S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/08/2016 - 23:58

ఇస్లామాబాద్, డిసెంబర్ 8: ద్వైపాక్షిక చర్చల విషయంలో భారత్ లెక్కలేనితనంతో వ్యవహరిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. కాశ్మీర్ సమస్యకు ఫలవంతమైన పరిష్కారాన్ని సూచించే విధంగా చర్చలు జరిపేందుకు భారత్ ఏ మాత్రం చొరవ చూపించటం లేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీజ్ జకారియా గురువారం ఆరోపించారు. కాశ్మీర్ వివాదం పరిష్కారంలో అంతర్జాతీయ సమాజం కీలకపాత్ర పోషించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

12/08/2016 - 06:45

న్యూయార్క్, డిసెంబర్ 7: టైమ్ మ్యాగజైన్ ఏటా ప్రకటించే అత్యంత మేటి వ్యక్తిగా 2016 సంవత్సరానికి అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అమెరికా రియల్ ఎస్టేట్ టైకూన్, అత్యంత వాడివేడిగా, ఉత్కంఠగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీని ఓడించి విజేతగా నిలిచిన ట్రంప్‌ను పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించారు.

12/08/2016 - 06:44

ఇస్లామాబాద్, డిసెంబర్ 7: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పిఐఏ)కు చెందిన విమానం ఒకటి బుధవారం అబోటాబాద్ సమీపంలోని హవెలియన్ వద్ద కొండ ప్రాంతంలో కూలిపోవడంతో విమానంలోని 47 మంది చనిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఖైబర్ ఫక్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని చిత్రాల్‌నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన ఈ విమానం కొద్ది సేపటికే రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది.

12/08/2016 - 06:42

న్యూయార్క్, డిసెంబర్ 7: ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి అన్ని మార్గాలను భారత్ మూసేసిందని పాకిస్తాన్ ఆరోపించింది. కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించడంతోపాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిపై ఉందని స్పష్టం చేసింది.

12/08/2016 - 06:41

మేరేడు, డిసెంబర్ 7: ఇండోనేసియాలోని అసే రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తాకిడికి కనీసం 97 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. సుమత్రా దీవుల్లోని ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ఈ జిల్లాలో జనం తెల్లవారుజాము ప్రార్థనలకోసం సిద్ధమవుతుండగా ఈ భూకంపం సంభవించింది.

12/06/2016 - 02:09

న్యూయార్క్, డిసెంబర్ 5: అమెరికాకు చెందిన అపఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా నిర్వహించే ఈ ఏటి మేటి వ్యక్తి(పర్సన్ ఆఫ్ ది ఇయర్) ఆన్‌లైన్ రీడర్స్ పోల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఆదివారం ఆన్‌లైన్ రీడర్ పోల్ ముగిసే సమయానికి మోదీ 18 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు.

12/06/2016 - 01:20

కరాచీ, డిసెంబర్ 5: పాకిస్తాన్‌లోని కరాచీలో సోమవారం తెల్లవారు జామున నాలుగు నక్షత్రాల హోటల్‌లో చెలరేగడంతో ఊపిరాడక దాదాపు 11 మంది మృతిచెందగా, మరో 75 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పాక్‌లో అతిపెద్ద నగరమైన కరాచీలో ఇటువంటి ఘటన జరగడం రెండు వారాల్లో ఇది నాలుగోసారి.

12/05/2016 - 04:17

విప్లవ వీరుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోకు
ఆదివారం కన్నీటి వీడ్కోలు పలుకుతున్న జనం

12/05/2016 - 02:25

ఆక్లాండ్, డిసెంబర్ 4: అమెరికాలో శనివారం దారుణ దుర్ఘటన చోటు చేసుకుంది. శాన్‌ఫ్రాన్సిస్కోకు సమీపంలోని ఓ భవంతిలో జరుగుతున్న రేవ్‌పార్టీలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించటంతో దాదాపు 40మంది మరణించారు.

12/05/2016 - 02:22

లండన్, డిసెంబర్ 4: అధ్యాపకులు బోర్ కొట్టేలా పాఠాలు చెప్పారని, ఫలితంగా తనకు డిగ్రీలో సెకండ్ క్లాసే వచ్చిందని, దాని కారణంగానే లాయర్‌గా కెరీర్‌లో చాలా ఆదాయం కోల్పోయానంటూ భారతీయ సంతతికి చెందిన విద్యార్థి ఒకరు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీపై కేసు వేసాడు. ఫైజ్ సిద్దీఖి ఈ యూనివర్శిటీకి చెందని బ్రేస్‌నోస్ కాలేజిలో మోడరన్ హిస్టరీ చదివాడు.

Pages