S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/24/2016 - 16:52

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం ఆత్మహుతి దాడిలో ముగ్గురు పోలీసుల సహా 12 మంది మృతిచెందారు. సైదీ జిల్లా కాధిమియా ప్రాంతంలోని ఒక చెక్‌ పాయింట్‌ వద్ద దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. 20 మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

07/24/2016 - 12:36

ఢిల్లీ: చైనాకు చెందిన అధికార వార్తా సంస్థ 'జిన్హువా' తరఫున పనిచేస్తున్న ముగ్గురు జర్నలిస్టులు జూలై 31వ తేదీలోగా దేశం విడిచిపెట్టాలని ఇండియా ఆదేశించింది.

07/24/2016 - 03:22

న్యూఢిల్లీ, జూలై 23:ముగ్గురు చైనా పాత్రికేయులను భారత్ బహిష్కరించింది. చైనా అధికార వార్తా సంస్థ జిన్హువాలో పనిచేస్తున్న వూ కియాంగ్, లూ టాంగ్, షియాంగాంగ్‌ల వీసాలను పొడిగించడానికి భారత్ నిరాకరించింది. ఇప్పటికే ఇరు దేశాల సంబంధాలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం వల్ల పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది.

07/24/2016 - 03:19

ఐక్యరాజ్య సమితి, జూలై 23: భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలంటే ఆ రెండు దేశాలతో పాటు సభ్య దేశాల సౌహార్ద్రత అవసరమని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద నిరోధక కమిటీ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ‘సభ్య దేశాల సౌహార్ద్రత లేకుండా సమస్యను ఎలా పరిష్కరించగలం’ అని కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ జీన్-పాల్ లాబోర్డే అన్నారు.

,
07/24/2016 - 02:04

కాబూల్, జూలై 23: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం సంభవించిన శక్తివంతమైన పేలుడులో 80 మంది మృతి చెందారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక ప్రతిపాదిత విద్యుత్ లైన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించడానికి అనేకమంది మైనారిటీ షియా హజారాలు చేరుకున్న ప్రదేశంలో ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడ్డారు.

07/24/2016 - 00:35

న్యూయార్క్, జూలై 23: ఐరాస భద్రతా మండలి ఆంక్షల కమిటీ పనిచేస్తున్న తీరు ఎంతమాత్రం వాస్తవికంగా లేదని భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కొన్ని దేశాల సంకుచిత ప్రాధాన్యతలకే ఈ ఆంక్షల కమిటీలు కట్టుబడి ఉన్నట్టుగా స్పష్టమవుతోందని తెలిపింది.

07/24/2016 - 00:24

క్లీవ్‌లాండ్, జూలై 23: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దశలోనూ వీసా నిరాకరించేందుకు అప్పటి బుష్ ప్రభుత్వం ప్రయత్నించలేదని మాజీ అధికారి ఒకరు తెలిపారు. 2015లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి బుష్ ప్రభుత్వం ఆయనకు వీసా నిరాకరించినట్టుగా వచ్చిన కథనాలను స్టీఫెన్ ఏక్స్ తిరస్కరించారు. అప్పట్లో దేశ ఉపాధ్యక్షుడు డిక్‌చెనికి ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు.

07/23/2016 - 13:59

బీజింగ్‌: వర్షాల కారణంగా చైనాలో 78మంది మృతి చెందగా, 91మంది ఆచూకీ తెలియడం లేదు. దాదాపు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి, ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేవారమని బాధితులు అంటున్నారు.

07/23/2016 - 13:51

దిల్లీ: జర్మనీలోని మ్యూనిక్‌ నగరం మాల్‌లో కాల్పుల ఘటన మృతుల్లో భారతీయులెవరూ లేరని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. ఓ మాల్‌లోని రెస్టారెంట్‌లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాల్పులకు పాల్పడిన 18ఏళ్ల దుండగుడు కూడా తర్వాత తనను తాను కాల్చుకుని మృతిచెందాడు.

07/23/2016 - 06:13

బెర్లిన్, జూలై 22: జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఓ ఆగంతకుడి కాల్పుల్లో పది మందికి పైగా మరణించినట్టు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒలిపింక్ స్టేడియం సమీపంలో ఉన్న మ్యూనిచ్ షాపింగ్ సెంటర్లో ఉన్నవారిపై అతడు కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల అనంతరం అతడు మెట్రో స్టేషన్ దిశగా పరుగులు పెట్టినట్టుగా ది బిల్డ్ అనే పత్రిక తెలిపింది.

Pages