• న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: భారత్-అమెరికాల వ్యూహాత్మక బంధం మరో మైలురాయిని అధిగమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/23/2016 - 16:15

కరాచీ: పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు మద్దతిచ్చిన బ్రహందాగ్ బుగ్తీ, హర్బియార్, బనుక్ కరీమాపై దేశద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద ఖుజ్దర్‌లోని పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదయ్యాయి.

08/23/2016 - 00:14

నై పై డా, ఆగస్టు 22: తమ భూభాగంపై భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలను అనుమతించే ప్రశే్న లేదని మయన్మార్ సోమవారం స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మయన్మార్ పర్యటన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు యు టిన్‌కియాతోపాటు ఆ దేశ కౌనె్సలర్, విదేశాంగ మంత్రి ఆంగ్‌సాన్ సూకితో సమావేశమయ్యారు. రెండు దేశాలు ఫలవంతమైన భాగస్వామ్యం దిశగా ముందుకు వెళ్తున్నాయని టిన్‌కియా అన్నారు.

08/22/2016 - 06:30

గజియాన్‌టెప్ (టర్కీ), ఆగస్టు 21: టర్కీలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 50 మంది మృతి చెందారు. సిరియా సరిహద్దుల్లో ఉన్న ఆగ్నేయ టర్కీలోని గజియాన్‌టెప్ నగరంలో ఒక వివాహానికి హాజరైన ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగిందని అధికారులు ఆదివారం తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి అనేక మంది ఖుర్దులు హాజరయిన వివాహ కార్యక్రమంలో సంభవించినట్టు పేర్కొన్నారు.

08/22/2016 - 05:13

పక్షం రోజుల పాటు యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తి అనంతమైన క్రీడానందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని అందించిన రియో ఒలింపిక్స్‌కు ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత తెరపడింది. ఆరంభం ఎంత ఆర్భాటంగా, అట్టహాసంగా జరిగిందో..ముగింపూ అంతే కనువిందుగా ఆనందదాయకంగా ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు ముగింపు ఉత్సవాలు దేదీప్య వెలుగుల మధ్య జరిగాయి.

08/20/2016 - 17:06

టోక్యో: జపాన్‌లో వరుసగా రెండో రోజు శనివారం భారీ భూకంపం సంభవించింది. జపాన్‌ ఉత్తర ప్రాంతంలో మియాకో నగరానికి 167కి.మీ.ల దూరంలో భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. ఈరోజు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.0గా నమోదైందని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు లేవని జపాన్‌ మెట్రోలాజికల్‌ ఏజెన్సీ స్పష్టంచేసింది.

08/19/2016 - 02:30

పురుషుల 200 మీటర్ల సెమీ ఫైనల్‌లో లక్ష్యం దిశగా దూసుకెళుతూ కెనడా రన్నర్ ఆండ్రె డి గ్రేస్‌ను ఆటపట్టిస్తున్న ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్. సెమీస్‌లో బోల్ట్ 19.78 సెకన్లలో లక్ష్యాన్ని చేరగా, గ్రేస్ 19.80 సెకన్లలో పూర్తి చేశాడు. అమెరికా అథ్లెట్ లాష్వాన్ మెరిట్ 19.94 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఫైనల్ పోరు శుక్రవారం జరుగుతుంది

08/19/2016 - 01:07

ఇస్లామాబాద్, ఆగస్టు 18: తమ దేశంలోని బలూచిస్తాన్ ప్రాంతం గురించి ప్రస్తావించడం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ రెడ్‌లైన్ దాటేశారని పాకిస్తాన్ తీవ్రస్వరంతో ధ్వజమెత్తింది.

08/18/2016 - 03:20

న్యూఢిల్లీ, ఆగస్టు 17: విమానంలో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో తోటి ప్రయాణికులు సాయపడి పురుడు పోయడంతో ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వచ్చే అక్టోబర్‌లో డెలివరీ జరగాల్సి ఉండగా ముందుగనే కాన్పయింది. దుబాయినుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్తున్న సెబు పసిఫిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

08/18/2016 - 00:29

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, ఆగస్టు 17: కాశ్మీర్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు జరుపుదామంటూ పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి ప్రతిపాదనపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్ స్పందిస్తూ కాశ్మీర్ విషయం భారత అంతర్గత వ్యవహారమని, దానిపై ఎవరితోనూ చర్చించాల్సిన పరిస్థితి లేదని, రాదని స్పష్టం చేశారు.

08/18/2016 - 00:16

వాషింగ్టన్, ఆగస్టు 17: పాకిస్తాన్‌లో శక్తివంతమైన సైన్యం ప్రజా ప్రభుత్వాన్ని దించేయడానికి ఇప్పు డు సిద్ధంగా లేదని, అయితే ప్రభుత్వంపై తన ఆధిపత్యం స్థితిని కొనసాగిస్తోందని అమెరికా నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రషీద్ లతీఫ్ వారసుడి ఎంపిక చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో అమెరికా నిపుణులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

Pages