S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/04/2016 - 07:36

వాషింగ్టన్, జూన్ 3: ఖగోళవేత్తలు గతంలో అంచనావేసిన దానికంటే విశ్వం చాలా వేగంగానే విస్తరిస్తోందని ఏకంగా ఐదు నుంచి తొమ్మిది శాతం మేర దీని విస్తృతి పెరుగుతునే వస్తోందని నాసా వెల్లడించింది. హబుల్ టెలిస్కోప్ అందించిన వివరాలను పరిశీలించిన నాసా శాస్తవ్రేత్తలు ఈ పరిణామాన్ని అనూహ్యమైనదిగానే పేర్కొంటున్నారు. దీని వల్ల శూన్య ఇంధనం, శూన్య పదార్ధం అలాగే రేడియేషన్ సహా ఏమాత్రం కాంతిని ప్రసరించని,..

06/03/2016 - 04:37

వాషింగ్టన్, జూన్ 2: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడటానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైన డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం గురువారం తీవ్రమయింది. ‘ట్రంప్ యూనివర్శిటీ’ వివాదంలో చిక్కుకున్న డొనాల్డ్ ట్రంప్‌పై హిల్లరీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

06/03/2016 - 04:32

వాషింగ్టన్, జూన్ 2: ఖగోళ విజ్ఞానం ఇప్పటివరకు సాధించిన రోదసీ రికార్డులను అధిగమించింది. దాదాపు 500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంనుంచి హైడ్రోజన్ వాయువు లేశప్రాయ సంకేతాలను ధార్మిక కిరణాల ఖగోళ విజ్ఞానం అందిపుచ్చుకోగలిగింది. గతంలో సాధించిన దానికంటే ఇది దాదాపు రెండింతల దూరం రికార్డు.

06/03/2016 - 04:18

వాషింగ్టన్, జూన్ 2: మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై సమానత్వం, భాగస్వామ్యం ప్రాతిపదికన అమెరికాతో చర్చించడానికి భారత్ సిద్ధంగా ఉందని, అయితే దీనికి సంబంధించి ఎలాంటి ‘తీర్పుల’ను ఆమోదించబోదని భారతీయ అధికారులు తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో భారతీయ అధికారులు ఈ విషయం స్పష్టం చేశారు.

06/02/2016 - 07:58

టొరంటో, జూన్ 1: పాలపుంత మొత్తం ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కంటే 700 బిలయన్ రెట్లు ఎక్కువని తాజా పరిశోధనలో వెల్లడైంది. సూర్యుడి మొత్తం ద్రవ్యరాశి 2 నానిలియన్లు. అంటే 2 తరువాత 30 సున్నాల కిలో గ్రాములన్నమాట! మరో రకంగా చెప్పుకోవాలంటే ఈ భూమి ద్రవ్యరాశి కంటే సూర్యుడి ద్రవ్యరాశి 3 లక్షల 30వేల రెట్లు ఎక్కువ.

06/02/2016 - 07:58

టొరంటో, జూన్ 1: పాలపుంత మొత్తం ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కంటే 700 బిలయన్ రెట్లు ఎక్కువని తాజా పరిశోధనలో వెల్లడైంది. సూర్యుడి మొత్తం ద్రవ్యరాశి 2 నానిలియన్లు. అంటే 2 తరువాత 30 సున్నాల కిలో గ్రాములన్నమాట! మరో రకంగా చెప్పుకోవాలంటే ఈ భూమి ద్రవ్యరాశి కంటే సూర్యుడి ద్రవ్యరాశి 3 లక్షల 30వేల రెట్లు ఎక్కువ.

06/02/2016 - 07:56

ఇస్లామాబాద్, జూన్ 1: భారత్‌తో చర్చల కోసం తాము ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ, ఆదేశం నుంచి సానుకూల ప్రతిస్పందన రావడంలేదని.. చర్చల నుంచి భారత్ పారిపోతోందని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ విమర్శించారు.

05/31/2016 - 06:27

లండన్, మే 30: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతుందా లేదా అన్నదానిపై అంతర్జాతీయంగా చర్చలు చెలరేగుతున్న నేపథ్యంలో బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ నాయకత్వానికి తీవ్రసవాళ్లు ఎదురవుతున్నాయి. వచ్చేనెల 23న ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరగబోతోంది.

05/31/2016 - 04:57

టోక్యో, మే 30:నల్లధన పంకిలాన్ని వదిలించుకోక పోతే తీవ్ర ఇబ్బందులకు గురవుతారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నల్ల కుబేరులను హెచ్చరించారు. తమ నల్లధన ఖాతాలను వెల్లడించేందుకు కేంద్రం తాజాగా అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం నుంచి మొదలయ్యే ఈ గడువు దాటితే నల్లధన ఖాతాదారులకు ఎదురయ్యేవి నిద్ర లేని రాత్రులేనని కూడా స్పష్టం చేశారు.

05/30/2016 - 07:47

లాస్ ఎంజెలెస్, మే 29: అమెరికాలో ఓ పట్టణం కారు చౌకగా అమ్మకానికి వచ్చింది. కేవలం 8 మిలియన్ డాలర్లు చెల్లిస్తే ఈ పట్టణాన్ని సొంతం చేసుకోవచ్చు! ఓ పది యూనిట్ల హోటల్, కమ్యూనిటీ సెంటర్, కాసినో, జనరల్ స్టోర్, ఓ అగ్ని మాపక కేంద్రంతో 375 మంది ప్రజలతో ఈ పట్టణాన్ని 520 ఎకరాల్లో నిర్మించారు. లాస్ వేగాస్‌కు దక్షిణంగా 130 కిలోమీటర్ల దూరంలో కాల్ నెవ్ అరీ అనే ఈ పట్టణం ఉంది.

Pages