S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/06/2016 - 07:38

దోహా, జూన్ 5: భారత్, ఖతార్‌ల మధ్య ఆదివారం ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మనీ లాండరింగ్ (హవాలా), ఉగ్రవాద సంస్థలకు నిధులను అదుపు చేయడానికి ఆర్థిక సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించిన ఒప్పందం, అలాగే ఖతార్‌నుంచి వౌలిక సదుపాయాల రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన ఒప్పందం కూడా వీటిలో ఉన్నాయి.

06/06/2016 - 07:38

దోహా, జూన్ 5: హవాలా లావాదేవీలు, ఉగ్రవాద నిధులను అదుపు చేయడానికి ఇంటెలిజన్స్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని భారత్, ఖతార్‌లు ఆదివారం అంగీకరించాయి. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, దానికి మద్దతు ఇచ్చే శక్తులను ఏకాకులను చేయాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలు పేర్కొంటూ, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే, దాన్ని తమ విధానాకి ఒక పావుగా ఉపయోగించుకునే శక్తులపై తక్షణం చర్యలు తీసుకోవడానికి కూడా అంగీకరించాయి.

06/06/2016 - 06:39

దోహా, జూన్ 5: భారత్‌లో అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించివేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి అలవాటు పడ్డ ఎందరి నోళ్లనో కట్టేశానని..ఆ విధంగా ఎన్నో సమస్యలూ ఎదుర్కొన్నానని చెప్పారు.

06/05/2016 - 07:02

దోహా, జూన్ 4: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్‌లో పర్యటిస్తున్న క్రమంలో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల ప్రగతిని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి. భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా శనివారం ఇక్కడకు చేరుకున్న మోదీ.. ఆదివారం ఖతార్ అధినాయకత్వంతో చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా హైడ్రోకార్బన్ రంగంలో ఖతార్ సాయాన్ని మోదీ కోరనున్నారు.

06/05/2016 - 06:27

సింగపూర్, జూన్ 4: ఇండో- పసిఫిక్ ప్రాంతంలో సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి, బలప్రయోగం, ఇతర ముప్పులనుంచి ఎదుర్కోవడానికి ఒక ప్రాంతీయ భద్రతా వ్యవస్థ అవసరమని భారత్ అభిప్రాయ పడింది. శనివారం ఇక్కడ 15వ షంగ్రీ-లా సదస్సునుద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ పిలుపునిచ్చారు.

06/05/2016 - 05:41

వాషింగ్టన్, జూన్ 4: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అనేక ప్రధాన అంశాలు చర్చించాలని ఒబామా ప్రభుత్వం భావిస్తోంది. భద్రత, రక్షణ సహకారం అలాగే వాతావరణ మార్పులపై మోదీతో చర్చిస్తామని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. 2015 జనవరిలో అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనతో ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడ్డాయ.

06/05/2016 - 04:17

హెరత్, జూన్ 4: ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారతదేశం అఫ్గానిస్థాన్‌లోని అన్ని ప్రాంతాలకూ సహాయాన్ని కొనసాగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో కలిసి అఫ్గాన్- ఇండియా ఫ్రెండ్‌షిప్ డ్యామ్ ప్రారంభించారు.

06/05/2016 - 04:49

లాస్ ఏంజిలిస్, జూన్ 4: ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్, ‘అజేయుడు’ మహమ్మద్ అలీ దీర్ఘకాల అనారోగ్యంతో మృతి చెందాడు. అతని మృతి వార్త ప్రపంచ క్రీడా రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 32ఏళ్లు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడిన 74ఏళ్ల అలీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గత రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసినట్టు కుటుంబీకులు ప్రకటించారు.

06/04/2016 - 08:14

వాషింగ్టన్, జూన్ 3: సెకండ్ హ్యాండ్‌లో ఓ ఫ్రిజ్‌ను కొన్న అమెరికా మహిళకు ముచ్చెమటలు పట్టాయి. సమీపంలోని ఓ గ్యారేజీలో కేవలం 30 డాలర్లకే ఈ సెకండ్ హ్యాండ్ ఫ్రిజ్‌ను ఆనందంగా కొనేసింది. ఈ గ్యారేజ్ తన పొరుగున ఉన్న వారిదే కావడంతో చాల నమ్మకంతోనే దాన్ని కొన్నానని ఉత్తరకరోలీనాకు చెందిన మహిళ వెల్లడించిది. తీరా ఇంటికెళ్లి చూస్తే అందులో మానవ దేహానికి సంబంధించిన భాగాలు ఉన్నాయంటూ విస్మయకర స్వరంతో తెలిపింది.

06/04/2016 - 08:12

వాషింగ్టన్, జూన్ 3: భారత్‌పై దాడులకు పాల్పడిన లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా తప్పుపట్టింది. దీంతో ఉగ్రవాద సంస్థలు రిక్రూట్‌మెంట్‌లు, నిధుల సేకరణ నిరాటంకంగా కొనసాగుతోందని పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖ వార్షిక నివేదికలో పలు అంశాలను వెల్లడించింది.

Pages