S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/23/2016 - 13:59

బీజింగ్‌: వర్షాల కారణంగా చైనాలో 78మంది మృతి చెందగా, 91మంది ఆచూకీ తెలియడం లేదు. దాదాపు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి, ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేవారమని బాధితులు అంటున్నారు.

07/23/2016 - 13:51

దిల్లీ: జర్మనీలోని మ్యూనిక్‌ నగరం మాల్‌లో కాల్పుల ఘటన మృతుల్లో భారతీయులెవరూ లేరని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. ఓ మాల్‌లోని రెస్టారెంట్‌లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాల్పులకు పాల్పడిన 18ఏళ్ల దుండగుడు కూడా తర్వాత తనను తాను కాల్చుకుని మృతిచెందాడు.

07/23/2016 - 06:13

బెర్లిన్, జూలై 22: జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఓ ఆగంతకుడి కాల్పుల్లో పది మందికి పైగా మరణించినట్టు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒలిపింక్ స్టేడియం సమీపంలో ఉన్న మ్యూనిచ్ షాపింగ్ సెంటర్లో ఉన్నవారిపై అతడు కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల అనంతరం అతడు మెట్రో స్టేషన్ దిశగా పరుగులు పెట్టినట్టుగా ది బిల్డ్ అనే పత్రిక తెలిపింది.

07/23/2016 - 02:33

బీజింగ్, జూలై 22: దక్షిణ చైనా సముద్రంపై తన హక్కులను తోసివేస్తూ ఐక్యరాజ్య సమితి (ఐరాస)కు చెందిన ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చైనా మిలిటరీ తాజాగా పలు కొత్త ఆయుధాలను ఆవిష్కరించింది. వీటిలో సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిపణులు కూడా ఉన్నాయి.

07/22/2016 - 17:48

కాబుల్‌: కుందుజ్‌ ప్రావిన్స్‌లో తాలిబన్‌ తిరుగుబాటుదారులు, భద్రతా దళాల మధ్య జరిగిన అల్లర్లలో 18 మంది తిరుగుబాటు దారులు, నలుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఖాలా-ఇ-జల్‌ జిల్లాలో తిరుగుబాటుదారులపై భద్రతా బలగాలు దాడి చేశాయి.

07/22/2016 - 17:39

ఇస్లామాబాద్: కుటుంబం పరువు తీసిందన్న ఆగ్రహంతో తన కుమార్తె కందీల్ బలోచ్‌ను హతమార్చిన తన కుమారుడు వసీంను కాల్చి చంపేయాలంటూ బలోచ్ తండ్రి అన్వర్ అజీం పేర్కొనడం ఇపుడు పాకిస్తాన్‌లో కలకలం రేపుతోంది. సోషల్ మీడియా సెలబ్రిటీగా, మోడల్‌గా రాణిస్తున్న బలోచ్ తమ కుటుంబం పరువు తీసిందని ఆమెను సోదరుడు వసీం గొంతు నులిమి ఇటీవల హత్య చేసిన సంగతి తెలిసిందే. పాక్‌లో ఇటువంటి పరువు హత్యలు సర్వసాధారణమే.

07/22/2016 - 04:44

రియాద్, జూలై 21: ప్రపంచవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని కుదిపేస్తున్న ‘పోకెమాన్’కు సౌదీ అరేబియాలో బ్రేక్ పడింది. ఈ ఆట ఇస్లాంకు వ్యతిరేకమని, దీన్ని ఆడకూడదంటూ సౌదీ మత పెద్దలు ఫత్వా జారీచేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రపంచమంతా పోకెమాన్ వెంట పరుగులు పెడుతున్న నేపథ్యంలో సౌదీ వాసులకు ఇది పిడుగులాంటిదే.

07/22/2016 - 04:38

బీజింగ్, జూలై 21: భారీ వర్షాలు చైనాను కుదిపేస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి వందమందికి పైగా మృతి చెందడమో, గల్లంతు కావడమో జరిగిందని అధికార వర్గాల సమాచారం. పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

07/22/2016 - 00:55

న్యూఢిల్లీ, జూలై 21: భారతదేశ పురోగతి పొరుగు దేశాల ప్రగతితో ముడిపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో కలిసి ఆయన గురువారం పెట్రాపోల్-బెనాపోల్ ల్యాండ్ పోర్ట్‌ను ప్రారంభించారు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య కీలక వాణిజ్య మార్గంగా పనిచేసే ఈ ల్యాండ్ పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

07/22/2016 - 00:31

న్యూఢిల్లీ, జూలై 21: జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు, మద్దతు ఇస్తున్నందుకు పాకిస్తాన్‌పై భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో స్పందించింది. తమ ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హెచ్చరించడంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌నుంచి కాళీ చేయాలని కూడా హెచ్చరించింది.

Pages