S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/12/2016 - 01:28

మొగదిషు, డిసెంబర్ 11: సోమాలియా రాజధాని మొగదిషులో ఆదివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మందికి పైగా చనిపోగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. కాగా, ఈ దాడిని తామే జరిపినట్లు అల్‌ఖైదాతో సంబంధాలున్న షబాబ్ ఉగ్రవాద ముఠా ప్రకటించుకుంది. ఇప్పటివరకు తాము వేసిన లెక్కల ప్రకారం ఈ పేలుడులో 20 మందికి పైగా చనిపోయారని, వారిలో ఎక్కువమంది పౌరులేనని సోమాలియా పోలీసు అధికారి ఇబ్రహీం మహమ్మద్ చెప్పారు.

12/12/2016 - 01:26

కైరో, డిసెంబర్ 11: ఈజిప్టు రాజధాని కైరోలోని ప్రముఖ కాప్టిక్ క్రిస్టియన్ క్యాథడ్రైల్‌లో ఆదివారం జరిగిన బాంబు పేలుడులో కనీసం 25 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ఆదివారం ప్రార్థనలకోసం పెద్ద సంఖ్యలో జనం చేరినప్పుడు ఈ పేలుడు సంభవించింది.

12/12/2016 - 01:24

ఇస్తాంబుల్, డిసెంబర్ 11: టర్కీ మరోసారి ఆత్మాహుతి బాంబుదాడులతో దద్దరిల్లిపోయింది. దేశంలోని ముఖ్య నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి సంభవించిన జంట బాంబు పేలుళ్లలో కనీసం 38 మంది మృతిచెందగా, మరో 155 మంది గాయపడ్డారు.

12/12/2016 - 01:28

వాషింగ్టన్, డిసెంబర్ 11: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి పదవిని ఎక్సాన్ మొబైల్ సంస్థ సిఇఓ రెక్స్ టిల్లెర్సన్‌కు కట్టబట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తదుపరి ప్రభుత్వంలో ఈ పదవిని ఆశిస్తున్న వారిలో టిల్లెర్సన్ అందరికంటే ముందున్నాడు. దీంతో ఆయననే ఈ పదవికి ఎంపిక చేయాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

12/11/2016 - 08:14

ఇస్లామాబాద్, డిసెంబర్ 10: పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందువుల దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కారానికి నోచుకోనున్నాయి. ఇస్లామాబాద్‌లో ఆలయ నిర్మాణం, కమ్యూనిటీ సెంటర్, స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని హిందువులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇన్నాళ్లకు అధికారులు వీటికి ఆమోదం తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన కేపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ(సిడిఏ) సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

12/11/2016 - 07:57

ఓస్లో, డిసెంబర్ 10: కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ శనివారం ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించారు. నార్వే రాజధాని ఓస్లోలో నార్వే నోబెల్ కమిటీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శాంటోస్‌కి శాంతి పురస్కారాన్ని అందజేశారు.

12/11/2016 - 05:45

వాషింగ్టన్, డిసెంబర్ 10: జీవనోపాధి కోసం పొట్ట చేతబట్టుకుని అమెరికాలో అడుగిడుతున్న విదేశీయులపై పదేపదే అక్కసు వెళ్లగక్కుతున్న ఆ దేశ తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నైజాన్ని చాటుకున్నాడు. అమెరికాలోని సంస్థల్లో స్థానికులకు బదులుగా విదేశీయులను ఉద్యోగాల్లో చేర్చుకోవడాన్ని అనుమతించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పాడు.

12/10/2016 - 00:11

వాషింగ్టన్, డిసెంబర్ 9: భారత్ బలమైన ఆర్థిక శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని, అలాంటి దేశంతో వీలయినంత త్వరగా సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకోవడం వల్ల ఇరు దేశాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అమెరికాలో ముగ్గు రు రక్షణ నిపుణులు అంటూ, అందువల్ల వీలయినంత త్వరగా భారత్‌తో సంబంధాలను పెంపొందంచుకోవాలని త్వరలో బాద్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సలసా ఇచ్చారు.

12/10/2016 - 00:02

సియోల్, డిసెంబర్ 9: అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలు పార్క్ గియున్-హై అభిశంసనకు గురయ్యారు. శుక్రవారం ఆమెపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ ఆమోదించింది.

12/09/2016 - 05:00

హైదరాబాద్, డిసెంబర్ 8: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపంతో క్యాత్య పసిఫిక్ విమానం నిలిచిపోయింది. సిఎక్స్ 646 పసిఫిక్ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హాంగ్‌కాంగ్ వెళ్లాల్సి ఉంది. కాగా విమానంలో సాంకేతిక లోపంత తలెత్తడంతో తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే విమానాన్ని ల్యాండ్ చేశారు.

Pages