S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/23/2016 - 00:31

న్యూయార్క్, సెప్టెంబర్ 22: ఉరి ఘటన నేపథ్యంలో ఓ వైపు ఐరాసలో భారత్ పాక్‌పై దుమ్మెత్తి పోయడం, మరోవైపు ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు అండగా నిలుస్తుండడం లాంటి ఘటనలు జరుగుతూ ఉంటే చైనా మాత్రం పాకిస్తాన్ తమకు చిరకాల మిత్ర దేశమని, తమ బంధం విడదీయలేనిదని చెబుతూ ఉండడం గమనార్హం.

09/23/2016 - 00:40

కైరో, సెప్టెంబర్ 22: సుమారు 600 మంది అక్రమ వలసదారులతో వెళ్తున్న పడవ ఒకటి ఈజిప్టు తీరానికి దగ్గర్లో సముద్రంలో మునిగిపోవడంతో కనీసం 42 మంది చనిపోగా, మరో 400 మందికి పైగా గల్లంతయ్యారు. కైరోకు దక్షిణంగా 120 కిలోమీటర్ల దూరంలో కఫ్-్రఅల్‌షేక్ తీరానికి దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఈజిప్టు, సిరియా ఆఫ్రికా దేశాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారు.

09/23/2016 - 00:40

లండన్, సెప్టెంబర్ 22: అంతర్జాతీయ ఉన్నత విద్యా రంగంలో మన దేశం తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపర్చుకుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వ విద్యాలయాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన జాబితాలో రికార్డు స్థాయిలో మన దేశానికి చెందిన 31 విద్యా సంస్థలకు చోటు లభించింది. కాగా, ఈ జాబితాలో బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అగ్రస్థానంలో నిలిచింది.

09/22/2016 - 14:08

ఐరాస : పాకిస్థాన్‌ ఓ ఉగ్రవాద దేశమని, యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్‌ తీరుపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐరాస జనరల్‌ అసెంబ్లీలో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన అనంతరం భారత్‌ తన వాదనలను దీటుగా వినిపించింది.

09/22/2016 - 08:28

న్యూయార్క్, సెప్టెంబర్ 21: కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా భారత్- పాక్‌ల మధ్య శాంతియుత సంబంధాలు నెలకొనే అవకాశమే లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో బుధవారం మాట్లాడిన షరీఫ్ భారత్‌తో సత్సంబంధాలను పాదుగొల్పేందుకు తాము చేస్తున్న కృషిని వివరించారు. అన్ని వివాదాస్పద అంశాలనూ శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రతిపాదిస్తూ తాము ఎన్నో ప్రయత్నాలు చేశామని వివరించారు.

09/22/2016 - 07:55

వాషింగ్టన్, సెప్టెంబర్ 21: భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌కు ఇదో చెంపపెట్టు. అమెరికా ప్రతినిధుల సభలో ఉభయపక్షాలకు చెందిన ఇద్దరు శక్తివంతమైన సభ్యు లు పాకిస్తాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పేర్కొంటూ ఒక బిల్లును ప్రవేశపెట్టారు.

09/21/2016 - 16:28

వాషింగ్‌టన్: ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా పాక్‌ను పేర్కొంటూ అమెరికాలోని ఇద్దరు కీలక చట్టసభ సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లిక్ పార్టీకి చెందిన టెడ్ పో, ఉగ్రవాదంపై కాంగ్రెస్ కమిటీ సభ్యుడైన డెమోక్రాట్ డానా రోహ్రబచర్ సంయుక్తంగా- హెచ్ ఆర్ 6069 అనే బిల్లును సభ ముందుకు తెచ్చారు.

09/21/2016 - 16:12

అంకారా: టర్కీలోని ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం వద్ద బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఎంబసీలోకి చొరబడేందుకు యత్నించగా, ఆ వ్యక్తిని అదుపు చేయడానికి కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో టర్కీలోని అన్ని దౌత్యకార్యాలయాలను వారం క్రితమే మూసివేశారు.

09/21/2016 - 14:30

బంగ్లాదేశ్ : ఉగ్రవాదానికి మద్ధతు పలికే ఏ దేశమైనా తమకు శత్రువేనని, యురిలో భారత సైనికులపై పాకిస్థాన్ చేసిన ఉగ్రదాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ అసద్‌జమాన్ ఖాన్ కమాల్ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు. 1971 నుంచి బంగ్లాకు, భారత్‌కు మిత్రుత్వం ఉందని, క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు అండగా నిలుస్తామని అసద్‌జమన్ స్పష్టం చేశారు.

09/21/2016 - 01:14

మనీలా, సెప్టెంబర్ 20: సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ విమానం పైలట్ ఒకరు పొరపాటున ఎమర్జన్సీ అలారం బటన్ నొక్కడంతో కలకలం రేగింది. అలారం మోగడంతో ఒక్కసారిగా ప్రయాణిలు భీతిల్లిపోయారు. అంతేకాదు.. విమానాశ్రయంలోని భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. హైజాక్ జరిగిపోయి ఉంటుందన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమైంది.

Pages