S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/28/2016 - 11:35

మెక్సికో: దక్షిణ మెక్సికోలోని ఐదు రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు వెల్లడించారు. ఓక్సాకా ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒక్కసారిగా భవనాలు కదలడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటికి పరుగులు తీశారు.

06/27/2016 - 23:34

వాషింగ్టన్, జూన్ 27: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగడం (బ్రెగ్జిట్)పై చేసిన వ్యాఖ్యలను డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీవ్రంగా ఖండించారు. అలాంటి సమయాలలో ఇలాంటి బడాయి మాటలు మంచికన్నా చెడు ఎక్కువ చేస్తాయని ఆమె పేర్కొన్నారు.

06/27/2016 - 23:33

సింగపూర్, జూన్ 27: సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అందులో ప్రయాణిస్తున్న 240మంది సురక్షితంగా బయటపడ్డారు. చాంగి విమానాశ్రయం నుంచి మిలన్‌కు సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు బయలుదేరిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం రెండు గంటలపాటు ప్రయాణించిన తరువాత సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది.

06/27/2016 - 13:36

బీజింగ్‌: ఆంధ్రప్రదేశ్‌ గతేడాది 10.99శాతం వృద్ధి సాధించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15శాతం వృద్ధి రేటు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటనలో రెండో రోజు సోమవారం జెట్రో ప్రెసిడెంట్‌ యసూషి అకహోషితో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి రంగానికి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

06/27/2016 - 12:04

సింగపూర్: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. సింగపూర్ ఎయిర్‌పోర్టులో సోమవారం ఉదయం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానంలో మంటలు వ్యాపించాయి. వెంటనే దాన్ని కిందకు దింపడంతో 222 మంది ప్రయాణీకులు, 19 మంది సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు.

06/27/2016 - 07:58

వాషింగ్టన్, జూన్ 26: అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాటిక్ సభ్యులు అనూహ్యంగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయటాన్ని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు మార్క్ మీడోస్ తీవ్రంగా తప్పు పట్టారు. భారతదేశంలో రాజ్యసభలో అన్నాడిఎంకె సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నిరసనలు తెలపడానికి మనకూ తేడా లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.

06/27/2016 - 07:56

చికాగో, జూన్ 26: అమెరికా కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు శే్వత జాత్యభిమానాన్ని రెచ్చగొట్టే కటౌట్లు ఏర్పాటు చేయడం ఆగ్రహానికి గురయింది. ముఖ్యంగా ‘మేక్ అమెరికా వైట్ అగైన్’ అనే నినాదంతో కూడిన కటౌట్లను ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయింది.

06/26/2016 - 06:59

లండన్, జూన్ 25: యూరోపియన్ యూనియన్‌నుంచి వైదొలగాలని బ్రిటన్‌వాసులు రెఫరెండంలో ఓటువేయడంపైన ఇయు సైతం గుర్రుగా ఉంది. వీలయినంత త్వరగా యూరోపియన్ యూనియన్‌నుంచి తప్పుకుంటే మాకు కూడా మంచిదంటూ యూరోపియన్ కమిషన్ చ్మైన్ జీన్ క్లాడె జంకర్ వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయానికి విడాకుల లేఖ పంపడానికి బ్రిటన్ ప్రభుత్వానికి అక్టోబర్ వరకు సమయం ఎందుకు అవసరమో నాకు అర్థంకావడం లేదు.

06/26/2016 - 04:55

లండన్, జూన్ 25: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి అనుకూలంగా గురువారం జరిగిన రెఫరెండంలో తీర్పు రావడంతో షాక్ తిన్న బ్రిటన్‌వాసులు మరోసారి రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ రెఫరెండం కోరుతూ పెట్టిన ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేసిన వారి సంఖ్య ఒక్క రోజులోనే పదిలక్షలు దాటేసింది.

06/26/2016 - 02:49

వాషింగ్టన్, జూన్ 25: భారత్‌లో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జిఇఎస్)కు గనుక ఆహ్వానిస్తే తాను భారత్ సందర్శించే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ ఒబామా ఈ విషయం చెప్పారు.

Pages