S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/06/2016 - 11:29

ఫ్రాన్స్‌ : ఉత్తర ఫ్రాన్స్‌లోని రోవన్‌ నగరంలో క్యూబా లిబ్రే బార్‌లో శుక్రవారం అర్థరాత్రి కొందరు బర్త్‌డే పార్టీ చేసుకుంటుండగా మంటలు చెలరేగి 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు.

08/06/2016 - 07:59

న్యూయార్క్, ఆగస్టు 5: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఆమోదించే సమస్యే లేదని హార్వర్డ్ రిపబ్లికన్ క్లబ్ ప్రకటించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం, ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కృషి చేసే హార్వర్డ్ రిపబ్లికన్ పార్టీ 128 సంవత్సరాలలో ఇలా పార్టీ అధికారిక అభ్యర్థిని వ్యతిరేకించడం ఇదే మొదటిసారి.

08/06/2016 - 07:58

షికాగో, ఆగస్టు 5: చెమటపట్టి ఉండటంతో పాటు అల్లా అన్నందుకు ఒక పాకిస్తాని-అమెరికన్ దంపతులను అమెరికాకు చెందిన విమానంలోనుంచి దింపివేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమకు చెమటపట్టి ఉండటంతో పాటు తాము ‘అల్లా’ అన్నందుకు, స్మార్ట్ ఫోన్ నుంచి టెక్స్ట్ మెసేజ్ పంపించినందుకు విమానంలోని సిబ్బంది ఒకరు అసౌకర్యంగా భావించి, తమను విమానంలోనుంచి దింపివేశారని నాజియా అనే మహిళ తెలిపారు.

08/06/2016 - 07:57

వాషింగ్టన్, ఆగస్టు 5: గతంలో మాదిరిగా పాకిస్తాన్‌కు అమెరికా గుడ్డిగా సాయం చేసే పరిస్థితి ఎంత మాత్రం లేదని, తాము ఏం చేసినా చెల్లుతుందన్న భావన నుంచి ఆ దేశ పాలకులు బయటపడాలని అంతర్జాతీయ నిపుణులు స్పష్టం చేశారు. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా అమెరికా తమకు‘బ్లాంక్ చెక్కులు’ ఇస్తుందని పాకిస్తాన్ ఆశిస్తే పొరపాటేనని తెలిపారు.

08/05/2016 - 17:19

పారిస్‌ : డీహెచ్‌ఎల్‌ సంస్థకు చెందిన కార్గో విమానం శుక్రవారం ఉదయం పారిస్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి బెర్గామో విమానాశ్రయంలో ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా రన్‌వేకి సమీపంలో ఉన్న రహదారిపై కూలిపోయింది. పైలట్‌, కో-పైలట్‌లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పారిస్‌లోని మిలాన్‌ ప్రాంతంలో రోడ్డుపై విమానం కూలిపోవడంతో రెండున్నర గంటల పాటు ఆ ప్రాంతాన్ని మూసివేశారు

08/05/2016 - 15:52

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మరో వివాదంలో ఇరుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఓ మేగజైన్కు నగ్నంగా పోజిచ్చినప్పటి మెలానియా ఫొటోలను న్యూయార్క్ పోస్ట్ ఇటీవల ప్రచురించగా, 1995లో ఆమె అమెరికాకు వచ్చినప్పుడు వీసా నిబంధనలు ఉల్లంఘించారని తాజాగా ఆరోపణలు వచ్చాయి.

08/05/2016 - 12:48

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష బరిలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీకి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే 15 శాతం మద్దతు అధికంగా ఉన్నట్లు తెలిపింది. హిల్లరీకి 48 శాతం మంది ఓటర్ల మద్దతు ఉండగా, ట్రంప్‌కు కేవలం 33 శాతం మంది ఓటర్లు మద్దతు ఉన్నట్లు మెక్‌క్లాచీ-మారిస్ట్‌ పోల్‌ సర్వే స్పష్టం చేసింది. తాజా సర్వేలో ట్రంప్‌ మద్దతు మరింతగా పడిపోయింది.

08/05/2016 - 02:38

ఇస్లామాబాద్: భారత్-పాక్ సంబంధాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న విభేదాలు సార్క్ హోం మంత్రుల స్థాయి సమావేశాల్లో సైతం బయటపడ్డాయ. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీ ముఖాముఖి ఎదురుబడినప్పుడు ఎడమొఖం పెడమొఖంగా కనిపించారు. సమావేశం జరుగుతున్న సెరేనా హోటల్ వద్దకు రాజ్‌నాథ్ చేరుకున్నప్పుడు చౌదరి గేట్ వద్ద ఉన్నారు.

08/05/2016 - 02:27

వాషింగ్టన్, ఆగస్టు 4: అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ కీలక రాష్ట్రాల్లో దూసుకెళుతున్నారు. తాజాగా జరిగిన సర్వేలో హిల్లరీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించినప్పటికీ అదెంతో కాలం నిలవదంటూ ట్రంప్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. హిల్లరీ సాధించిన ఆధిక్యతను ట్రంప్ రెండు మూడు వారాల్లోనే సమం చేసేస్తారన్న నమ్మకంతో ఆయన విధేయులు ఉన్నారు.

08/05/2016 - 00:53

ఇస్లామాబాద్, ఆగస్టు 4: సార్క్ దేశాల సదస్సు సాక్షిగా పాకిస్తాన్ ఉగ్ర స్వరూపాన్ని భారత్ తీవ్ర పదజాలంతో ఎండగట్టింది. ఉగ్రవాదుల్ని కీర్తించడం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం తక్షణం కట్టి పెట్టాలని పరోక్షంగానైనా చాలా స్పష్టంగానే పాకిస్తాన్‌కు తేల్చిచెప్పింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్న 26/11, పఠాన్‌కోట్ దాడుల్ని ప్రస్తావించింది.

Pages