• వాట్‌ఫోర్డ్, డిసెంబర్ 4: నాటో కూటమికి చెందిన దేశాధినేతల్లో ఎక్కువ మంది అమెరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/30/2016 - 07:22

లండన్, ఏప్రిల్ 29: దేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ చెక్కేసిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారత్‌కు తిరిగివచ్చేది లేదని తేల్చిచెప్పేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను దేశం విడిచిరావల్సి వచ్చిందని ఆయన చెప్పారు. పాస్‌పోర్టు రద్దుచేయడం లేదా అరెస్టు చేయడం ద్వారా తన నుంచి బాకీ ఎలా వసూలు చేయగలరని ఆయన ప్రశ్నించారు.

04/30/2016 - 07:18

న్యూయార్క్, ఏప్రిల్ 29: భారత్‌తో సం బంధాలను మెరుగుపర్చుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోందని, అయితే భారత్ మాత్రం కేవలం ఉగ్రవాదంపై మాట్లాడడానికే ఆసక్తి కనబరుస్తోందని, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబందాల మెరుగుకు అది ఎంతమాత్రం తోడ్పడజాలదని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ రాయబారి మలీహా లోధీ అన్నారు.

04/30/2016 - 06:40

వాషింగ్టన్, ఏప్రిల్ 29: అమెరికా పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించడం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి జరుపుకునే కృషికి మరింత జవసత్వాలను అందిస్తుందని అధికార, ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యులు ముక్తంఠంతో అభిప్రాయ పడ్డారు.

04/30/2016 - 06:38

పోర్ట్ మోరెస్‌బి, ఏప్రిల్ 29: అసహనం, తీవ్రవాదం జాడ్యాలతో సతమతమవుతున్న ప్రపంచానికి నేటికీ మహాత్మాగాంధీ బోధనల ఆవశ్యకత ఎంతయినా ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ బోధించిన శాంతియుత సహజీవనం, పరస్పర గౌరవం వంటి నిజమైన విలువలు నేటికీ అనుసరణీయమని ఆయన అంతర్జాతీయ సమాజానికి గుర్తుచేశారు.

04/29/2016 - 05:30

పోర్ట్ మోరెస్బీ(పీఎన్జీ), ఏప్రిల్ 28: దక్షిణ సముద్రంపై చైనా ఆధిపత్య ధోరణి నేపథ్యంలో సముద్రమార్గంలో ఉద్రిక్తతలు, శత్రుత్వాలు కూడదని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం పిలుపునిచ్చారు.

04/29/2016 - 04:44

వాషింగ్టన్, ఏప్రిల్ 28: పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలన్న ఒబామా ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా పార్లమెంటు సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విమానాలను అది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కాక భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగిస్తుందేమోనన్న భయాలు వ్యక్తం చేశారు.

04/28/2016 - 17:51

దిల్లీ: బ్యాంకులకు భారీగా రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి బహిష్కరించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ యుకె హైకమిషన్‌కు లేఖ రాసింది. లండన్‌లోని భారత హైకమిషన్ కూడా ఇదే రకమైన విజ్ఞప్తితో అక్కడి బ్రిటన్ అధికారులకు లేఖ రాసింది.

04/27/2016 - 05:51

వాషింగ్టన్, ఏప్రిల్ 26: అమెరికా అధ్యక్ష పదవికి పార్టీల అభ్యర్థిత్వ రేసు హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ పోల్ సర్వే రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ కంటే, డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ మూడుశాతం ఆధిక్యంతో ముందుకు సాగుతున్నట్లు తేల్చింది. జార్జివాషింగ్టన్ యూనివర్సిటీ బాటిల్‌గ్రౌండ్ నిర్వహించిన పోల్ సర్వేలో హిల్లరీ 46శాతం, ట్రంప్ 43శాతం మంది మద్దతుతో కొనసాగుతున్నారు.

04/27/2016 - 05:44

లండన్, ఏప్రిల్ 26: బ్రిటన్‌లో ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన బిగ్‌బెన్(క్లాక్‌టవర్) మూగబోతోంది. 315 అడుగుల ఎతె్తైన ఈ క్లాక్ టవర్‌ను 1856లో పూర్తిచేశారు. 2009 నాటికే నూట ఏభై ఏళ్లు పూర్తిచేసుకున్న బిగ్‌బెన్‌ను అధికారికంగా ఎలిజబెత్ టవర్‌గా నామకరణ చేశారు.

04/26/2016 - 17:04

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్‌ఎఫ్) వ్యవస్థాపకుడు అమానుల్లా ఖాన్ (82) ఊపిరితిత్తుల వ్యాధితో మంగళవారం పాకిస్థాన్‌లోని రావల్పిండిలో తుదిశ్వాస విడిచినట్టు ఆయన అల్లుడు సజ్జద్ తెలిపారు. 1977లో కొంతమంది న్యాయవాదులతో కలిసి జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్‌ఎఫ్) స్థాపించారు. ఇండియా, పాకిస్థాన్ నుంచి కశ్మీర్‌కు స్వేచ్ఛ లభించాలని ఆయన కోరుకున్నారు.

Pages