S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/18/2016 - 05:38

బీజింగ్, డిసెంబర్ 17: దక్షిణ చైనా సముద్రంలో పిఎల్‌ఎ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) యుద్ధనౌక స్వాధీనం చేసుకున్న తమ అండర్ వాటర్ డ్రోన్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా అమెరికా విజ్ఞప్తి చేసిందని చైనా సైనిక దళం శనివారం ధ్రువీకరించింది. ఈ సమస్య విజయవంతంగా పరిష్కారమవుతుందని చైనా సైనిక దళం పేర్కొంది.

12/15/2016 - 08:23

ఏంజెల్స్, డిసెంబర్ 14: భారత కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసిన ప్రసిద్ధ సింగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ మరోసారి ఆస్కార్ బరిలో నిలిచారు. బ్రెజిల్‌కు చెందిన ప్రఖ్యాత సాకర్ క్రీడాకారుడు పీలే జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన ‘పీలే: బర్త్ ఆఫ్ ఏ లెజెండ్’ చిత్రానికి రెహ్మాన్ సంగీతం అందించారు. ఒరిజనల్ స్టోరీ, ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆయన ఆస్కార్‌కు పోటీ పడుతున్నారు.

12/15/2016 - 07:56

న్యూయార్క్, డిసెంబర్ 14: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావశీలత కలిగిన టాప్ టెన్ నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తొమ్మిదో స్ధానం లభించింది. మొత్తం 74 మంది నేతలకు సంబంధించి ఫోర్బ్స్ పత్రిక నిర్వహించిన ఈ సర్వేలో వరుసగా నాలుగో ఏడాది కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు రెండో స్థానం దక్కింది.

12/15/2016 - 06:49

వాషింగ్టన్, డిసెంబర్ 14:అమెరికా ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తానని, గత పాలకులు దేశ ప్రయోజనాలను ఘోరంగా విస్మరించారని దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు. ఇతర దేశాలతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందాలు, ఒడంబడికలన్నీ కూడా దేశ ప్రయోనాలకు ద్వితీయ ప్రాధాన్యతనిచ్చినవేనని, ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండదని ట్రంప్ అన్నారు. ‘బై అమెరికా..

12/14/2016 - 01:41

వాషింగ్టన్, డిసెంబర్ 13: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రముఖ ఫిలాంథ్రపిస్ట్ జంట వినీత్ నాయర్, అనుపమలు 2016 సంవత్సరానికి ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఫారిన్ పాలసీ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది.

12/14/2016 - 01:31

న్యూయార్క్, డిసెంబర్ 13: ప్రపంచ సమస్యలు, సవాళ్లకు దీటుగా ఐక్యరాజ్య సమితిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని కొత్త సెక్రటరీ జనరల్ యాంటోనియో గట్టర్స్ స్పష్టం చేశారు. ఐరాస ప్రత్యేక సమావేశంలో తొమ్మిదో సెక్రటరీ జనరల్‌గా ప్రమాణం చేసిన గట్టర్స్ ‘ప్రపంచ వ్యాప్తంగా ఎడతెగని సమస్యలుగా కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించేందుకు వ్యక్తిగతంగా కృషి చేస్తా’నని హామీ ఇచ్చారు.

12/14/2016 - 01:23

వాషింగ్టన్, డిసెంబర్ 13: ఎక్సొన్ మొబైల్ సిఇవో రెక్స్ టిల్లెర్‌సన్ అమెరికా నూతన విదేశాంగ మంత్రిగా కానున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ రెక్స్ విదేశాంగ మంత్రికి కావల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయని ప్రకటించారు. సమర్థత, ప్రాంతీయ రాజకీయాల్లో అపారమైన అనుభవం పరిగణనలోకి తీసుకునే ఆయనను ఎంపిక చేసినట్టు ట్రంప్ తెలిపారు.

12/13/2016 - 04:56

హైదరాబాద్, డిసెంబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్‌వేస్ విమానం సోమవారం అత్యవసర ల్యాండ్ అయింది. మస్కట్ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఈ విమానం చెన్నైలో వర్షాల కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే అత్యవసరంగా ల్యాండయింది. మరోవైపు కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దానిని కూడా శంషాబాద్‌లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

12/13/2016 - 00:05

లండన్, డిసెంబర్ 12: రక్షణ రంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న మొదటి అయిదు దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. సోమవారం విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం భారత్ ఏటా రక్షణ బడ్జెట్‌కు 5వేల కోట్ల డాలర్లను కేటాయిస్తోంది. రక్షణ బడ్జెట్‌కు అత్యధిక నిధులు కేటాయిస్తున్న దేశాల్లో నాలుగో దేశంగా భారత్ ఉందని ఈ నివేదిక పేర్కొంది. ఐహెచ్‌ఎస్ మర్కిత్ అనే సంస్థ ఈ నివేదికను రూపొందించింది.

12/12/2016 - 01:50

ఉయో, డిసెంబర్ 11: నైజీరియాలో నిర్మాణంలో ఉన్న ఓ చర్చి కుప్పకూలిన దుర్ఘటనలో 160మంది మరణించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. దక్షిణ నైజీరియాలోని ఉయోలోగల రీయినర్స్ బైబిల్ చర్చిలో ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో దాని పైకప్పు కుప్పకూలిపోయింది. నిర్మాణ లోపమే ఇందుకు కారణమా అన్న అంశంపై దర్యాప్తు జరిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆదివారం సాయంత్రం వరకూ 60 మృత దేహాలను వెలికి తీశారు.

Pages