S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/06/2016 - 18:14

దుబాయి: ఐఎస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ)లో చేరవద్దని అడ్డుకున్నందుకు- కవల సోదరులు కన్నతల్లినే చంపేశారు రియాద్‌కు చెందిన ఖలీద్‌, సాహెల్‌ అల్‌ ఒరైనీ కవలసోదరులు. వీరు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదానికి ప్రభావితమై అందులో చేరేందుకు సిరియా వెళ్లబోయారు. వీరిని అడ్డుకోవడంతో తల్లి హలియా, తండ్రి, సోదరుడిని కత్తితో పొడిచారు. ఈ ఘటనలో హలియా మృతిచెందగా, తండ్రి, సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు.

07/06/2016 - 17:59

మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా) : లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ చెప్పారు. ఇందుకు అన్ని పార్టీలూ ఏకాభిప్రాయానికి వచ్చి, రాజ్యాంగ సవరణలు చేస్తే- అధిక సంఖ్యలో ఈవీఎంలు, తాత్కాలిక సిబ్బంది వంటి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

07/06/2016 - 17:56

డమాస్కస్: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 6 వేకువజామున ఒంటి గంట నుంచి జూలై 8 అర్ధరాత్రి వరకు 72 గంటలపాటు కాల్పులు జరపకూడదని సిరియా ఆర్మీ నిర్ణయించుకుంది. రంజాన్ నేపథ్యంలో ఆయుధాలకు ముస్లింలు దూరంగా ఉండాలని ఆర్మీ భావించిందని ప్రకటించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై కాల్పులకు ఈ నిషేధ ఆజ్ఞలు వర్తిస్తాయా అనే అంశంపై స్పష్టత లేదు.

07/06/2016 - 11:37

ఇస్తాంబుల్‌: టర్కీలో బుధవారం మిలిటరీ హెలికాప్టర్‌ కూలి ఏడుగురు అధికారులు మృతిచెందారు. హెలికాప్టర్‌ గైర్‌సన్‌ ప్రావిన్స్‌కి రాగానే కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మిగిలినవారు తీవ్రగాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

07/06/2016 - 11:35

యెమెన్‌: ఎడెన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో బుధవారం కారు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మిలిటరీ బేస్‌ను టార్గెట్‌ చేసుకుని ఈ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

07/06/2016 - 01:07

హోస్టన్, జూలై 5: రోదసి ప్రయోగాల పరంపరలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చరిత్ర సృష్టించింది. నాసా ప్రయోగించిన జునో రోదసి నౌక భూమి నుంచి అయిదు సంవత్సరాల పాటు ప్రయాణించి విజయవంతంగా గురుగ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. గ్రహాలకు రాజుగా, సౌరమండలంలో అత్యంత కీలకమైన గురుగ్రహ కక్ష్యలోకి భూమి నుంచి ఒక రోదసి నౌక ప్రవేశించగలగటం అంతరిక్ష పరిశోధనల్లో అతి పెద్ద ముందడుగుగా శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.

07/05/2016 - 06:51

రియాద్, జూలై 4: సౌదీ అరేబియా పట్టణాలైన మదీనా, ఖాటిఫ్, జెద్దాలు సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత బాంబు పేలుళ్లతో దద్దరిల్లాయి. రంజాన్ ఉపవాస నెల చివరి రోజున ఈ దాడులు జరగటం తీవ్రస్థాయిలో ఆందోళనకు దారితీసింది. ఈ సంఘటనల్లో పలువురు మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్లలో ఆయా మసీదుల వద్ద హాహాకారాలు మిన్నంటాయి.

07/04/2016 - 17:34

బీజింగ్‌: కుండపోత వర్షాల కారణంగా చైనాలో యాంగ్‌ట్జె నదికి వచ్చిన వరదల్లో 180 మంది మృతి చెందారు. రైల్వేలైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రహదారులను మూసివేశారు. ఏడు ప్రావిన్సుల్లో 10 నుంచి 50 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురిసింది. తీవ్రమైన గాలులు వీచాయి. 33మిలియన్ల మంది ప్రజలు అవస్థలు పడగా, 45మంది ఆచూకీ గల్లంతైంది. జుయిఝూ ప్రావిన్స్‌లో మట్టిపెళ్లలు విరిగిపడి 23మంది మృతి చెందారు.

07/04/2016 - 15:04

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఐసిస్ తీవ్రవాదులు సృష్టించిన నరమేధం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఆదివారం జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య సోమవారం ఉదయం నాటికి 213కు చేరింది. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

,
07/04/2016 - 05:10

బాగ్దాద్, జూలై 3: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం వేకువ జామున జరిగిన రెండు వేర్వేరు బాంబు దాడుల్లో 120మందికి పైగా మృతి చెందగా, మరో 140 మంది గాయపడ్డారని ఇరాక్ అధికారులు తెలిపారు. బాగ్దాద్ నగరం మధ్యలో నిత్యం రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతమైన కరాడాలో జరిగిన శక్తివంతమైన కారుబాంబు దాడిలో వందమందికి పైగా చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు, ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి.

Pages