S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/04/2016 - 02:19

హనోయ్, సెప్టెంబర్ 3: ప్రధాని నరేంద్ర మోదీ వియత్నాం పర్యటన సందర్భంగా ఇరు దేశాలు వివిధ రంగాల్లో సహకారానికి సంబంధించి 12 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ, వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ జువాన్‌ల సమక్షంలో ఇరుదేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వియత్నాం కోస్ట్ గార్డు కోసం మన దేశానికి చెందిన ఎల్ అండ్ టి సంస్థ హైస్పీడ్ గస్తీ బోట్లను నిర్మిస్తుంది.

09/04/2016 - 03:08

హనోయ్, సెప్టెంబర్ 3: వియత్నాంతో రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ దేశానికి 50 కోట్ల డాలర్ల రుణాన్ని ఇవ్వడానికి భారత్ అంగీకరించింది. అలాగే ప్రాంతీయ సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక సంబంధాల స్థాయికి పెంచుకోవాలని కూడా ఇరు దేశాలు నిర్ణయించాయి.

09/04/2016 - 01:45

హాంగ్జౌ (చైనా), సెప్టెంబర్ 3: అమెరికా అధ్యక్షుడిగా ఆసియా ఖండంలో చివరిసారి పర్యటిస్తూ జి-20 సమావేశంలో పాల్గొనేందుకు చైనా వెళ్లిన బరాక్ ఒబామా బృందానికి హాంగ్జౌ విమానాశ్రయంలో నిరసన సెగలు ఎదురయ్యాయి.

09/04/2016 - 03:17

వాటికన్ సిటీ/ కోల్‌కతా, సెప్టెంబర్ 3: మదర్ థెరిస్సా.. అంటే పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. క్రైస్తవులే కాక ఆమెను అభిమానించే వారిలో లక్షలాది మంది క్రైస్తవేతరులూ ఉన్నారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం వాటికన్ సిటీలో నిర్వహించే కార్యక్రమంలో మదర్ థెరిస్సాను దేవతగా ప్రకటించనున్నారు.

09/04/2016 - 01:25

వాషింగ్టన్, సెప్టెంబర్ 3: ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్‌లో తక్షణం సంస్కరణలు రావాలని అమెరికా స్పష్టం చేసింది. రాజకీయ నేతల జోక్యం ఎక్కువైపోయి ఆ వ్యవస్థ కుంటుపడుతోందని ఓ నివేదికలో వెల్లడించారు. ‘ఐఎఎస్‌లు ఉత్సవ విగ్రహాల్లా మారిపోతున్నారు. దీనికి కారణం రాజకీయ జోక్యమే. కాలం చెల్లిన విధానాలు కూడా వ్యవస్థ కుంటుపడేలా చేస్తున్నాయి’ అని పేర్కొంది.

09/04/2016 - 01:24

హనోయ్, సెప్టెంబర్ 3: వియత్నాంలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి మోదీ శనివారం ఆ దేశ ప్రధాని గుయెన్ జువాన్ హుక్‌తో కలసి కాసేపు సరదాగా చేపలను వేటాడటంతోపాటు హనోయ్‌లోని చారిత్రక పగోడా దేవాలయాన్ని, వియత్నాం జాతీయ నేత హోచిమిన్ నివసించిన స్టిల్ట్ హౌస్‌ను సందర్శించారు.

09/04/2016 - 01:12

న్యూయార్క్, సెప్టెంబర్ 3: రోజురోజుకూ పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు తీవ్రతను ఐక్యరాజ్య సమితి సభ్యులు గుర్తించాలని, అంతర్జాతీయ ఒడంబడికను ఆమోదించే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఉగ్రవాద సమస్యపై పోరాడేందుకు రెట్టింపు ప్రయత్నాలు చేయాలని ప్రపంచ దేశాలకు భారత్ విజ్ఞప్తి చేసింది.

09/03/2016 - 11:43

వియత్నాం: భారత ప్రధాని నరేంద్రమోదీ వియత్నాం పర్యటన సందర్భంగా హనోయ్‌లో ఆ దేశ ప్రధానితో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్‌-వియత్నాం మధ్య 12 ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, తెలిపారు. రక్షణ, భద్రత రంగాల్లో ఒప్పందాలు సంతోషకరమని, ఒప్పందాల వల్ల ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి అవకాశముందన్నారు.

09/03/2016 - 07:30

హనోయ్, సెప్టెంబర్ 2:దాదాపు పదిహేనేళ్ల తర్వాత వియత్నాంలో పర్యటించిన తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ శుక్రవారం రాజధాని నగరమైన హనోయ్‌లోకి అడుగు పెట్టారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, ఉగ్రవాద నిరోధక చర్యలపై వియత్నాం అగ్ర నాయకత్వంతో విస్తృత చర్చలు జరుపుతారు.

09/03/2016 - 07:25

వాషింగ్టన్, సెప్టెంబర్ 2: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌తో పరిచయానికి ముందు 1990 దశకంలో తాను వ్యభిచార వృత్తిలో (ఎస్కార్ట్)ఉన్నట్లుగా ఆరోపిస్తూ తన పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచురించినందుకు బ్రిటీష్ దినపత్రిక ‘ది డైలీ మెయిల్’, అమెరికాకు చెందిన ఒక బ్లాగ్‌పై ట్రంప్ భార్య, గతంలో మోడల్‌గా పని చేసిన మెలానియా ట్రంప్ 15 కోట్ల డాలర్లకు పరువు నష్టం

Pages