S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/01/2016 - 14:56

సింగపూర్‌ : గత ఏడాది విడుదలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు సంబంధించి సైమా అవార్డుల వేడుక సింగపూర్‌లో గురువారం రాత్రి జరిగింది. తొలిరోజు సైమా వేడుకకు చిరంజీవి, అల్లు అర్జున్‌, రాధిక, సుహాసిని, హన్సిక, సమంత, రానా, అలి, వరుణ్‌తేజ్‌, నిత్యామేనన్‌, విక్రమ్‌, నయనతార, రాజేంద్రప్రసాద్‌, శ్రుతిహాసన్‌, సాయేషా సైగల్‌, ప్రణీత, గాయని సుశీల హాజరయ్యారు.

07/01/2016 - 13:37

బీజింగ్‌: చైనాలో గిజౌ ప్రావిన్స్‌లోని పియాంపో గ్రామంలో కొండచరియలు విరిగి పడటంతో 20మంది గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. 9 మందిని శిథిలాల నుంచి ప్రాణాలతో బయటకు తీసుకురాగా, గాయాల కారణంగా ఓ వ్యక్తి మృతిచెందినట్లు, 20 మంది దాకా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

07/01/2016 - 11:34

ఢాకా: బంగ్లాదేశ్‌లో జెనైదా ప్రాంతంలో శ్యామనందో దాస్‌ అనే హిందూ పూజారి హత్యకు గురయ్యారు. దాస్‌ పూలు కోస్తుండగా ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి కత్తులతో పొడిచి హతమార్చారు. దాస్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో హిందూవులతో పాటు క్రిస్టియన్‌ పౌరులు, మైనార్టీకి చెందిన ప్రొఫెసర్లపై దాడి చేసి చంపేస్తున్నారు.

07/01/2016 - 02:40

కాబూల్, జూన్ 30: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో గురువారం తాలిబన్ తిరుగుబాటుదారులు పోలీసు బస్సులపై చేసిన బాంబు దాడిలో 27 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు. పోలీసులను తీసికెళ్తున్న బస్సుల కాన్వాయ్‌పై ఈ దాడి జరిగిందని అఫ్గానిస్తాన్ హోంశాఖ తెలిపింది. తిరుగుబాటుదారులు పేల్చిన భారీ పేలుళ్లలో 14 మంది నేపాలీ సెక్యూరిటీ గార్డులు మృతి చెందిన సుమారు పది రోజులకే మళ్లీ ఈ దాడి జరిగింది.

07/01/2016 - 01:58

విశాఖపట్నం, జూన్ 30: విశాఖకు చెందిన ఒక ఇంజనీర్ నైజీరియాలో కిడ్నాప్‌కు గురైయ్యారు. ఉత్తర మధ్య నైజీరియాలోని బోకో పట్టణంలో ఒక సిమెంట్ కంపెనీలో పని చేస్తున్న మంగినపూడి సాయి శ్రీనివాస్ (44) తోపాటు ఉత్తర భారతదేశానికి అతడి సహోద్యోగి అనీష్ శర్మను కూడా కిడ్నాప్ చేశారు. బోకో హరామ్ ఉగ్రవాదులు ఇందుకు పాల్పడినట్టుగా భావిస్తున్నారు.

07/01/2016 - 00:55

లండన్, జూన్ 30: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ వారసులు ఎవరన్నదానిపై ఉత్కంఠ క్రమంగా తొలగిపోతోంది. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి ప్రధాన అభ్యర్థిగా మొదట్లో తెరపైకి వచ్చిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ తాజా పరిణామాల నేపథ్యంలో పోటీనుంచి తప్పుకున్నారు. దాంతో బ్రిటన్ హోంమంత్రి థెరిసామే ఈ పదవికి ప్రధాన అభ్యర్థిగా నిలిచారు.

07/01/2016 - 00:44

ఇస్లామాబాద్, జూన్ 30: ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ముంబయి దాడి కేసులో పాకిస్తాన్ తన గురివింద ధోరణిని మరోసారి రుజువుచేసుకుంది. పాకిస్తాన్ కేంద్రంగానే 2008లో ముంబయిపై దాడికి కుట్ర జరిగిందని భారత్ ఇప్పటికే ఎన్నో సాక్ష్యాధారాలు అందించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా అదనపుఆధారాలు కావాలంటూ పాక్ డిమాండ్ చేసింది.

06/30/2016 - 17:58

దిల్లీ: సౌరశక్తి వినియోగాన్ని భారత్‌లో వ్యాప్తి చేసేందుకు ప్రపంచబ్యాంకు రికార్డు స్థాయిలో బిలియన్‌ డాలర్ల డబ్బు రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌తో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

06/30/2016 - 15:32

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో పోలీస్‌ కాన్వాయ్‌పై గురువారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది పోలీసులు మృతి చెందినట్లు పగ్మాన్‌ జిల్లా గవర్నర్‌ హజీ మహ్మద్‌ తెలిపారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని తాలిబన్‌ ప్రతినిధులు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

06/30/2016 - 13:29

మెగాదీషు (సోమాలియా) : సోమాలియా రాజధాని మెగాదీషు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. గురువారం జరిగిన ఈ ఘటనలో 18 మంది మరణించారు.

Pages