S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/26/2016 - 04:40

బీజింగ్, జూలై 25: భారత్‌లో ఉంటున్న ముగ్గురు తమ పౌరులకు వీసా పొడిగింపును తిరస్కరించటంపై చైనా తీవ్రంగా స్పందించింది. భారత్ తమపై ప్రతీకారం తీర్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. చైనా అధికార వార్తా సంస్థ జిన్‌హువాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులకు వీసా పొడిగింపును భారత్ నిరాకరించింది.

07/26/2016 - 04:36

వాషింగ్టన్, జూలై 25: ప్రపంచ వాణిజ్యసంస్థ దారుణంగా విఫలమైన వ్యవస్థ అని, తాను అధ్యక్షుడిగా ఏన్నికైతే అమెరికాను అందులోంచి బయటకు తీసుకువస్తానని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ నామినీ డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఉత్పాదక కార్యకలాపాలను విదేశాలకు తరలిపోయే కంపెనీలపై 30శాతం దిగుమతి సుంకాన్ని కూడా విధిస్తామని వెల్లడించారు.

07/25/2016 - 18:38

శ్రీనగర్‌: నిబంధనలను ఉల్లంఘించి హురియత్‌ కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌, వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ గిలానీ అనంత్‌నాగ్‌కు సోమవారం ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కశ్మీర్‌ లోయలో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గిలానీ అక్కడి ప్రజలను పరామర్శించడం కోసం కశ్మీర్‌ లోయలోని అనంతనాగ్‌ జిల్లా ర్యాలీకి పిలుపునిచ్చారు.

07/25/2016 - 17:16

ఫ్లోరిడా (అమెరికా) : ఫ్లోరిడా ఫోర్ట్ మయర్స్‌లోని క్లబ్ బ్లూ‌లో కాల్పుల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 30 రౌండ్లు కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

07/25/2016 - 15:21

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఫోర్ట్‌ మైర్స్‌లో ఓ నైట్‌ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. 17 మంది గాయాలపాలయ్యారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. క్లబ్‌ బ్లూలో ‘టీన్‌ నైట్‌’ కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. తుపాకీ చేతబూనిన ఓ వ్యక్తి క్లబ్‌లోకి ప్రవేశించిన వెంటనే జనం పైకి కాల్పులు జరపడం ప్రారంభించాడు.

07/24/2016 - 16:52

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం ఆత్మహుతి దాడిలో ముగ్గురు పోలీసుల సహా 12 మంది మృతిచెందారు. సైదీ జిల్లా కాధిమియా ప్రాంతంలోని ఒక చెక్‌ పాయింట్‌ వద్ద దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. 20 మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

07/24/2016 - 12:36

ఢిల్లీ: చైనాకు చెందిన అధికార వార్తా సంస్థ 'జిన్హువా' తరఫున పనిచేస్తున్న ముగ్గురు జర్నలిస్టులు జూలై 31వ తేదీలోగా దేశం విడిచిపెట్టాలని ఇండియా ఆదేశించింది.

07/24/2016 - 03:22

న్యూఢిల్లీ, జూలై 23:ముగ్గురు చైనా పాత్రికేయులను భారత్ బహిష్కరించింది. చైనా అధికార వార్తా సంస్థ జిన్హువాలో పనిచేస్తున్న వూ కియాంగ్, లూ టాంగ్, షియాంగాంగ్‌ల వీసాలను పొడిగించడానికి భారత్ నిరాకరించింది. ఇప్పటికే ఇరు దేశాల సంబంధాలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం వల్ల పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది.

07/24/2016 - 03:19

ఐక్యరాజ్య సమితి, జూలై 23: భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలంటే ఆ రెండు దేశాలతో పాటు సభ్య దేశాల సౌహార్ద్రత అవసరమని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద నిరోధక కమిటీ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ‘సభ్య దేశాల సౌహార్ద్రత లేకుండా సమస్యను ఎలా పరిష్కరించగలం’ అని కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ జీన్-పాల్ లాబోర్డే అన్నారు.

,
07/24/2016 - 02:04

కాబూల్, జూలై 23: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం సంభవించిన శక్తివంతమైన పేలుడులో 80 మంది మృతి చెందారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక ప్రతిపాదిత విద్యుత్ లైన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించడానికి అనేకమంది మైనారిటీ షియా హజారాలు చేరుకున్న ప్రదేశంలో ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడ్డారు.

Pages