S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/30/2017 - 03:11

ట్రంప్ ఇమిగ్రేషన్ ఉత్తర్వులపై అమెరికా భగ్గుమంది. ముస్లిం దేశాలపై విధించిన నిషేధంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆదివారం జాన్‌ఎఫ్ కెనడీ విమానాశ్రయంలో ఆందోళనకారుల నిరసనల దృశ్యమిది.

01/30/2017 - 03:07

న్యూయార్క్, జనవరి 29: అమెరికా అధ్యక్షుడయ్యాక డొనాల్డ్ ట్రంప్ మాటకు ఎదురుండదని అందరూ భావించారు. చెప్పినవన్నీ చేసి చూపించేదాకా ఆగేది లేదని అధికార పగ్గాలు చేపట్టన వారం రోజుల్లోనే ట్రంప్ స్పష్టమైన సంకేతాలిచ్చారు కూడా. అదే సమయంలో ఓ మహిళా న్యాయమూర్తి ఆయనకు ఝలక్ ఇచ్చారు. అమెరికాలో న్యాయ వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో ఆయనకు తెలియజెప్పారు. ఆ మహిళా జడ్జే ఆన్ ఎం డొనెల్లీ.

01/30/2017 - 03:09

న్యూయార్క్, జనవరి 29: శరణార్థుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విద్వేష పూరిత విధానాలపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముస్లిం దేశాలనుంచి శరణార్థులు తమ దేశంలో ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా అమెరికాలోని వివిధ విమానాశ్రయాల వద్ద వేలాది మంది తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.

01/30/2017 - 02:50

వాషింగ్టన్, జనవరి 29: అమెరికాలో ప్రవేశించే శరణార్థులపై తీవ్రమైన ఆంక్షలు విధించడంతోపాటు ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఏడు దేశాల పౌరులను తమ దేశంలోకి రానీయకుండా నిషేధిస్తూ అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన వివాదాస్పద ఉత్తర్వుపై ఇంటా, బయటా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన ఏమాత్రం చలించడం లేదు. పైపెచ్చు ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

01/30/2017 - 02:25

అడెన్, జనవరి 29: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత అమెరికా సైన్యాలు యెమెన్‌లో పెద్దఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 41మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు. 16మంది సాధారణ పౌరులు మరణించారు. చనిపోయిన పౌరుల్లో 8మంది మహిళలు, 8మంది పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు.

01/30/2017 - 01:35

వాషింగ్టన్, జనవరి 29: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఆ దేశ న్యాయమూర్తి ఒకరు స్పీడ్ బ్రేకర్ వేశారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలకు ప్రజలకు వ్యతిరేకంగా ట్రంప్ ఇచ్చిన అత్యంత వివాదాస్పద ఉత్తర్వులను న్యాయమూర్తి నిలుపుదల చేశారు. శరణార్థులను బలవంతంగా వారి దేశాలకు వెనక్కి పంపించి వేయటం, వీసాలు ఉన వారిని నిర్బంధించడం వంటి చర్యలను తక్షణం ఆపేయాలని ఆదేశాలిచ్చారు.

01/29/2017 - 03:55

లండన్, జనవరి 28: అమెరికాలోకి వస్తున్న శరణార్థులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన ఆంక్షలు విధించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శరణార్థుల పునరావాస కార్యక్రమాన్ని 120 రోజుల పాటు నిలిపివేసే ఎగ్జిక్యూటివ్ ఆదేశంపై ట్రంప్ సంతకం చేయడంపై 12 మంది నోబెల్ బహుమతి గ్రహీతలతో పాటుగా వేలాది మంది విద్యావేత్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

01/29/2017 - 03:52

వివిధ ప్రాంతాల నుంచి ప్రాణ భయంతో రక్షణ కోసం అమెరికాకు పరుగులు తీస్తున్న శరణార్థులకు ట్రంప్ తలుపులు మూసివేయరాదని పాకిస్తాన్‌కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ శనివారం కోరారు.

01/29/2017 - 03:49

ట్రంప్ నిర్ణయంపై ‘ఫేస్‌బుక్’ సిఇఓ మార్క్ జుకెర్‌బెర్గ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా ప్రధానంగా శరణార్థుల దేశమేనని, అందుకు ఎంతో గర్విస్తున్నానని, అయితే అమెరికాలోకి వస్తున్న శరణార్థులపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు ఎటువంటి దుష్ప్రభావానికి దారితీస్తాయోనని అందరి మాదిరిగానే తాను కూడా ఆందోళన చెందుతున్నాని ఆయన స్పష్టం చేశారు.
ఫేస్‌బుక్ సిఇఓ మార్క్ జుకెన్‌బర్గ్

01/29/2017 - 02:44

వాషింగ్టన్, జనవరి 28: అమెరికా సాయుధ దళాలను మరింతగా బలోపేతం చేయడానికి దారి తీసే ఓ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

Pages