S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/07/2016 - 08:51

వాషింగ్టన్, ఫిబ్రవరి 6: అణు ప్రమాదాలకు సంబంధించిన అనుబంధ నష్టపరిహారాల ఒడంబడికపై సంతకం చేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను అమెరికా స్వాగతిస్తూ, ఈ ముఖ్యమైన చర్య వల్ల భారత్‌లో అణు రియాక్టర్ల నిర్మాణంలో అమెరికా కంపెనీలు పాలుపంచుకోవడానికి వీలవుతుందని పేర్కొంది.

02/07/2016 - 08:50

కొలంబో, ఫిబ్రవరి 6: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ఆ దేశ అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో సమావేశమై పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించారు.

02/07/2016 - 08:49

వాషింగ్టన్: డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రగామిగా ఉందని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉద్ఘాటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని అభివృద్ధికి భారత్‌లో గల అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన ప్రముఖ ఐటి సంస్థలకు పిలుపునిచ్చారు.

02/07/2016 - 08:49

తైనాన్: దక్షిణ తైవాన్‌లో సంభవించిన తీవ్ర భూకంపకానికి 14మంది మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. బహుళ అంతస్తు భవనం కూలిపోయి 14 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. శిథిలాల కింద నుంచి 247 మందిని రక్షించారు. 1200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.

02/06/2016 - 01:13

జెనీవా/ లండన్, ఫిబ్రవరి 5: బ్రిటన్, స్వీడన్‌లకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి వేదికగా చేసిన పోరాటంలో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే విజయం సాధించారు. అసాంజేది నిరంకుశ నిర్బంధమేనని ఐరాస వర్కింగ్ గ్రూప్ శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. నిరంకుశ నిర్బంధం వల్ల అసాంజే తన స్వేచ్ఛను కోల్పోయారని పేర్కొంది.

02/05/2016 - 08:42

బ్యాంకాక్, ఫిబ్రవరి 4: రోజురోజుకు పెరుగుతున్న ఉగ్రవాద జాడ్యాన్ని ఎదుర్కోవడానికి భావ సారూప్యత గల దేశాల మధ్య పటిష్ఠమైన సహకారం అవసరమని భారత ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ పిలుపునిచ్చారు. భారత్-్థయిలాండ్ మధ్య రక్షణ సంబంధాల పెరుగుదలకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

02/05/2016 - 08:25

లండన్, ఫిబ్రవరి 4: ఐక్యరాజ్య సమితి వర్కింగ్ గ్రూప్ శుక్రవారం వెలువరించే నిర్ణయం తనకు వ్యతిరేకంగా ఉంటే తాను బ్రిటిష్ పోలీసులకు లొంగిపోతానని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే గురువారం స్పష్టం చేశారు.

02/05/2016 - 04:36

ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన దాడుల ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలో ముంబయి దాడికి కుట్రదారు హఫీజ్ సరుూద్ రెచ్చగొట్టేరీతిలో మాట్లాడాడు. భారత్‌పై మరిన్ని దాడులను చేస్తామని హెచ్చరించాడు. అక్రమిత కాశ్మీర్‌లోని ఓ ర్యాలీలో మాట్లాడిన జమాద్ ఉద్ దవా(జెయుడి) అధ్యక్షుడు సరుూద్‌‘ ఇప్పటికి పఠాన్‌కోట్‌పై దాడినే చూశారు.

02/03/2016 - 06:45

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 2: కాశ్మీరులో ఉగ్రవాద గ్రూపులకు మద్దతునివ్వడం మానుకుని అక్కడ దాడులకు తెగబడుతున్న మూకలపై చర్యలు చేపట్టాలని, తద్వారా అంతర్జాతీయ సమాజంలో భయాందోళనలను తొలగించాలని పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్-ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్) ప్రభుత్వానికి సూచించింది.

02/03/2016 - 06:40

వాషింగ్టన్, ఫిబ్రవరి 2: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఇప్పటివరకు ముందంజలో ఉండిన డొనాల్డ్ ట్రంప్‌కు లోవా రాష్ట్రంలో చుక్కెదురైంది. రిపబ్లికన్ పార్టీ అభిమానుల (కాకస్) మధ్య జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో ఉన్న మరో అభ్యర్థి టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్ ట్రంప్‌పై భారీ ఆధిక్యత సాధించారు.

Pages