S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/09/2016 - 02:28

ఢాకా, అక్టోబర్ 8: బంగ్లాదేశ్ సైన్యం శనివారం ఇస్లామిక్ ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై దాడులు చేసి 11 మందిని హతమార్చింది. సైన్యం దాడుల్లో చనిపోయిన మిలిటెంట్లలో కొత్తగా ఏర్పాటయిన జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ ప్రాంతీయ కమాండర్ కూడా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో వీరంతా చనిపోయారు.

10/09/2016 - 02:22

వాషింగ్టన్, అక్టోబర్ 8: అమెరికా.. భారత్ విషయంలో తన విధానాన్ని మార్చుకోవడంతో పాకిస్తాన్ రష్యాతో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవాలని భావిస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన కాశ్మీర్ వ్యవహారాల దౌత్యవేత్త, సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ ఈ విషయం చెప్పారు. అమెరికా తన రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు.

10/09/2016 - 02:19

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాను మాథ్యూ తుపాను అతలాకుతలం చేసింది.
వివిధ సంఘటనల్లో దాదాపు 470 మంది మృతిచెందారు. 175 కి.మీ వేగంతో
గాలులు వీచడంతో చెట్లు కూలిపోవడంతోపాటు విద్యుత్, కమ్యూనికేషన్
వ్యవస్థ అస్తవ్యస్తమైంది. విమాన సర్వీసులు నిలిచిపోయాయ.

10/09/2016 - 02:15

లాహోర్, అక్టోబర్ 8: ముంబయి ఉగ్రదాడి ప్రధాన కుట్రదారు, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్‌పై చర్య తీసుకోవాలని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడొకరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

10/09/2016 - 02:14

వాషింగ్టన్/న్యూయార్క్, అక్టోబర్ 8: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీపడుతున్న ప్రముఖ వ్యాపార దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2005 సంవత్సరంలో ట్రంప్ ఒక మహిళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యకరమైన రీతిలో మాట్లాడిన వీడియో వెలుగులోకి రావడమే ఇందుకు కారణం.

10/08/2016 - 06:51

వాషింగ్టన్, అక్టోబర్ 7: పాకిస్తాన్ తన ప్రభుత్వ విధానంలో ఉగ్రవాదాన్ని ఒక పనిముట్టుగా ఉపయోగిస్తోందని భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ప్రపంచంలో జరిగిన ప్రతి పెద్ద ఉగ్రవాద దాడి అడగుజాడలు పాకిస్తాన్‌లో ఉన్నాయని, అందువల్ల ఆ దేశమంటే ప్రపంచమం తా భీతిల్లుతోందనే వాస్తవం బయటపడిందని ఆయన అన్నారు.

10/08/2016 - 06:51

వాషింగ్టన్, అక్టోబర్ 7: నిన్న మొన్నటివరకు కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ కాశ్మీర్ సమస్య పరిష్కారమయితేనే దక్షిణాసియాలో శాంతి నెలకొంటుందని చెప్తూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు కొత్త పాట మొదలుపెట్టింది. అఫ్గానిస్థాన్‌లో శాంతికి, కాశ్మీర్‌కు లంకెపెట్టింది. అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొనాలంటే కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని అంటోంది. ‘కాబూల్‌లో శాంతి కాశ్మీర్‌తో ముడిపడి ఉంది.

10/08/2016 - 06:50

వాషింగ్టన్, అక్టోబర్ 7: పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించే బిల్లును తాము సమర్థించబోమని అమెరికా శువ్రారం స్పష్టం చేసింది. అయితే భారత్‌కు కూడా ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను తుడిచిపెట్టడానికి ఈ ప్రాంతంలోని దేశాల ప్రభుత్వాలతో కలిసి పని చేస్తామని తెలిపింది.

10/08/2016 - 06:48

కరాచీ, అక్టోబర్ 7: బలూచిస్తాన్‌లో ఓ రైలులో సంభవించిన 2 రిమోట్ బాంబు పేలుళ్లలో ఆరుగురు దుర్మరణం చెందారు. 14 మంది గాయపడ్డారు. క్వెట్టా నుంచి రావల్పింది వైపువస్తున్న జఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. బోలాన్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై అమర్చిన బాంబులను రైలు రాగానే రిమోట్ కంట్రోల్‌తో పేల్చివేసినట్టు పోలీసులు వెల్లడించారు. రెండు బాంబులు ఒకదానితరువాత ఒకటి పేలినట్టు వారు చెప్పారు.

10/08/2016 - 06:09

ఫ్లోరిడా, అక్టోబర్ 7: అమెరికాలోని ఫ్లోరిడాలో మాథ్యూ హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. హైతీ దీవుల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 842మంది మరణించినట్లు అధికారికంగా అందుతున్న సమాచారం. వేల కొద్దీ జనం ఈ తుఫాను దెబ్బకు నిరాశ్రయులయ్యారు.

Pages