S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/13/2016 - 08:34

ది హేగ్/బీజింగ్, జూలై 12: దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి చారిత్రక హక్కులు లేవని అంతర్జాతీయ వివాదాల ట్రిబ్యునల్ మంగళవారం తీర్పు చెప్పింది. దక్షిణ చైనా సముద్రంలో దాదాపు 90 శాతంపై తమదేనని వాదిస్తూ వస్తున్న చైనాకు ఈ తీర్పు పెద్ద ఎదురు దెబ్బగానే భావించవచ్చు.

07/13/2016 - 05:06

ఖాట్మండు, జూలై 12: నేపాల్‌లో కేపీ ఓలి నాయకత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా కాకుండానే సంక్షోభంలో పడింది. ఓలీ సర్కారుకు మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు సీపిఎన్ మావోయిస్ట్ చైర్మ న్ ప్రచండ ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఇరుపక్షాల మధ్య జరిగిన తొమ్మిది సూత్రాల ఒప్పందాన్ని అమలు చేయటంలో ఓలి పార్టీ నిర్లక్ష్యం వహిస్తోందని ప్రచండ ఆరోపించారు. ఈ మేరకు ప్రధానమంత్రికి లేఖ రాశారు.

07/12/2016 - 03:33

లండన్, జూలై 11: మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటిష్ మహిళా ప్రధానిగా ధెరీసామే పదవీ బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. ఇప్పటివరకూ ఈ పదవికి పోటీపడ్డ కన్సర్వేటివ్ పార్టీ నాయకురాలు ఆండ్రియా లీడ్‌సమ్ అనూహ్య రీతిలో తప్పుకోవడంతో దేశ ప్రధానిగా ధెరీసా ఎన్నికకు అవరోధాలు తొలగిపోయాయి. బుధవారం నాటికి దేశానికి కొత్త ప్రధాని వస్తారంటూ ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరాన్ వెల్లడించారు.

07/12/2016 - 03:20

నైరోబీ, జూలై 11: విద్వేషం, హింసాత్మక ధోరణులను రెచ్చగొట్టే వారి వల్లే సమత, సామరస్యమే పునాదిగా ఉన్న సమాజాలకు తీవ్ర విఘాతం కలుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదానికి హద్దులు, సరిహద్దులు లేవని, దానికి ఓ మతం,కులం, విలువ అంతకంటే లేదని నిప్పులు చెరిగారు.

07/12/2016 - 00:12

నైరోబీ, జూలై 11: భారత్ కెన్యాల మధ్య వ్యాపార సంబంధాలు బలోపేతం చేసుకోవటంలో భాగంగా ద్వంద్వ పన్ను విధానాన్ని రద్దు చేస్తూ ఇరు దేశాల మధ్య సోమవారం ఒక ఒప్పందం కుదిరింది. దీంతోపాటు మరో ఆరు ఒప్పందాలపైనా రెండు దేశాలూ సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్రికాదేశాల పర్యటనలో భాగంగా సోమవారం కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

07/12/2016 - 00:09

ఇస్లామాబాద్, జూలై 11: కాశ్మీర్‌లో భారత సైన్యం అణచివేత చర్యలకు పాల్పడుతోందని పాకిస్తాన్ తీవ్రస్థాయిలో ఆరోపించింది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వని ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పౌరులపై మితిమీరిన స్థాయిలో సైనిక చర్యలకు భారత్ ఒడిగడుతోందని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. భారత్ సైనిక చర్యను ఖండిస్తూ ఒక ప్రకటన జారీచేశారు.

07/11/2016 - 23:53

ఐరాస, జూలై 11: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేయాలని ఐక్య రాజ్యసమితి యోచిస్తోంది. ఏటా జూన్ 21న యోగా దినోత్సవంగా పాటించాలంటూ భారత్ చేసిన తీర్మానానికి ఐరాస ఆమోదం లభించడం, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది యోగా దినోత్సవం నాడు ప్రత్యేక స్టాంప్ విడుదల చేయాలని ఐరాస పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది.

07/11/2016 - 07:10

దార్-ఎస్-సలామ్, జూలై 10: నాలుగు ఆఫ్రికా దేశాల్లో పర్యటనలో భాగంగా టాంజానియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ‘సోలార్ మామాలు’గా పిలిచే ఆరు ఆఫ్రికా దేశాలకు చెందిన 30 మంది గ్రామీణ మహిళా సోలార్ ఇంజనీర్లతో ముచ్చటించారు.

07/11/2016 - 07:06

మెల్‌బోర్న్, జూలై 10: ఆస్ట్రేలియాలో వారం రోజులుగా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ఎన్నికల్లో తామే విజయం సాధించామని ప్రధాని మాల్కమ్ టర్న్‌బిల్ ప్రకటించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ అధినేత బిల్ షార్టెన్ తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రధాని టర్న్‌బిల్‌కు ఫోన్ చేసిన కొద్దిగంటల వ్యవధిలోనే ప్రధాని టర్న్‌బిల్ విజయం మాదేనంటూ ప్రకటించారు. ‘మా ప్రభుత్వ పథకాలే విజయాన్ని చేకూర్చాయి.

07/11/2016 - 07:04

ఢాకా, జూలై 10: భారత్‌లోని వివాదాస్పద బోధకుడు జకీర్ నాయక్‌కు చెందిన ‘పీస్ టివి బంగ్లా’ ప్రసారాలను బంగ్లాదేశ్ ఆదివారం నిషేధించింది.

Pages