S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/16/2016 - 07:01

వాషింగ్టన్, సెప్టెంబర్ 15: సిఐఎ మాజీ కాంట్రాక్టర్ అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ విజిల్‌బ్లోయర్ కాదని, అమెరికా జాతీయ భద్రతను, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టిన వ్యక్తి అని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖకు చెందిన లక్షలాది రహస్య పత్రాలను బహిర్గతం చేయడం ద్వారా స్నోడెన్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

09/15/2016 - 16:11

ఇస్లామాబాద్‌: గురువారం ఉదయం కరాచీ వెళ్తున్న అవామ్ ఎక్స్‌ప్రెస్ అదే ట్రాక్ నిలిపి ఉన్న గూడ్స్‌ను ఎదురుగా ఢీకొంది. ఈ ఘటన ముల్తాన్ సమీపంలోని క్వెటాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు. 20 మంది పరిస్థితి విషయంగా ఉంది. క్షతగాత్రులను ముల్తాన్‌లోని రైల్వే ఆస్పత్రికి తరలించారు.

09/15/2016 - 07:58

వాషింగ్టన్, సెప్టెంబర్ 14: స్వల్ప అస్వస్థతకు గురైన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ గురువారం నుంచి యథావిధిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. న్యుమోనియాతో బాధపడుతున్న హిల్లరీ కొద్దిరోజులుగా ప్రచారానికి దూరంగా ఉన్నారు. విశ్రాంతి తరువాత ఆమె కోలుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ఉండగా గొం తుకు సంబంధించిన సమస్య తలెత్తింది.

09/15/2016 - 07:26

న్యూయార్క్, సెప్టెంబర్ 14: పర్యావరణ మార్పుపై పారిస్‌లో జరిగిన చరిత్రాత్మక ఒప్పందాన్ని భారత్‌సహా మరికొన్ని దేశాలు త్వరలోనే ఆమోదిస్తాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరాంతం నుంచి ఒప్పందం అమలు కావాలంటే దీన్ని భారత్‌సహా మరికొన్ని దేశాలు రాటిఫై చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

09/15/2016 - 07:03

జెనీవా, సెప్టెంబర్ 14: నిన్న మొన్నటి వరకూ కాశ్మీర్ అంశాన్ని ఐరాసలో ప్రస్తావించి భారత్‌ను ఇరకాటంలో పడేసిన పాకిస్తాన్‌కు ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. మొట్టమొదటి సారిగా బలూచిస్తాన్ అంశాన్ని ఐరాసలో ప్రస్తావించింది. అక్కడి ప్రజలపై పాకిస్తాన్ సాగిస్తున్న దాడులను ప్రపంచ దేశాల దృష్టికి తెచ్చింది.

09/14/2016 - 02:39

జెనీవా, సెప్టెంబర్ 13: మానవ హక్కుల విషయంలో ఐక్యరాజ్య సమితితో సహకరించడానికి నిరాకరిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోందని ఐరాస హెచ్చరిస్తూ సిరియా, ఇరాన్, వెనిజులాలాంటి అనేక దేశాల్లో పరిస్థితుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

09/14/2016 - 02:38

బీజింగ్, సెప్టెంబర్ 13: భారత్, చైనాల మధ్య వివిధ అంశాలపై సమస్యలు ఉన్నప్పటికీ, ఇరుదేశాల మధ్య స్నేహం వాటిని అధిగమిస్తుందని చైనా పేర్కొంది. రెండు దేశాలకు లాభదాయమైన సహకారాన్ని విస్తరించుకుంటూ భారత్‌తో చైనా కలిసి పని చేస్తుందని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చన్‌యంగ్ తెలిపారు. అభివృద్ధి భాగస్వామ్యంలో రెండు దేశాలు కూడా కలిసి పని చేస్తాయన్నారు.

09/14/2016 - 02:35

లండన్, సెప్టెంబర్ 13: తను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి దయాదాక్షిణ్యాలు కనబరచలేదంటూ యుకెలోని ఓ ప్రబుద్ధుడు ఇ-బెలో తన భార్యను అమ్మకానికి పెట్టాడు. యార్క్‌షైర్‌కు చెందిన సిమన్ గత వారం తన 27ఏళ్ళ భార్య లియాండ్రాను అమ్మకానికి పెడుతున్నట్టు ఆమె ఫొటోను ఇ-బెలో పెట్టాడు. అమెను కొనేందుకు దాదాపు 65వేల 880పౌండ్ల వరకూ బిడ్లు వెళ్లాయి.

09/13/2016 - 18:08

కరాచీ: మంగళవారం బక్రీద్‌ నాడు పాక్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండగా షియా వర్గీయులను లక్ష్యంగా చేసుకుని రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. శిఖాపూర్‌ జిల్లా ఖాన్‌పూర్‌ ప్రాంతంలో నలుగురు దుండగులు మసీదుపై దాడి చేశారు. ఓ దుండగుడు తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడగా మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇద్దరు పోలీసులు సహా 10 మంది గాయపడ్డారు.

09/13/2016 - 12:33

న్యూయార్క్‌: ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్‌ హెడ్‌ చందాకొచ్చర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవో శిఖా శర్మ ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘50 మంది అంతర్జాతీయ శక్తిమంతమైన మహిళల’ జాబితాలో స్థానం సంపాదించారు. యూరోజోన్‌లోని శాంటండర్‌ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బోటిన్‌ ఫోర్బ్స్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు.

Pages