S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/21/2016 - 01:11

న్యూయార్క్, సెప్టెంబర్ 20: కాశ్మీర్‌లో దురాగతాలకు తక్షణం స్వస్తి చెప్పి కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇస్లామిక్ దేశాల సహకార మండలి (ఓఐసి) భారత్‌ను కోరింది.

09/20/2016 - 18:14

యూరీ : 18 మంది సైనికులను కోల్పోయి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత సైనికులు 10 మంది పాక్ము ష్కురులను మట్టుబెట్టారు. యూరీ సెక్టార్‌లోని లచిపొరాలో పాక్ మంగళవారం మధ్యాహ్నం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. భారత శిబిరాలపై గుళ్లవర్షం కురిపించింది. దీంతో స్పందించిన భారత ఆర్మీ పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. మరికొందరు ముష్కరులు తిరిగి పాక్‌లోకి పరుగులంకించుకున్నారు.

09/20/2016 - 17:43

దిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని ఉరీలో సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిని అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనేందుకు అఫ్గానిస్థాన్‌ సహాయ సహాకారాలను అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం ఫోన్‌లో తెలియజేశారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు ఆయన నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

09/20/2016 - 17:33

శ్రీనగర్‌: పాక్‌ సైన్యం జమ్ము కాశ్మీర్‌లో ఉరీ సెక్టార్‌లోని లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వద్ద మంగళవారం సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపింది. ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి జరిగిన రెండు రోజుల్లోనే పాక్‌ సైన్యం సరిహద్దులో కాల్పులకు తెగబడింది. పాక్‌ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పి కొట్టింది.

09/20/2016 - 08:09

సోధి సాంబ, సెప్టెంబర్ 19: ఉగ్రవాద దాడిలో తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగుతూ తానూ సైన్యంలోకి దేశానికి సేవచేస్తానని పదేళ్ల వన్ష్ ప్రకటించాడు. వన్ష్ ఎవరో కాదు... యూరి సెక్టార్‌లో ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన రవి పాల్ కుమారుడు. దివంగత హవల్దార్ 23 ఏళ్ల నుంచి డోగ్రా రెజిమెంట్‌లో సేవలదిందస్తున్నారు. బారాముల్లా జిల్లాలోని యూరిలో ఆదివారం నాటి ఉగ్రవాద మూకల దాడుల్లో ఆయన చనిపోయారు.

09/20/2016 - 07:38

జెనీవా, సెప్టెంబర్ 19: యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నైజాన్ని విశ్వ వేదికపై భారత్ ఎండగట్టింది. ఆక్రమిత కాశ్మీర్‌ను తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని కట్టిపెట్టాలని తెగేసి చెప్పింది.

09/19/2016 - 18:17

ఢిల్లీ : పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని ప్రధాని మోదీ నేతృత్వంలో సోమవారం జరిగిన భేటీలో మంత్రుల బృందం నిర్ణయించింది. కశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదుల ఘాతుకాలపై సోమవారం ప్రధాని నివాసంలో చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, మనోహర్‌ పారికర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత దోవల్‌, ఆర్మీ చీఫ్‌ దల్బీందర్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

09/19/2016 - 18:14

బీజింగ్: కశ్మీర్ అంశంపై భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యూరీ ఘటన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్‌ సరిహద్దులోని యూరీ సైనిక శిబిరంలో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తున్నట్లు చైనా పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాలు సహకరించుకోవాలని సూచించింది.

09/19/2016 - 14:25

న్యూజర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో ఎలిజబెత్‌ రైల్వే స్టేషన్‌ పట్టాలపై ఆదివారం రాత్రి బాంబును అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులుబాంబును నిర్వీర్యం చేశారు. రైల్వేస్టేషన్‌ను ఖాళీ చేయించి ఎఫ్‌బీఐ బృందం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది.

09/19/2016 - 14:22

ఐక్యరాజ్యసమితి : జమ్ము-కాశ్మీర్‌లో భారత సైనిక స్థావరంపై దుశ్చర్యకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాలని. ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ ఖండించారు. కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి అందరూ కృషి చేయాలని మూన్‌ సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. దేశం కోసం ప్రాణాలొదిలిన వీర సైనికులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.

Pages