S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/14/2016 - 02:56

ఆక్రా, జూన్ 13: ఉగ్రవాదం అనేది ఎల్లలు లేకుండా ప్రపంచమంతా విస్తరించిన మహమ్మారి అని పేర్కొంటూ నాగరిక ప్రపంచం సమష్టి కృషితో ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించి తీరాలని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఘనా దేశానికి భారత్ మద్దతుగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీ రెండు రోజుల పర్యటనకోసం ఇక్కడికి వచ్చారు. భారత రాష్టప్రతి ఘనా దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.

06/14/2016 - 02:54

ఓర్లాండో (అమెరికా) జూన్ 13: ఆదివారం సాయంత్రం, గే నైట్ క్లబ్‌లో వీకెండ్ హంగామా. అంతా తాగుతూ, తూగుతూ, తుళ్లుతూ మైకం కైపెక్కి మైమరచి ఉన్న సమయం. సరిగ్గా అదే టైంలో ఏఆర్-15 గన్‌తో 29 ఏళ్ల ముస్లిం అమెరికన్ ఒమర్ మాటిన్ క్లబ్‌లోకి ప్రవేశించాడు. క్లబ్‌లోకి వచ్చీ రావటంతోనే మారణకాండకు ఒడిగట్టిన తీరు అమెరికా దర్యాప్తు అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ముందుగా అక్కడున్న పోలీసును కాల్చేశాడు..

06/14/2016 - 02:51

వాషింగ్టన్, జూన్ 13: ఓర్లాండో గే క్లబ్‌లో ఆదివారం జరిగిన మారణకాండ అమెరికాను కకావికలు చేస్తోంది. గుండెలు పిండేస్తున్న తుపాకీ సంస్కృతికి అంతం ఎప్పుడంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

06/13/2016 - 17:21

వాషింగ్టన్: ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన అమానుష ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా తక్షణం పదవికి రాజీనామా చేయాలని దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఒబామా పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి నైట్‌క్లబ్ ఉదంతం నిదర్శనమన్నారు.

06/13/2016 - 07:01

ఇస్లామాబాద్, జూన్ 12: మస్లింలు ఎంతో పవిత్రమైన రంజాన్ నెలలో ఇఫ్తార్‌కు ముందు తినుబండారాలు అమ్మాడన్న కారణంపై పాకిస్తాన్‌లో ఒక పోలీసు కానిస్టేబుల్ ఓ వృద్ధ హిందువును చిత్రహింసలకు గురిచేశాడు. అతనికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు కావడంతో ఆ పోలీసు కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు.

06/13/2016 - 06:53

వాషింగ్టన్, జూన్ 12: రక్షణ, భద్రతల విషయంలో భారత్, అమెరికాలు ఒకే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్‌ను అమెరికా అంతర్జాతీయ వ్యూహాత్మక రక్షణ భాగస్వామి హోదాను ఇవ్వాలని రిపబ్లికన్ సెనెటర్ జాన్ మెకైన్ ఆదివారం ప్రతిపాదించారు. దీనికి సంబంధించి జాతీయ భద్రత ధ్రువీకరణ చట్టం (ఎన్‌డిఏఏ) 2017 చట్టానికి అవసరమైన సవరణలు చేయాలని అధ్యక్షుడు బరాక్ ఒబామాను జాన్ కోరారు.

06/13/2016 - 06:52

బీజింగ్, జూన్ 12: అణు సరఫరా దేశాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వం కల్పించడానికి అమెరికా గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశాలను గ్రూపులో చేర్చుకోవడంపై ఎన్‌ఎస్‌జి రెండుగా చీలిపోయి ఉందని చైనా అంటోంది.

06/13/2016 - 06:41

లాహోర్, జూన్ 12: పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా మరోసారి ప్రజలను కదిలించి మహాధర్నా చేస్తానని ప్రతిపక్ష తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. పనామా పత్రాల లీకేజీ నేపథ్యంలో ‘మనీలాండరింగ్’ ఆరోపణలకు జవాబుదారీతనం వహించకుండా షరీఫ్ తప్పించుకోజాలరని ఆయన పేర్కొన్నారు.

06/13/2016 - 06:19

వాషింగ్టన్, జూన్ 12: అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా తాను ఎన్నికైతే మహిళలకోసం అబార్షన్ హక్కుల చట్టాన్ని తీసుకువస్తానని డెమొక్రాట్ పార్టీ నామినీ హిల్లరీ క్లింటన్ తాజాగా ప్రకటించారు. జాతీయ పునరుత్పత్తి ఆరోగ్య ప్రచార సంస్థ చాలాకాలంగా పోరాడుతున్న అబార్షన్ హక్కులను నిజం చేస్తానని ఆమె వెల్లడించారు. తన ప్రత్యర్థి రిపబ్లికన్ నామినీ డొనాల్డ్ ట్రంప్‌ను మహిళా హక్కుల వ్యతిరేకిగా ఆమె అభివర్ణించారు.

06/13/2016 - 02:24

మియామి, జూన్ 12: అమెరికాలోని ఫ్లోరిడాలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఆగంతకుడు ఒక స్వలింగ సంపర్కుల నైట్‌క్లబ్ (గే నైట్‌క్లబ్)లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో కనీసం 50 మంది మృతి చెందగా, 53 మందికి పైగా గాయపడ్డారు. కాల్పులు ప్రారంభమైన తర్వాత మూడు గంటలకు ఆ దుండగుడ్ని భద్రతా దళాలు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో 9/11 తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన సంఘటన ఇదే.

Pages