S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/03/2016 - 11:44

న్యూజెర్సీ: విమానంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న అభియోగంపై విశాఖకు చెందిన కూనం వీరభద్రరావును అమెరికాలోని న్యూజేర్సీలో పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 30న ఆయన లాస్‌ఏంజిలెస్ నుంచి న్యూజెర్సీకి విమానంలో వెళుతూ ఓ ప్రయాణీకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైంది. ఆ ఫిర్యాదుపై వీరభద్రరావును పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

08/03/2016 - 08:03

వాషింగ్టన్, ఆగస్టు 2: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే తీరుపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనూహ్యమైన ఆరోపణ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందేమోనని ఆందోళనగా ఉందన్నారు. ‘‘నాకు భయంగా ఉంది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందేమోనని. నేను నిజాయితీగా ఉండాలి’’ అని కొలంబస్ టౌన్‌హాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ అన్నారు.

08/02/2016 - 11:45

బ్రెజిల్‌: బ్రెజిల్‌లో విమానం కూలి మంటలు చెలరేగి అందులోని 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పైపర్‌ నవాజో జెట్‌ విమానం పరానా రాష్ట్రంలోని క్యాంబే ప్రాంతంలో రవాణా శాఖ భవనంపై కూలిపోయింది. జెట్‌ విమానం లోని ప్రయాణికులంతాఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తున్నారని, కొద్దిసేపట్లో గమ్యం చేరుకుంటారనగా ప్రమాదం జరిగిపోయిందని అధికారులు వెల్లడించారు.

08/02/2016 - 04:46

మాస్కో, ఆగస్టు 1: అంతరిక్షంలో తిరుగాడుతున్న వ్యర్థాల కారణంగా పుడమికి ఎలాంటి ముప్పూ రాకుండా శాస్తవ్రేత్తలు ఓ వినూత్న ప్రయోగాన్ని చేశారు. భూమికి అతి సమీపంగా పరిభ్రమించే గ్రహ శకలాల కారణంగా ముప్పువాటిల్లే అవకాశం ఉండటంతో వాటిని తప్పించేందుకు ఈ ప్రయోగం ఉపకరిస్తుందని చెబుతున్నారు.

08/02/2016 - 02:32

మాస్కో, ఆగస్టు 1: సిరియాలో రష్యా సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కూల్చివేసినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న అయిదుగురు చనిపోయినట్లు వెల్లడించారు. ‘ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు హెలికాప్టర్‌లో ఉన్న వారంతా చనిపోయారు. వాళ్లు వీరోచితంగా చనిపోయారు. అలెప్పోలో మానవీయ సహాయాన్ని అందించి తిరిగి వస్తున్న సమయంలో రష్యాకు చెందిన మిగ్-8 రవాణా హెలికాప్టర్‌ను కూల్చివేయటం జరిగింది.

08/01/2016 - 01:34

వాషింగ్టన్, జూలై 31: ఇప్పటివరకు పొకెమాన్‌ను పట్టుకోవటమే అన్ని దేశాల యువత పనిగా పెట్టుకున్న నేపథ్యంలో అమెరికా ఓ వినూత్న ప్రయోగం చేస్తోంది. ఏకంగా నేరగాళ్లను పట్టుకోవటానికి పోకెమాన్ అస్త్రాన్ని ప్రయోగించేదిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పోకెమాన్ గో క్రేజ్ అన్ని దేశాల్లోనూ ఉత్కంఠ రేకెత్తిస్తున్న తరుణంలో వర్జీనియాకు చెందిన పోలీస్ విభాగం ఈ వినూత్న ఆలోచనతో తెరపైకి వచ్చింది.

08/01/2016 - 06:32

లండన్, జూలై 31: విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. అసహ్యమేసినా ఇదే వాస్తవం.. ఐరోపా శాస్తవ్రేత్తలు యూరిన్ నుంచి బీర్‌ను తయారు చేసే యంత్రాన్నొకదాన్ని కనుగొన్నారు. సౌరశక్తితో పనిచేసే ఈ యంత్రం మానవ మూత్రం నుంచి నీటిని, ఎరువును వేరు చేస్తుంది. ఈ ఎరువు బీరు ఉత్పాదక పంటలకు ఉపయోగపడుతుందిట. బెల్జియం ఘెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు ఈ దిశగా విజయవంతమైన పరిశోధనలు చేశారు.

08/01/2016 - 01:09

ఈ వీరుడి పేరు ల్యూక్ అయికిన్స్ (42). ప్రపంచంలోనే అరుదైన రికార్డు సాధించాడు. పారాచూట్ లేకుండా 25వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న ఓ విమానం నుంచి భూమిపైకి దూకేశాడు. కాలిఫోర్నియాలోని సిమి లోయలో ఈ ఫీట్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 25వేల అడుగుల ఎత్తునుంచి రెండు నిమిషాల
వ్యవధిలో భూమిపై ఏర్పాటు చేసుకున్న 100 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవు కలిగిన వలపైకి విజయవంతంగా దూకాడు.

08/01/2016 - 01:01

వాషింగ్టన్, జూలై 31: ఆర్థిక రంగానికి సంబంధించి తాను రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం దేశంలో కోటి ఉద్యోగాలను సృష్టించేందుకు వీలవుతుందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న హిల్లరీ క్లింటన్ ఆదివారం స్పష్టం చేశారు.

07/31/2016 - 06:38

హోస్టన్, జూలై 30: అమెరికాలోని మధ్య టెక్సాస్‌లో ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకోవటంతో 16మంది మరణించారు. లోఖార్ట్ సమీపంలో 16మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ బెలూన్‌కు అకస్మికంగా మంటలు వ్యాపించి పొలాల్లో పడిపోయింది. సరిగ్గా హై వోల్టేజి విద్యుత్ లైన్లు ఉన్న ప్రాంతంలో బెలూన్ దగ్ధమైంది.

Pages