S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/24/2016 - 06:10

వాషింగ్టన్, ఏప్రిల్ 23: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటనలు కలకలం సృష్టించాయి. తాజాగా రెండు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు కాల్పుల సంఘటనల్లో మొత్తం 14 మంది మృతి చెం దారు. ఓహియో గ్రామీణ ప్రాంతంలో ఒక టీనేజర్ సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని కాల్చి చంపారు. తరువాత జార్జియాలో ఓ సాయుధ దుండగుడు అయిదుగురిని కాల్చి చంపాడు.

04/24/2016 - 06:06

వాషింగ్టన్, ఏప్రిల్ 23: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ వచ్చీరాని భారతీయ యాసతో ఆంగ్లం లో మాట్లాడుతూ భారత్‌లోని ఒక కాల్ సెంటర్ ప్రతినిధిని ఎగతాళి చేశారు. అమెరికాలోని డెలవేర్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ భారత్ గొప్ప దేశమని, భారతదేశ నేతలపై తనకు ఎలాంటి కోపం లేదని ఆయన స్పష్టం చేశారు.

04/23/2016 - 03:44

వాషింగ్టన్, ఏప్రిల్ 22: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు హిల్లరీ క్లింటన్‌పైనే పోటీ చేయాలని తాను అనుకుంటున్నానని అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మిగతా అందరికన్నా ముందున్న డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశాడు.

04/23/2016 - 03:38

న్యూయార్క్, ఏప్రిల్ 22: బంగారు ఉంగరాలు, బ్రాస్లెట్లు.. ఇలా అంటుంటాం కాని, బంగారు మరుగుదొడ్డి అంటామా? అవును ఇప్పుడు అనాల్సిందే మరి. ఎందుకంటే ఇది పూర్తిగా బంగారంతో తయారుచేసిన మరుగుదొడ్డి. 18 క్యారట్ల బంగారంతో తయారు చేసిన మరుగుదొడ్డిని అమెరికాలోని గుగెన్‌హెయిమ్ మ్యూజియం బాత్‌రూమ్‌లో బిగించడానికి రంగం సిద్ధమైంది. మ్యూజియంలో పెడుతున్నారంటే కేవలం చూడటానికి అనుకుంటున్నారేమో.

04/23/2016 - 03:35

ఇస్లామాబాద్, ఏప్రిల్ 22: న్యాయమూర్తుల అక్రమ నిర్బంధం కేసులో నిందితుడైన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వెజ్ ముషారఫ్‌కు స్థానిక కోర్టులు చుక్కెదురైంది. కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన మెడికల్ రిపోర్టు బోగస్‌గా ఉగ్రవాద నిరోధక కోర్టు తేల్చింది. 2007లో జడ్జిలను నిర్బంధించినట్టు ముషారఫ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

04/22/2016 - 08:15

వాషింగ్టన్, ఏప్రిల్ 21: పదమూడేళ్ల క్రితం ఇరాక్‌పై యుద్ధానికి అమెరికా అనుకూలంగా ఓటేయటం పెద్ద పొరపాటని డెమొక్రాట్ల తరపున అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న హిల్లరీ క్లింటన్ తెలిపారు. ఆ సమయంలో హిల్లరీ సెనెటర్‌గా ఉన్నారు. ఇరాక్‌పై యుద్ధానికి నిర్ణయం తీసుకునే అధికారాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌కు అప్పజెప్తూ ఓటేయటం పెద్ద తప్పిదమని ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

04/22/2016 - 05:42

లండన్, ఏప్రిల్ 21: రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అత్యధిక కాలి ఏలిన మహారాణి ఎలిజబెత్-2 90వ జన్మదిన వేడుకలు బ్రిటన్, కామన్‌వెల్త్‌లలో వైభవంగా జరిగాయి. లండన్ శివార్లలోని విండ్సర్ భవంతిలో ఆమె వేడుకల్లో పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామరాన్ నేతృత్వంలో పలువురు రాణికి అభినందనలు తెలిపారు. తమ దేశానికి ‘‘కొండలాంటి శక్తి (రాక్ ఆఫ్ స్ట్రెంగ్త్) అని కామరాన్ అభివర్ణించారు.

04/22/2016 - 05:38

వాషింగ్టన్, ఏప్రిల్ 21: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి తొలి అంకం ముగిసి రెండో అంకం మొదలవుతున్న నేపథ్యం లో రెండు పార్టీల నుంచి రేసు లో ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున విరాళాలు తమ మద్దతుదారుల నుంచి సేకరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రైమరీలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక రెండోదశలో పార్టీలో సూపర్ డెలిగేట్ల మద్దతు సాధించాల్సి ఉంది.

04/22/2016 - 05:31

న్యూయార్క్, ఏప్రిల్ 21: టైమ్స్ మ్యాగిజైన్ అంత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, గూగుల్ సిఇవో సుందర్ పిచాయ్‌లకు చోటు దక్కింది. అలాగే వంద మంది ప్రభావవంతుల జాబితాలో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్ పేర్లు చోటుచేసుకున్నాయి. టైమ్స్ వార్షిక జాబితా గురువారం విడుదల చేసింది.

04/21/2016 - 09:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆమె మహారాణి. 63 ఏళ్ల రాచరికపు దర్పం ఆమెది. అయినా ఆమెకు ఇప్పటి వరకు ఎలాంటి పాస్‌పోర్ట్ లేదు. ఆమె ముఖమే ఆమెకు పాస్‌పోర్ట్. తిరుగులేని బ్రిటిష్ రాచరికపు దర్పంతో.. పాస్‌పోర్ట్ లేకుండానే ఆమె 117 దేశాలు పర్యటించి వచ్చింది.

Pages