S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/08/2016 - 04:57

జైసల్మేర్, అక్టోబర్ 7: భద్రతా కారణాల దృష్ట్యా 2018 డిసెంబర్ నాటికల్లా పాకిస్తాన్‌తో సరిహద్దులను పూర్తిగా మూసివేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. సరిహద్దుల్లో పరిస్థితిపై నాలుగు సరిహద్దు రాష్ట్రాల మంత్రులు, అధికారులతో శుక్రవారం జైసల్మేర్‌లో సమావేశమై సమీక్షించారు.

10/08/2016 - 04:51

ఓస్లో, అక్టోబర్ 7: కొలంబియా అధ్యక్షుడు జాన్ మాన్యుయెల్ సాంటోస్‌ను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి వరించింది. దాదాపు అయిదు దశాబ్దాలుగా తన దేశంలో యుద్ధ నివారణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా శాంతి పురస్కారాన్ని అందిస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది.

10/07/2016 - 01:52

ఇస్లామాబాద్, అక్టోబర్ 6: ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మిలిటెంట్ల కొమ్ము కాయడం మానుకోవాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆర్మీని గట్టిగా హెచ్చరించినట్లు ప్రముఖ పాక్ దినపత్రిక ‘డాన్’ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. సైన్యానికి పాక్ ప్రభుత్వం ఈ విధంగా హెచ్చరించడం అసాధరణంగా కూడా ఆ పత్రిక పేరొకంది.

10/07/2016 - 01:50

గిల్గిత్, అక్టోబర్ 6: ‘‘ఇక్కడ ఉగ్రవాదుల శిబిరాల మధ్యన మా బతుకులు దుర్భరంగా మారాయి. వీటిని ఇక్కడి నుంచి తుడిచిపెట్టేంత వరకు మాకు మనశ్శాంతి లేదు’’ అని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని సామాన్య ప్రజలు ఆక్రోశం వెలిబుచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలకు వ్యతిరేకంగా గురువారం అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

10/07/2016 - 01:34

న్యూయార్క్, అక్టోబర్ 6: ఐక్యరాజ్య సమితి తొమ్మిదవ సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధాన మంత్రి ఆంటోనియో గట్టర్స్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భద్రతా మండలి సభ్య దేశాలు ముక్తకంఠంతో గట్టర్స్ పేరును ఆమోదించాయి. అనంతరం లిస్బన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ పదవిని అత్యంత బాధ్యతాయుతంగా, అంకితభావంతో నిర్వర్తిస్తానని చెప్పారు.

10/07/2016 - 00:41

వాషింగ్టన్, అక్టోబర్ 6: భారత్ విషయంలో ప్రత్యేకించి కాశ్మీర్ వివాదం విషయంలో తన దృక్పథంతో అమెరికా ఏకీభవించకుంటే పాకిస్తాన్.. చైనా, రష్యాలను ఆశ్రయించనుంది. పాకిస్తాన్‌కు చెందిన ఒక దౌత్యవేత్త స్వయంగా ఈ విషయం ప్రకటించారు. అమెరికాను ‘దిగజారుతున్న ప్రపంచ శక్తి’ అని కూడా ఆయన అభివర్ణించారు. ‘అమెరికా ఇంకెంతో కాలం ప్రపంచ శక్తిగా మనజాలదు. అది దిగజారుతున్న శక్తి.

10/06/2016 - 07:26

స్టాక్‌హోం, అక్టోబర్ 5: రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఈసారి మూడు దేశాలకు చెందిన ముగ్గురు శాస్తవ్రేత్తలు సంయుక్తంగా సాధించుకున్నారు. అణు మెషిన్స్ (మాలిక్యులర్ మెషిన్స్)ను అభివృద్ధి చేసినందుకు గాను ఫ్రాన్స్ శాస్తవ్రేత్త జీన్ పిర్రె సౌవేజ్, బ్రిటన్‌లో జన్మించిన జె ఫ్రాజర్ స్టోడ్డార్ట్, డచ్ సైంటిస్ట్ బెర్నార్డ్ ఫెరింగాలను బుధవారం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది.

10/06/2016 - 07:25

హేగ్, అక్టోబర్ 5: భారత్, పాకిస్తాన్, బ్రిటన్‌లకు వ్యతిరేకంగా మార్షల్ ద్వీపకల్పాలు దాఖలు చేసిన అణ్వస్త్ర కేసును ఐక్యరాజ్య సమితి ఉన్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. రిపబ్లిక్ ఆఫ్ ద మార్షల్ ఇస్‌ల్యాండ్స్ దాఖలు చేసిన ఈ చరిత్రాత్మక కేసును 16 మంది న్యాయమూర్తులు గల ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ధర్మాసనం మెజారిటి తీర్పుతో కొట్టివేసింది.

10/06/2016 - 07:22

న్యూయార్క్, అక్టోబర్ 5: ఐక్యరాజ్య సమితీ తదుపరి సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గట్టెర్స్ ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన రహస్య పోలింగ్‌లో గట్టర్స్ విజయావకాశాలు మరింతగా బలపడ్డాయి. గురువారం ఇందుకు సంబంధించి లాంఛనంగా భద్రతా మండలిలో ఓటింగ్ జరుగుతుందని, అనంతరం ఆంటోనియో ఎన్నికను ధృవీకరిస్తారని రష్యా రాయబారి విటాలే చుర్కిన్ తెలిపారు.

10/05/2016 - 07:45

స్టాక్‌హోమ్, అక్టోబర్ 4: ఈ ఏడాది ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతిని ముగ్గురు బ్రిటిష్ శాస్తవ్రేత్తలు దక్కించుకున్నారు. టోపాలాజికల్ ఫేజ్ ట్రాన్సిషన్స్, టోపాలాజికల్ ఫేజెస్ ఆఫ్ మ్యాటర్స్‌కు చెందిన పరిశోధనలు నిర్వహించినందుకు గాను డేవిడ్ దౌలె, డంకన్ హాల్డన్, మైకేల్ కోస్టెర్లిజ్‌లకు ఈ అవార్డు లభించింది. ఈ ముగ్గురు శాస్తవ్రేత్తలు కూడా బ్రిటన్‌లో పుట్టి అమెరికాలో పని చేస్తున్నారు.

Pages