాల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గట్టిగా నిలదీసింది. అమెరికాలో శే్వత జాతీయుడి దురహంకారానికి తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల బలైపోయిన విషయం తెలిసిందే.

02/26/2017 - 01:18

వాషింగ్టన్, ఫిబ్రవరి 25: వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే కాన్సాస్‌లో తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యోదంతం జరిగిందన్న వాదనను ట్రంప్ ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘ప్రాణహాని ఎవరికి జరిగినా విషాదకరమే. అయినప్పటికీ దీని లోతుల్లోకి నేను పోదల్చుకోలేదు. కానీ ఘటనకు, వలసలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధం ఉందనడం అసంబద్ధం.

02/25/2017 - 02:13

బీరూట్, ఫిబ్రవరి 24: సిరియా పట్టణమైన అల్‌బాబ్ సమీపంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 42 మంది మరణించారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నుంచి ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దారుణం జరిగింది. బాంబులతో నిండిన వాహనంతో వచ్చిన ఆత్మాహుతి బాంబర్ రెబెల్ కమాండ్ కేంద్రం వద్ద పేలిపోయాడు. ఈపేలుళ్ల తాకిడికి రెండు కమాండ్ పోస్టులు ధ్వంసమయ్యాయి. 42 మంది మరణించడంతోపాటు అనేక మంది గాయపడ్డారు.

02/24/2017 - 02:50

లాహోర్, ఫిబ్రవరి 23: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో గురువారం శక్తివంతమైన బాంబు పేలుడులో కనీసం 10 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. ఒక భారతీయ రెస్టారెంట్‌తో పాటుగా రెండు రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.

02/24/2017 - 02:45

వాషింగ్టన్, ఫిబ్రవరి 23: లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులకోసం గత అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో జారీ చేసిన నిబంధనలను అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు.

Pages