S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/28/2016 - 03:26

మనీలా, జూలై 27: ఇద్దరు భారతీయులను ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు వరించింది. కర్నాటక సంగీత విద్వాంసుడు టిఎమ్ కృష్ణ (40), జాతీయ సఫారీ కర్మచారి ఆందోళన కన్వీనర్ బెజవాడ విల్సన్ (50)లను 2016 సంవత్సరానికిగాను పురస్కారానికి ఎంపిక చేశారు.

07/27/2016 - 17:57

ఖమిష్లి: సిరియాలో ఖమిష్లి నగరంలో బుధవారం బాంబు దాడులు జరిగాయి. ఘటనలో 44 మంది చనిపోయారు. 150 మంది గాయపడ్డారు. బాంబుదాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.

07/27/2016 - 14:18

దిల్లీ: మానవ హక్కుల కార్యకర్త బెజ్‌వాడ విల్సన్‌, సంగీత విద్వాంసులు టీఎం కృష్ణ ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసె అవార్డుకు 2016 సంవత్సరానికి ఎంపికయ్యారు. ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రామన్‌ మెగసెసె పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ఏటా అందజేస్తారు.

07/27/2016 - 11:24

ఫిలడెల్ఫియా: సామాజిక న్యాయం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతూన్న హిల్లరీనే అమెరికాకు సరైన అధ్యక్షురాలని, దేశంలో మార్పు ఆమె వల్లే సాధ్యమని ఆమె భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఫిలడెల్ఫియాలోని డెమోక్రటిక్‌ జాతీయ సమావేశంలో అమెరికా అధ్యక్ష ఎన్నికకు హిల్లరీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా బిల్‌ క్లింటన్‌ హిల్లరీపై ప్రశంసల వర్షం కురిపించారు.

07/27/2016 - 11:06

వాషింగ్టన్‌: హిల్లరీ క్లింటన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ నుంచి అధికారికంగా నామినేషన్‌ను స్వీకరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికకు డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. అధ్యక్ష ఎన్నికకు పోటీ పడనున్న తొలి మహిళగా హిల్లరీ నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో తలపడనున్నారు.

07/27/2016 - 08:19

అబుధాబి, జూలై 26: సౌరశక్తితో పనిచేసే ఇంపల్స్-2 తన చరిత్రాత్మక యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఒక్క చుక్క కూడా సంప్రదాయ ఇంధనం వాడకుండా, కేవలం సౌర ఇంధనంతో మొత్తం ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి విమానంగా ఇంపల్స్-2 రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం 4.05 గంటలకు అబుధాబి విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. ఇంపల్స్-2 నిరుడు మార్చి 9న తన విశ్వయాత్ర ప్రారంభించింది.

07/27/2016 - 08:18

ఫిలడెల్ఫియా, జూలై 26: అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశాలు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కే పుష్కలంగా ఉన్నాయని, ఆమె కాబోయే అధ్యక్షురాలని వెర్మొంట్ సెనెటర్ బెర్నే సాండర్స్ స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే హిల్లరీకే అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు.

07/27/2016 - 08:17

సగమిహర (జపాన్), జూలై 26: జపాన్‌లోని ఓ కేర్ సెంటర్‌లో ఓ ఉద్యోగి తన సహచర ఉద్యోగులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి 19మందిని హతమార్చాడు. కొన్ని దశాబ్దాల కాలంలో చాలా దారుణమైన మారణకాండగా దీన్ని చెప్పుకుంటున్నారు. జపాన్ రాజధాని టోక్యోకు పశ్చిమాన ఉన్న సగమిహర నగరంలో ఓ కేర్ సెంటర్‌లో సతోషి యుమాట్సు (26) పనిచేసేవాడు. కేర్ సెంటర్‌లో తప్పుడు పనులు చేయటంతో యాజమాన్యం అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగించింది.

07/26/2016 - 13:35

మొగాదిషు: సొమాలియా రాజధాని మొగాదిషు సమీపంలో మంగళవారం ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 8మంది పౌరులు మృతి చెందారు. కారు బాంబుతో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో భారీ పేలుడు సంభవించింది.దాడికి పాల్పడింది తామేనని అల్‌ షబీబ్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

07/26/2016 - 12:44

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో సోమవారం అర్ధరాత్రి ఉగ్రవాదులను పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారు. 10 మంది ఉగ్రవాదులు ఓ భవనంలోని నాలుగో అంతస్థులోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు భవనాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. తెల్లవారుజామున ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Pages