S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/13/2016 - 01:32

వాషింగ్టన్, సెప్టెంబర్ 12: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందంజలో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు కొత్తచిక్కు వచ్చిపడింది. 9/11 ఘటనకు పదిహేనేళ్లు అయిన నేపథ్యంలో న్యూయార్క్‌లోని గ్రౌండ్‌జీరో దగ్గరకు వచ్చిన హిల్లరీ అకస్మాత్తుగా పడిపోవటం, అక్కడినుంచి వెళ్లిపోవటంతో ఆమె ఆరోగ్యంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రచారానికి ఒక్కసారిగా బలం చేకూరినట్లయింది.

09/12/2016 - 17:06

అంకారా: టర్కీలోని వాన్‌ నగరంలో సోమవారం కారు బాంబు పేలుడు సంభవించి 27 మంది గాయపడినట్లు గవర్నర్‌ కార్యాలయం తెలిపింది.ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసులు ఉన్నట్లు తెలిపింది. కుర్దిష్‌ మిలిటెంట్లే కారు బాంబుతో దాడి చేసి ఉంటారని ఏకే పార్టీ డిప్యూటీ ఛైర్మన్‌ బెసిర్‌ అతలే ఆరోపించారు.

09/12/2016 - 12:37

సియోల్‌: ఉత్తరకొరియాలో వరదల కారణంగా 133 మంది మృతిచెందగా, 395 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఉత్తరకొరియా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐరాస ఈ వివరాలను ప్రకటించింది. 35వేల ఇళ్లు, 8,700 ప్రభుత్వ భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస తెలిపింది. వరద ప్రాంతాల్లో సహాయచర్యలు చేపట్టినట్లు ఉత్తరకొరియా పేర్కొంది.

09/12/2016 - 12:34

బర్మింగ్‌హామ్‌ : అమెరికాలోని బర్మింగ్‌హామ్‌ గేట్‌సిటీలో ఆదివారం రాత్రి శాంతి ర్యాలీ పూర్తయిన కొద్ది సేపటికే గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. అక్కడి నుంచి పరారయ్యారు. ర్యాలీ చూసేందుకు వచ్చిన ఆరుగురు పౌరులు గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే కాల్పులకు పాల్పడింది ఎవరన్నది తెలియరాలేదు.

09/12/2016 - 07:22

సియోల్, సెప్టెంబర్ 11: రెండు రోజుల క్రితం అణు పరీక్ష జరిపి అంతర్జాతీయంగా కలకలం రేపిన ఉత్తర కొరియా ఆంక్షల విధింపు నేపథ్యంలో మరింతగా ధిక్కార స్వరాన్ని వినిపించింది. తమను అణ్వస్త్ర దేశంగా గుర్తించాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించింది.

09/12/2016 - 07:19

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: ‘అమెరికాను ఎవరూ ఓడించలేరు.. మనల్ని చీల్చే అవకాశం ఎవరికీ ఇవ్వొద్దు’9/11 పదిహేనో వార్షిక సభలో అధ్యక్షుడు ఒబామా ప్రజలకు పిలుపునిచ్చారు. అల్‌ఖైదా, ఐసిస్ పేరేదైనా ఎంతటి ఉగ్రవాద సంస్థ అయినా కూడా అమెరికా జోలికొస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఉద్ఘాటించారు.

09/11/2016 - 03:02

డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, సెప్టెంబర్ 10: ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడానికి ప్రజలంతా సమష్టిగా పోరాడాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం ఇక్కడ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్ర దాడి జరిగి 15 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని రేడియో, ఆన్‌లైన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

09/11/2016 - 02:52

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 10: తాజాగా అణు పరీక్షలు నిర్వహించినందుకు ఉత్తర కొరియాపై మరిన్ని కొత్త ఆంక్షలు విధించనున్నట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి హెచ్చరించింది. ఉత్తర కొరియా తాజాగా అయిదోసారి అణు పరీక్షలు నిర్వహించడాన్ని మండలి తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ శాంతి, భద్రతలకు ఈ పరీక్షలు ముప్పని పేర్కొంది.

09/11/2016 - 02:24

ఢాకా, సెప్టెంబర్ 10: బంగ్లాదేశ్‌లోని ఓ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 26మంది చనిపోయారు. 74మంది కాలిన గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

09/10/2016 - 17:09

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఇండస్ట్రియల్ ఏరియా తాంగిలో శనివారం ఉదయం 6.15 ప్రాంతంలో ఓ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడుకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. నాలుగంతస్తుల భవనంలో ఈ పేలుడు జరగడంతో భవంతిలోని కొంతభాగం కుప్పకూలింది. 20కి పైగా అగ్నిమాపక శకటాలు దింపిన సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Pages