S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/08/2016 - 00:46

బీజింగ్, నవంబర్ 7: భారత్ ఆశలపై చైనా మరోసారి నీళ్లు చల్లింది. అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వం కల్పించే విషయమై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మరో నాలుగు రోజుల్లో శుక్ర, శనివారాల్లో వియన్నాలో ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశాలు జరుగనున్న తరుణంలో చైనా సోమవారం ఈ ప్రకటన చేసింది.

11/08/2016 - 00:45

న్యూయార్క్, నవంబర్ 7: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చివరి ఎన్నికల ముందస్తు సర్వేలోనూ డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కే ఆధిక్యం లభించింది. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో హిల్లరీకి గెలుపు అవకాశాలు 65శాతం ఉన్నట్లు ఓ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఎన్నికల్లో 81శాతం కంటే తక్కువగా ఓట్లు పోలవుతాయని, అందులో 65.3 శాతం హిల్లరీకి మొగ్గు చూపే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

11/07/2016 - 07:44

వాషింగ్టన్, నవంబర్ 6: మంగళవారం హోరాహోరీగా జరుగుతాయని భావిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమవడంతో కీలక రాష్ట్రాల్లో ఇంకా ఎవరికి ఓటు వేయాలో నిశ్చయించుకోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇటు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, అటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అమెరికాలో ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది.

11/07/2016 - 07:14

లండన్, నవంబర్ 6: భారత దేశం బ్రిటన్‌కు అత్యంత ముఖ్యమైన, సన్నిహిత దేశమని, ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో ఒకటని బ్రిటన్ ప్రధాని థెరెసా మే అభివర్ణిస్తూ, తన భారత దేశ పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాధాన్యతను మరోసారి ధ్రువీకరిస్తుందని చెప్పారు.

11/06/2016 - 03:12

లండన్, నవంబర్ 5: భరాత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటీష్ ప్రధాని థెరెసా మే మధ్య సోమవారం జరిగే చర్చల్లో రక్షణ, భద్రతా సంబంధాలు ప్రధానాంశాలుగా ఉంటాయని, తమ చర్చల సందర్భంగా ఇరువురు నేతలు రెండుదేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలు, కౌంటర్ టెర్రరిజంపై లోతుగా చర్చలు జరుపుతారని బ్రిటీష్ ప్రధాని అధికార ప్రతినిధి శనివారం రాత్రి ఇక్కడ డౌనింగ్ స్ట్రీట్ వద్ద విలేఖరులకు చెప్పారు.

11/06/2016 - 02:16

ఫాయెట్‌విల్లే (అమెరికా), నవంబర్ 5: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన హుందాతనాన్ని మరోసారి చాటుకున్నారు. మంగళవారం జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయాన్ని కాంక్షిస్తూ డెమోక్రటిక్ పార్టీ శుక్రవారం ఇక్కడ ర్యాలీ నిర్వస్తున్నప్పుడు మిలటరీ యూనిఫారం ధరించిన ఒక వృద్ధుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు తెలియజేస్తూ ప్లకార్డును చేతబట్టుకుని అక్కడ నిలబడ్డాడు.

11/06/2016 - 00:54

లాహోల్, నవంబర్ 5: కాశ్మీర్ ప్రజలపై తీవ్రమైన అణచివేత, దారుణాలు జరుగుతున్నా భారత్‌పై ప్రధాని నవాజ్ షరీఫ్ మెతకవైఖరి ప్రదర్శిస్తున్నారని ముంబయి ఉగ్రదాడికి సూత్రధాని, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్ మండిపడ్డాడు. కాశ్మీర్ లోయలో ప్రజలు సాయంకోసం ఎదురుచూస్తున్నారని శనివారం అతడు తెలిపాడు. అక్కడి ప్రజల అణచివేతపై నవాజ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని హఫీజ్ ఆరోపించాడు.

11/05/2016 - 08:10

వాషింగ్టన్, నవంబర్ 4: అమెరికాలో మంగళవారం జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అయితే ఆ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలోని ముందస్తు ఓటింగ్ నిబంధన కింద ఇప్పటికే రికార్డు సంఖ్యలో 3.5 కోట్ల మంది అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీం తో 2012 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 3.23 కోట్ల మంది ముందుగానే ఓటు హక్కు ఉపయోగించుకుని నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది.

11/05/2016 - 08:09

పారిస్, నవంబర్ 4: పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పుడమికి కొండంత వెన్నుదున్నను అందించే చారిత్రక పారిస్ ఒప్పందం శుక్రవారం ప్రపం చ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. భూ తాపాన్ని అరికడుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రపంచ దేశాలు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమల్లోకి రావాలన్నదానిపై మరో వారంలో కీలక భేటీ జరగబోతోంది.

11/05/2016 - 06:25

లండన్, నవంబర్ 4: విపరీతంగా పెరిగిపోతున్న వలసదారులకు అడ్డుకట్టవేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. యూరోపియన్ యూనియన్‌కు చెందని దేశాలనుంచి వచ్చే వారికి (నాన్ యూరోపియన్ నేషనల్స్) కొత్త వీసా నిబంధనలను ప్రకటించింది. దీని ప్రభావం భారతీయులపై ముఖ్యంగా ఐటి నిపుణులపై భారీగా పడనుంది.

Pages