S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/19/2016 - 06:35

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 18: యూరీ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంప్‌పై జరిగిన ఉగ్రవాద దాడి వెనుక తమ హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలను పాకిస్తాన్ తిరస్కరించింది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా తమనే అనుమానించడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తింది.

09/19/2016 - 06:31

పోర్లమార్, సెప్టెంబర్ 18: అలీన దేశాల కూటమిలో ఉగ్రవాద నిరోధక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ ధ్వజమెత్తింది. ఉగ్రవాదుల నిరోధానికి సంబంధించి అలీన దేశాలతో ఓ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అడ్డగించిన ఒకే ఒక దేశం పాకిస్తాన్ అని భారత్ తెలిపింది.

09/19/2016 - 04:55

న్యూయార్క్, సెప్టెంబర్ 18: మరికొన్ని గంటల్లో ఐరాస కీలక భేటీకి వివిధ దేశాల నేతలు రానున్న తరుణంలో అమెరికాలో రెండు బాంబు పేలుడు సంఘటనలతో అట్టుడికింది. వీటిలో ప్రషర్ కుకర్ బాంబు పేలుడు ఘటనలో 29మంది గాయపడ్డారు. మాన్‌హట్టన్‌లోని చెల్సియాలో బాంబు పేలుడు ఘటన జరిగిన కొద్ది వ్యవధిలోనే న్యూయార్క్‌లో ఈ విస్ఫోటనం సంభవించింది. ఈ పేలుడును ఉద్దేశపూర్వక ప్రయత్నంగా న్యూయార్క్ మేయర్ అభివర్ణించారు.

09/17/2016 - 17:57

మొగదిషు: సోమాలియాలో శనివారం ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు జవాన్లు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఉగ్ర సంస్థ అల్‌ షబాబ్‌ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మిలిటరీ వాహనాలపై దాడి చేసి, పలువురిని చంపేశామని అల్‌ షబాబ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ ప్రతినిధి షేక్‌ అబు ముసాబ్‌ ప్రకటించాడు.

09/17/2016 - 06:43

పెషావర్, సెప్టెంబర్ 16: వాయువ్య పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో శుక్రవారం ఓ మసీదుపై జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 23 మంది మృతి చెందారు. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్ధనల సందర్భంగా బుట్మానాలో ఉగ్రవాదులు తెగబడ్డారు. ఆఫ్గన్ సరిహద్దు గిరిజన జిల్లా మహ్మండ్‌లో మసీదుపై ఆత్మాహుతి బాంబుదాడి జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ‘మసీదులో ప్రార్థనలు జరుగుతున్నాయి.

09/16/2016 - 17:28

పెషావర్: పాకిస్థాన్‌లోని పేయిఖాన్ గ్రామంలో శుక్రవారం ఓ మసీదులో ప్రార్థనల సందర్భంగా ఆత్మాహుతి బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా 24 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి అల్లాహో అక్బర్ అని నినాదిస్తూ తనకు తాను పేల్చేసుకున్నాడు.

09/16/2016 - 16:31

స్టాక్‌హోమ్: అరెస్ట్ వారెంట్‌ను నిలిపివేయాలంటూ వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే పెట్టుకున్న పిటిషన్‌ను స్వీడన్ అప్పీలు కోర్టు శుక్రవారం కొట్టివేసింది. రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేపై జారీ అయిన అరెస్ట్ వారెంట్ సబబే అని పేర్కొంది. ప్‌ కేసులో ఇంకా ఆయనను అనుమానితుడుగానే పరిగణిస్తున్నట్టు తెలిపింది. అసాంజే ఇంకా పరారీలో ఉంటూనే నిర్బంధంలో ఉన్నాడా? అని కోర్టు ప్రశ్నించింది.

09/16/2016 - 15:38

దిల్లీ: భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన ఒడిశా వ్యక్తి ధన మాఝీకి బహ్రెయిన్‌ రాజు నుంచి రూ. 8.87లక్షల చెక్కు అందింది. సామాజిక కార్యకర్త అచ్యుత సమంత సహకారంతో దిల్లీ వెళ్లి మాఝీ తన చెక్కును తీసుకున్నాడు. అంబులెన్స్‌ సదుపాయం అందుబాటులో లేకపోవడం, వేరే వాహనంలో తరలించేందుకు డబ్బులు లేకపోవడంతో ధన మాఝీ తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు.

09/16/2016 - 07:41

వాషింగ్టన్, సెప్టెంబర్ 15: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో సహా వివిధ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు, ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైతే విదేశాంగ విధానంపై ప్రభావం చూపించవచ్చని ఒక నివేదిక పేర్కొంది.

09/16/2016 - 07:38

వాషింగ్టన్, సెప్టెంబర్ 15: అస్వస్థతకు గురయిన హిల్లరీ క్లింటన్ తన ఆరోగ్యానికి సంబంధించిన తాజా మెడికల్ రికార్డులను గురువారం విడుదల చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ నిమోనియా వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ గెలిస్తే అమెరికా అధ్యక్ష పదవిని నిర్వహించేందుకు ఆమె ఆరోగ్యం సహకరిస్తుందా?

Pages