S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/16/2017 - 02:22

బీజింగ్, ఫిబ్రవరి 15: భారత్ ‘తైవాన్ కార్డు’తో ఆడుకోవాలను కుంటోందని చైనా అధికార మీడియా బుధవారం ఆరోపించింది. ఈ సున్నితాంశంతో ఆడుకోవాలనుకుంటే మీరే నష్టపోతారని భారత్‌ను హెచ్చరించింది. చైనా.. తైవాన్‌ను తన అంతర్భాగంగా భావిస్తోంది. అయితే ఇటీవల తైవాన్‌కు చెందిన మహిళా పార్లమెంటు సభ్యుల బృందం భారత్‌లో పర్యటించడంతో చైనా ఈ హెచ్చరిక చేసింది.

02/14/2017 - 03:49

లాస్ ఏంజిలిస్, ఫిబ్రవరి 13: భారతీయ తబ్లా ప్లేయర్ సందీప్ దాస్‌తో కలిసి యో-యో మా రూపొందించిన ఆల్బం ‘సింగ్ మి హోం’ ప్రపంచ సంగీత విభాగంలో గ్రామీ పురస్కారాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన కళాకారుల స్వరకల్పనతో కూడుకున్నది కావడం ‘సింగ్ మి హోం’ ప్రత్యేకత.

02/12/2017 - 01:40

వాషింగ్టన్, ఫిబ్రవరి 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసల నిరోధంపై ఎంతమాత్రం రాజీ పడేలా లేరు. ఏడు ముస్లిం దేశాల ప్రజల వలసలపై తానిచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానాలు తిరస్కరించినప్పటికీ సరి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆదేశాలిస్తానని ట్రంప్ శనివారం స్పష్టం చేశారు. ‘ఈ పోరాటంలో మేమే గెలుస్తాం. అయితే ఇందులో కొంత ఆలస్యం కావచ్చు. కానీ విజయం మాదే. మాకు చాలా అవకాశాలు ఉన్నాయి.

02/11/2017 - 02:09

శాన్‌ఫ్రాన్సిస్కో, ఫిబ్రవరి 10: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజునుంచి వివాదాస్పద నిర్ణయాలతో పరిపాలన సాగిస్తున్న డొనాల్డ్‌ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏడు ముస్లిం దేశాల పౌరులపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను పునరుద్ధరించాలన్న ప్రభుత్వ అభ్యర్థనను 9వ సర్క్యూట్ అపీళ్ల కోర్టు ముక్తకంఠంతో తిరస్కరించింది.

02/10/2017 - 02:41

వాషింగ్టన్, ఫిబ్రవరి 9: అమెరికాను సందర్శించడానికి వీసాలకోసం దరఖాస్తు చేసుకునే విదేశీ ప్రయాణికులు ఇకపై అధికారులకు తమ సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. విదేశీ సందర్శకుల తనిఖీలను మరింత కఠినం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చర్య తీసుకోవాలని అనుకుంటున్నట్లు అమెరికా ఆంతరంగిక భద్రతా మంత్రి జాన్ కెల్లీ అమెరికా ప్రతినిధుల సభకు చెందిన హోంలాండ్ సెక్యూరిటీ కమిటీకి తెలియజేశారు.

02/10/2017 - 02:36

తమిళులకు అతి ముఖ్యమైన పండుగ తైపూసం సందర్భంగా గురువారం మలేసియా కౌలాలంపూర్‌లోని బటు కేవ్స్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

02/10/2017 - 02:34

ఇటలీకి చెందిన మహిళ షిరిడీ సాయనాథునికి 855 గ్రాముల బరువైన బంగారు కిరీటాన్ని బహూకరించింది. దీని వెల 28 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా

02/09/2017 - 05:28

శాన్‌ప్రాన్సిస్కో, ఫిబ్రవరి 8: ఏడు ముస్లిం దేశాలపై విధించిన వివాదాస్పద నిషేధంలో ట్రంప్ ప్రభుత్వానికి న్యాయస్థానంలో అగ్నిపరీక్షే ఎదురవుతోంది. అప్పీళ్ల కోర్టుకు చెందిన న్యాయమూర్తులు ఈ నిషేధం విషయంలో ట్రంప్ ప్రభుత్వాన్ని పదునైన పదజాలంతో నిలదీశారు. ఈ నిషేధాన్ని ఏవిధంగా సమర్థించుకుంటారు? ఇది ముస్లింల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా వివక్ష కనబర్చడమేనా? అంటూ ప్రశ్నించారు.

02/09/2017 - 01:23

వాషింగ్టన్, ఫిబ్రవరి 8: అమెరికాలో స్థిరపడాలని కోరుకునే విదేశీయులకు ఇది చేదు వార్త. దశాబ్ద కాలంలో అమెరికాకు చట్టబద్ధంగా వలస వచ్చేవారి సంఖ్యను సగానికి తగ్గించేందుకు వీలుగా ఒక చట్టాన్ని రూపొందించాలని ఇద్దరు సెనేటర్లు ప్రతిపాదించారు. అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకోవాలని లేదా గ్రీన్ కార్డు పొందాలని కోరుకుంటున్న వారి ఆశలపై ఈ చర్య నీళ్లు చల్లడమే.

02/08/2017 - 02:27

కాబూల్, ఫిబ్రవరి 7: ఆఫ్గనిస్తాన్ సుప్రీం కోర్టు వద్ద మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మరణించారు. మరో 41 మంది గాయపడ్డారు. పనివేళలు పూర్తయిన తరువాత ఇళ్లకు వెళ్లేందుకు కోర్టు సిబ్బంది ప్రాంగణంలో బస్సు ఎక్కుతున్న సమయంలో నడిచివచ్చిన ఆత్మహుతి బాంబర్ విస్ఫోటనం చెందాడు. ఈ సంఘన జరిగిన ప్రదేశానికి సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం, అమెరికా ఎంబసీ కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

Pages