S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/10/2016 - 02:22

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పెట్రిచ్‌నుంచి పీటర్ మారిట్జ్‌బర్గ్ స్టేషన్ వరకూ రైలులో ప్రయాణిస్తూ అభివాదం చేస్తున్న దృశ్యం. ఒకప్పుడు పీటర్ మారిట్జ్‌బర్గ్ స్టేషన్ వద్దే మహాత్మా గాంధీని రైల్లోంచి జాతి విద్వేషంతో అమానుషంగా బయటకు తోసేశారు.

07/10/2016 - 02:23

వాషింగ్టన్, జూలై 9: హెచ్-1బి, ఎల్-1 వీసాల ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తున్న నారతీయ ఐటి కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బే తగలనుంది. ఇకపై ఈ వీసాలకు అనుమతి ఇవ్వరాదంటూ, రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ద్వైపాక్షిక సభ్యులు అమెరికా కాంగ్రెస్‌లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు.

,
07/10/2016 - 01:09

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం డర్బన్‌లోని ఫోనిక్స్ ప్రాంతంలో స్థానికులతో ముచ్చటించారు. మహాత్మాగాంధీ మనుమరాలు ఇళా గాంధీని కలిసి జాతిపితకు నివాళులర్పించారు. అనంతరం పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో సత్యాగ్రహంపై రాసిన కొటేషన్లను ఆసక్తిగా చదివారు.

07/10/2016 - 01:04

కిన్షాసా, జూలై 9: హైదరాబాద్‌లో భర్త చేతిలో దారుణంగా హత్యకు గురయిన కాంగో మహిళ సింథియా వెచెల్ ఉదంతం కాంగోలోని ఆమె స్వస్థలమైన కిన్షాసాలో స్థానికులు అక్కడి భారతీయ వ్యాపారులపై ప్రతీకార దాడులకు దిగడానికి కారణమైంది.

07/10/2016 - 01:02

పీటర్‌మారిట్జ్‌బర్గ్, జూలై 9: దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం డర్బన్ వరకు రైల్లో ప్రయాణించారు. పెట్రిచ్ స్టేషన్‌నుంచి నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్ వరకు ఆయన రైల్లో ప్రయాణించారు. నాడు మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో జాతివివక్ష కారణంగా రైల్లోనుంచి బైటికి తోసేయబడిన సంఘటనకు గుర్తుగా మోదీ శనివారం అదే మార్గంలో ప్రయాణం చేశారు.

07/10/2016 - 00:53

బీజింగ్, జూలై 9: చైనా తూర్పు తీరంలో టైఫూన్ కల్లోలం సృష్టించింది. సుమారు 4 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. బలమైన గాలులు, భారీ వర్షాలతో అతలాకుతలమైందని అధికారులు తెలిపారు. టైఫూన్ తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది తొలిసారి రెడ్ అలెర్ట్ ప్రకటించారు. చైనా స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 1:45కి ఫుజియన్ ప్రొవిన్స్‌లోని షిషి నగరంలో గాలులు మొదలయ్యాయి.

07/10/2016 - 00:52

కరాచీ, జూలై 9: పాకిస్తాన్‌లో ప్రముఖ సామాజిక కార్యకర్త, ఈదీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈది శుక్రవారం రాత్రి కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న సత్తార్ ఈది కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పేదలు, అనాథలకు పాతిక సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్నారు. భారతదేశానికి చెందిన మూగ చెవిటి బాలిక గీత పదకొండేళ్ల వయసులో పొరపాటున పాకిస్తాన్‌లో ప్రవేశించినప్పుడు ఈది ఆమెను కాపాడారు.

07/10/2016 - 00:44

లండన్, జూలై 9: యూరోపియన్ యూనియన్ ( ఈయూ) నుంచి వైదొలగాలన్న అంశంపై మరోసారి రెఫరెండం జరపాలన్న డిమాండ్‌ను బ్రిటన్ ప్రభుత్వం శనివారం అధికారికంగా తిరస్కరించింది. సుమారు 41లక్షల మంది సంతకాలతో వచ్చిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. జూన్ 23న జరిగిన రెఫరెండంలో మెజార్టీ ప్రజలు ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

07/09/2016 - 18:03

హైదరాబాద్‌: కజకిస్థాన్‌, రష్యాలలో పర్యటించేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కజకిస్థాన్‌లో శనివారం స్వాగతం లభించింది. తొలుత అల్మాటీ చేరుకున్న చంద్రబాబు బృందం కోక్‌టోబో పర్యాటక ప్రాంతాన్ని సందర్శించింది.

07/09/2016 - 17:12

డర్బన్: జాతిపిత మహాత్మాగాంధీని నాడు అవమానించిన పీటర్ మ్యారిట్జ్‌బర్గ్ రైల్వేస్టేషన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం చేరుకున్నారు. మహ్మాత్యాగాంధీ ప్రయాణించిన రైలు మార్గంలో నేడు మోదీ ప్రయాణించారు.1893లో సరిగ్గా ఇక్కడే మహాత్మా గాంధీని తెల్లవారు రైలునుంచి కిందకు తోసేశారు. ఫస్ట్‌క్లాస్ టికెట్ తీసుకుని రైలు ప్రయాణం చేస్తున్న గాంధీని తెల్లవారు కిందకు తోసేశారు.

Pages