S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/16/2016 - 14:22

అంకారా: టర్కీ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఆ దేశంలో శుక్రవారం రాత్రి నుంచి సామాజిక మీడియాపై పాలకులు ఆంక్షలు విధించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ వంటి సామాజిక మీడియాపై నిషేధం విధించామని అధికారులు తెలిపారు. అయితే, తమ సేవలకు కొంత అంతరాయం కలిగిందని ట్విట్టర్, యూ ట్యూబ్ ప్రతినిధులు చెబుతున్నారు.

07/16/2016 - 11:55

ఇస్తాంబుల్‌: టర్కీ సైన్యంలో ఓ వర్గం చేసిన తిరుగుబాటును ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టిన అనంతరం తాత్కాలిక ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా జనరల్‌ ఉమిత్‌ దుందర్‌ను నియమించారు. తిరుగుబాటు కారణంగా టర్కీలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. సైన్యంలోని 29 కల్నల్స్‌, ఐదుగురు ఆర్మీ జనరల్స్‌ను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.

07/16/2016 - 07:48

నీస్ (ఫ్రాన్స్), జూలై 15: ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బిస్టల్ డే రక్తసిక్తమైంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ఏటేటా జరిగే ఈ జాతీయ దినోత్సవం పెను విషాదంగా మారింది. శుక్రవారం ఫ్రాన్స్ వాహ్యాళి పట్టణమైన నీస్ ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఓ ఉగ్రవాది మృత్యు శకటం దూసుకొచ్చి నరమేధం సృష్టించింది. ఈ విషాద ఘటనలో 84మంది మరణించారు.

07/16/2016 - 05:08

నైస్ (ఫ్రాన్స్), జూలై 15: ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రజలపై జరిగిన ఉగ్రవాద దాడి పట్ల ప్రపంచంలోని వివిధ దేశాల నేతలు దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల బీభత్సకాండను తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రవాద దాడికి గురయిన ఫ్రాన్స్‌కు, ఆ దేశ ప్రజానీకానికి సంఘీభావం ప్రకటించారు.

07/16/2016 - 04:35

ఇస్లామాబాద్, జూలై 15: పాకిస్తాన్ కాశ్మీర్ అంశంపై మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే చర్యకు దిగింది. కాశ్మీర్‌లో భారత భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ శుక్రవారం ‘అమరవీరుడి’గా ప్రకటించారు. కాశ్మీర్ ప్రజలకు సంఘీభావం ప్రకటించడానికి జూలై 19ని ‘బ్లాక్ డే’గా పాటిస్తామని తెలిపారు.

07/15/2016 - 17:31

ఫ్రాన్స్ : రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఫ్రాన్స్ క్రీడాకారులపై ఉగ్రకుట్రను ఫ్రాన్స్ ప్రభుత్వం భగ్నం చేసింది. బ్రెజిల్‌ భద్రతాదళాల సాయంతో ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఫ్రాన్స్ మిలిటరీ ఇంటిలిజెన్స్ ప్రకటించింది. బ్రెజిల్‌ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సకాలంలో ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఉగ్రకుట్రను ఫ్రాన్స్ ప్రభుత్వం భగ్నం చేసింది.

07/15/2016 - 17:23

ఫ్రాన్స్: పలుదేశాల్లో జరుగుతున్న ఉగ్రవాద దాడులు తమకెంతో ఆనందం కలిగించాయని, ఫ్రాన్స్‌లో ట్రక్కు దాడిలో ఆ దేశ పౌరులు మరణించడం సంతోషం కలిగించిందని ఐసిస్ మద్దతుదారులు సామాజిక మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఐరోపా దేశాల్లో మరిన్ని ఉగ్రదాడులు ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. కాగా, ఫ్రాన్స్‌లో జరిగిన ఉగ్రదాడిలో 80 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

07/15/2016 - 15:16

తిరువనంతపురం: సూడాన్‌లోని జుబా నుంచి 156 మంది భారతీయులను తీసుకువచ్చిన విమానం శుక్రవారం ఉదయం తిరువనంతపురం చేరుకుంది. కేరళ, తమిళనాడుకు చెందిన ప్రయాణికులు తిరువనంతపురంలో దిగగా, మిగిలిన ప్రయాణికులతో విమానం ఢిల్లీ చేరుకుంది. మరి కొందరు భారతీయులతో రెండో విమానం జుబా నుంచి బయలుదేరనుంది. రాజకీయ అనిశ్చితి, యుద్ధంలో చిక్కుకున్న దక్షిణ సూడాన్ నుంచి 156 మంది భారతీయులు సురక్షితంగా చేరుకున్నారు.

07/15/2016 - 12:33

వాషింగ్టన్: ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదం క్యాన్సర్ వ్యాధిలా దాపురించిందని, తానే అమెరికా అధ్యక్షుడినైతే దాని అంతాన్నా చూస్తానని అమెరికా అధ్యక్షపదవికి రిపబ్లిక్ పార్టీ తరఫున బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో గురువారం రాత్రి ఓ ట్రక్కు దూసుకుపోయిన ఘటనలో 80 మంది మరణించడంపై ఆయన శుక్రవారం స్పందించారు.

07/15/2016 - 11:36

దిల్లీ: ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో 80 మంది మరణించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘోర దుర్ఘటనలో గాయపడిన వారంత త్వరలోనే కోలుకోవాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

Pages