S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/08/2016 - 05:14

ఉగ్రవాద నిరోధన, పౌర అణు ఇంధన సహకారం, వ్యాపార వాణిజ్య సహకారం విస్తృత స్థాయిలో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, జపాన్‌లు నిర్ణయించాయి. ఆసియాన్ ఇండియా, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
జపాన్ ప్రధాని షింజో అబేతో బుధవారం చర్చలు జరుపుతున్న దృశ్యం

09/07/2016 - 18:02

లావోస్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం లావోస్‌లో జపాన్‌ ప్రధాని షింజో అబెతో సమావేశమయ్యారు. జపాన్‌, భారత్‌ సంబంధాలను బలోపేతం చేసే దిశగా మోదీ చర్చలు జరిపారు.

09/07/2016 - 14:44

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనకు బుధవారం లావోస్ బయల్దేరి వెళ్లారు. 14వ భారత్-ఏసియా, 11వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. భారత్-ఏసియా సద్ససుకు, ఆసియా శిఖరాగ్ర సదస్సుకు హాజరు అవుతారు. రక్షణ, భద్రత, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునే అంశంపై మోదీ ఈ సదస్సుల్లో చర్చించే అవకాశముంది.

09/07/2016 - 00:24

కరాచీ, సెప్టెంబర్ 6: అద్దాలమేడలో కూర్చుని ఎదుటవారిపై రాళ్లు విసరడం మానుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత్ సలహా ఇచ్చింది. కాశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని భారత్ పునరుద్ఘాటించింది. బలూచీస్తాన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని పాక్‌లోని భారత హైకమిషనర్ గౌతం బంబావాలే సమర్ధించారు.

09/07/2016 - 00:20

వాషింగ్టన్, సెప్టెంబర్ 6: గతంలో ఎన్నడూలేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రభావితం చేయడానికి రష్యా ప్రయత్నిస్తోందని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు విజయాన్ని చేకూర్చే లక్ష్యంతోనే తమ దేశ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు.

09/05/2016 - 06:40

హాంగ్జౌ (చైనా), సెప్టెంబర్ 4: ఉగ్రవాదంపై పోరాడేందుకు కలసికట్టుగా విస్తృత ప్రయత్నాలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన చైనాలోని హాంగ్జౌలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాధినేతల సమావేశంలో ప్రసంగిస్తూ, ఉగ్రవాదులకు ఊతమిచ్చి, వారిని ప్రేరేపిస్తున్న దేశాలను ఏకాకులను చేయాలని డిమాండ్ చేశారు.

09/05/2016 - 06:34

హాంగ్‌ఝా (చైనా), సెప్టెంబర్ 4: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం చైనా అధ్యక్షుడికి పలు బహుమతులను అందజేశారు. వీటిలో చైనా చిత్రకారుడు రూపొందించిన మోదీ తైలవర్ణ చిత్రం (ఆయిల్ పెయింటింగ్) తో పాటు చైనా భాషలోకి తర్జు మా చేసిన భగవద్గీత, పురాతన భారతీయ గ్రంథాలు, స్వామి వివేకానందుడి విశిష్టతను తెలియజేసే వ్యాసాలు ఉన్నాయి.

09/05/2016 - 06:31

హాంగ్‌ఝౌ, సెప్టెంబర్ 4: పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా నిర్మిస్తున్న చైనా- పాక్ ఆర్థిక కారిడార్, అలాగే పాకిస్తాన్ భూభాగంనుంచి కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై భారత దేశం తన ఆందోళనను చైనాకు తెలియజేసింది. హాంగ్‌ఝౌలో జరుగుతున్న జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం కోసం ఇక్కడికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు.

09/05/2016 - 07:22

వాటికన్ సిటీ, సెప్టెంబర్ 4:విమర్శలను తట్టుకుంటూ..తాను అనుకున్న సేవా సామ్రాజ్యానికి తిరుగులేని సామ్రాజ్ఞిగా ఎదిగేందుకు మదర్ థెరెసా వేసిన ప్రతి అడుగూ సం క్లిష్టం..సవాళ్లు, సమస్యల మయ మే! వేటిని ఖాతరు చేయకుండా తాను అనుకున్న లక్ష్యానికి జీవిత కాలంలోనే చేరువ కాగలిగారు కాబట్టే థెరెసాకు మహోన్నతమైన ఖ్యాతి, కీర్తి లభించాయి. మదర్ థెరెసాకు క్యాథలిక్ సెయింట్‌హుడ్ అంత తేలిగా ఏమీ రాలేదు.

09/05/2016 - 05:55

వాటికన్‌సిటీ, సెప్టెంబర్ 4: మానవతామూర్తికి మహోన్నత గౌరవం లభించింది. నాలుగు దశాబ్దాలపాటు పేదలకు నిస్వార్థంగా సేవ చేసి, నిజమైన ప్రేమకు నిర్వచనం తెలియజేసిన మదర్ థెరెసాకు దైవత్వ కల్పన జరిగింది. ప్రేమ లేకపోవటమే పేదరికమన్న ఆమె సమస్త కేథలిక్ ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవతాస్థానాన్ని అధిష్ఠించింది.

Pages