S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/03/2016 - 03:57

వాషింగ్టన్, జూలై 2: భారత్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తామని అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీ స్పష్టం చేసింది. భారత్‌ను ‘ముఖ్యమైన పసిఫిక్ శక్తి’గా ఆ పార్టీ తమ ముసాయిదా ఎన్నికల మ్యానిఫెస్టోలో అభివర్ణించింది. అలాగే పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించాల్సిందేనని, ఇందుకు సంబంధించి ఆ దేశంపై ఒత్తిడి తీసుకొస్తామని డెమోక్రటిక్ పార్టీ పేర్కొంది.

07/03/2016 - 03:57

లండన్, జూలై 2: ఫేస్‌బుక్‌లో ‘ఐసిస్’ పేరుతో ఖాతా తెరిచిన మహిళకు పెద్దచిక్కే వచ్చింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ పేరూ ‘ఐసిస్’ కావడమే కారణం. యుకెకు చెందిన 27 ఐసిస్ థామస్ అనే ఆమెకు ఫేస్‌బుక్ యాజమాన్యం మెస్సేజ్ పంపింది. ఐసిస్ పేరును నిర్ధారించుకోవాలని, దానికి సంబంధించి ఆధారాలు చూపాలని ఆమెకు విజ్ఞప్తి చేసింది. అలాగే ఐసిస్ పేరుతో తెరిచిన అకౌంట్‌పైనా ఫేస్‌బుక్ ఆంక్షలు విధించింది.

07/03/2016 - 03:55

కరాచి, జూలై 2: తాను పనిచేసే వివక్షను ఎదుర్కొంటున్నానని, గతంలో చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని తన పై అధికారి ఇప్పుడు తనపై ఒత్తిడి తెస్తున్నారని పాకిస్తాన్ అధికార వార్తాసంస్థ ‘అసోసియేట్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్’(ఎపిపి)లో పనిచేస్తున్న ఓ హిందూ రిపోర్టర్ ఫిర్యాదు చేస్తున్నారు.

07/03/2016 - 02:28

ఢాకా, జూలై 2: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీ, రెస్టారెంట్‌పై శుక్రవారం రాత్రి దాడి చేసిన ఉగ్రవాదులు 20మందిని కిరాతకంగా నరికి చంపారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఆరుగురిని సైనిక దళాలు మట్టుపెట్టగా, ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నాయి.

07/02/2016 - 18:33

దిల్లీ: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడి మృతుల్లో భారత్‌కు చెందిన 19 ఏళ్ల తరుషి అనే అమ్మాయి ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఢాకాలోని అమెరికన్‌ స్కూల్‌లో చదివిన తరుషి బెర్కెలీ యూనివర్శిటీ స్టూడెంట్‌గా ఉందని మంత్రి తెలిపారు.

07/02/2016 - 17:33

తజికిస్థాన్‌ : తజికిస్థాన్‌లో శనివారం భూకంపం కారణంగా 30 ఇళ్లు, పాఠశాల భవనాలు ధ్వంసమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. దేశ రాజధానికి 200 కిలోమీటర్ల దూరంలో రాషిట్‌ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

07/02/2016 - 11:42

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంటులో బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు పోలీసు కమెండోలు రంగప్రవేశం చేసి అయిదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి ఆ రెస్టారెంటులో 8 మంది ఉగ్రవాదులు ప్రవేశించి 18 మంది విదేశీయులను బంధించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు పోలీసులు మరణించగా, 20 మంది గాయపడ్డారు.

07/02/2016 - 11:42

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గమైన హిందూ పూజారులపై దాడులు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. శుక్రవారం ఓ పూజారిని హత్యచేయగా, తాజాగా శక్తిరా జిల్లాలోని రాధాగోవింద ఆలయ పూజారి బాబాసిందూరాయ్‌పై ఆగంతకులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఇంటి తలుపులు కొట్టగానే బయటికి వచ్చిన పూజారిపై దుండగులు విరుచుకుపడ్డారు. గాయపడిన పూజారిని ఆస్పత్రిలో చేర్పించగా అతడి పరిస్థితి విషమంగానే ఉంది.

07/02/2016 - 08:07

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, జులై 1: మన దేశానికి చెందిన 463 మంది మత్స్యకారులు సహా మొత్తం 518 మంది ఖైదీలు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. వీరి జాబితాను పాకిస్తాన్ శుక్రవారం భారత్‌కు అందజేయగా, మన జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల జాబితాను భారత అధికారులు దాయాది దేశానికి అందజేశారు.

07/02/2016 - 08:00

డెహ్రాడూన్, జూలై 1: ఉత్తరాఖండ్‌లోని ఎగువ పర్వత ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన కుండపోత వర్షాలకు వివిధ ప్రాంతాల్లో సంభవించిన ప్రమాదాల్లో కనీసం 15 మంది చనిపోగా, వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. పర్వత ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాలకు పితోర్‌గఢ్, చమోలీ జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆ జిల్లాల ప్రజలు నానా అ వస్థలు పడుతున్నారు.

Pages