S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/30/2016 - 02:37

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 29: పాకిస్తాన్ ఆధీనంలో గల భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం బుధవారం అర్ధరాత్రి తరువాత ఆపరేషన్ (‘సర్జికల్ స్ట్రైక్’)ను నిర్వహించిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గురువారం నియంత్రణ రేఖ (ఎల్‌ఒసి) వద్ద పరిస్థితిని, ఆత్మరక్షణ దిశగా పాకిస్తాన్ సైనిక సన్నద్ధతను సమీక్షించారు.

09/29/2016 - 08:56

వాషింగ్టన్, సెప్టెంబర్ 28: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని, ఇరు దేశాలు వౌఖికంగా, రాతపూర్వకంగా వ్యక్తం చేసే అభిప్రాయాలు సామరస్యపూర్వకంగా ఉండాలని అమెరికా పిలుపునిచ్చింది. ఇరు దేశాల మధ్య సుహృద్భావ పూరితంగా, గొప్పగా సమాచార మార్పిడి జరగాలని, మరింత సమన్వయం సాధించాలని పేర్కొంది.

09/29/2016 - 08:33

వాటికన్ సిటీ, సెప్టెంబర్ 28: అలెప్పోలో బాంబు దాడులకు పాల్పడిన వ్యక్తులు ఏదో ఒక రోజు దేవునికి సమాధానం చెప్పుకోవల్సి ఉంటుందని పోప్ ఫ్రాన్సిస్ స్పష్టం చేశారు. హింసకు పాల్పడడం, ప్రోత్సహించడం రెండూ తీవ్రమైన తప్పిదాలేనని బుధవారం ఆయన వ్యాఖ్యానించారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పోప్ మాట్లాడుతూ ‘బాంబుదాడికి ఎవరైతే బాధ్యులో వారు దేవుడికి సమాధానం చెప్పుకోల్సి ఉంటుంది’ అని అన్నారు.

09/29/2016 - 08:32

టెల్‌అవీవ్, సెప్టెంబర్ 28: పాలస్తీనాతో దశాబ్దాలుగా సాగిన సంఘర్షణలకు స్వస్తిపలికి ఇరుదేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు విశ్వప్రయత్నం చేసిన ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత షిమన్ పెరెస్ (93) బుధవారం కన్నుమూశారు. మంగళవారం ఆయన శారీరక అవయవాలన్నీ విఫలమయ్యాయని, అంతకుముందు వచ్చిన జబ్బువల్ల మెదడుకూడా చికిత్స చేయలేనంతగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు.

09/29/2016 - 08:32

ఢాకా, సెప్టెంబర్ 28: ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ఎనిమిది దేశాల సార్క్ సదస్సు నిర్వహణ దాదాపు అనుమానంలో పడింది. సదస్సులో భాగస్వామ్యం కావటం లేదంటూ భారత్ ప్రకటించిన కొద్ది గంటల్లోపే పాకిస్తాన్ మినహా మిగతా ఆరు దేశాలూ స్పందించాయి. బంగ్లాదేశ్, భూటాన్‌లతోసహా అన్ని సభ్య దేశాలూ పాకిస్తాన్ వైఖరినే తప్పుపట్టాయి. తాము సదస్సును బహిష్కరించటానికి పాకిస్తానే కారణమని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

09/28/2016 - 08:13

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 27: సింధూజలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తే ఐక్యరాజ్యసమితిని ఆశ్రయిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసుకోవటం కానీ, తప్పుకోవటం కానీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం చెల్లుబాటు కాదని పాకిస్తాన్ సీనియర్ దౌత్యవేత్త, ఆ దేశ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం గురించి జాతీయ అసెంబ్లీలో ఆయన వివరించారు.

09/28/2016 - 08:09

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 27: మైనార్టీ హిందువుల వివాహాలను రిజిస్టర్ చేసుకునే వీలు కల్పిస్తూ పాకిస్తాన్ పార్లమెంట్ ఓ చారిత్రక జాతీయ చట్టాన్ని ఆమోదించింది. హిందువుల కనీస వివాహ వయస్సును 18ఏళ్లుగా నిర్ణయించింది. మిగతా మతాలకు చెందిన వారిలో పురుషులు వివాహం చేసుకోవడానికి కనీస వయస్సు 18కాగా మహిళలకు పదహారు సంవత్సరాలు.

09/28/2016 - 08:08

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 27: పాకిస్తాన్ నేతలు భారత్ వ్యతిరేక ప్రేలాపనలు మానలేదు. వాళ్ల మాటలు ఏ స్థాయికి వెళ్లాయంటే ఉరీలోని ఆర్మీ క్యాంపులో మన జవాన్లపై మనమే దాడి చేయించి చంపుకున్నామనేంతగా వెళ్లింది. ఉరీ ఆర్మీ క్యాంపులో 18మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడి ఘటన భారత్ తానుగా సృష్టించిదేనని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం అన్నారు.

09/28/2016 - 08:01

అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ముఖాముఖిలో డెమొక్రటిక్ పార్టీ నామినీ హిల్లరీ హిట్ కొట్టింది. తొట్టతొలి డిబేట్‌లో రిపబ్లికన్ అభ్యర్థిని లక్షలాదిమంది సమక్షంలో చిత్తుచేసింది. నిన్న మొన్నటి వరకూ ఎవరిదారిలో వారు ప్రచారం చేసుకుంటూ వచ్చిన వీరిద్దరూ ఎదురుబదురుగా అనేక జాతీయ అంశాలపై చర్చించారు. ట్రంప్ తనదైన శైలిలో వ్యక్తిగత దాడులకు దిగినా హిల్లరీ

09/27/2016 - 05:17

చారిత్రక 500వ టెస్టు మ్యాచ్‌ని టీమిండియా గెల్చుకుంది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టును విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ 197 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది.

Pages