• వాట్‌ఫోర్డ్, డిసెంబర్ 4: నాటో కూటమికి చెందిన దేశాధినేతల్లో ఎక్కువ మంది అమెరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/11/2016 - 16:27

దిల్లీ: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ సోమవారం ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. పలురంగాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి.

04/11/2016 - 16:26

తైవాన్: తైవాన్‌లో సోమవారం భూ ప్రకంపనలు సంభవించాయి. ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. రిక్టర్ స్టేల్‌పై దీని తీవ్రత 5.5గా నమోదైంది.

04/11/2016 - 07:49

లండన్, ఏప్రిల్ 10: పనామా పత్రాలు యునైటెడ్ కింగ్‌డం ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను మరింతగా ఇరకాటంలో పడేశాయి. ఈ వ్యవహారంలో తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు తన పన్నుల వివరాలను వెల్లడించిన ఆయన మరిన్ని సమస్యల్ని కొనితెచ్చుకున్నట్టయింది. యుకె ప్రధానిగా తన పదవికే ముప్పు తెచ్చే ఈ వివాదం నుంచి బయట పడేందుకు తన ఆదాయం పన్ను రికార్లును ఆయన అనూహ్య రీతిలో విడుదల ఇందుకు కారణమైంది.

04/11/2016 - 07:19

న్యూయార్క్, ఏప్రిల్ 10: ఐక్యరాజ్య సమితి 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు బహిరంగ చర్చల్లో పాల్గొని సభ్య దేశాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు.

04/10/2016 - 05:15

న్యూయార్క్, ఏప్రిల్ 9: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్‌కు అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. ఆయన జయంతి కార్యక్రమాన్ని తొలిసారి ఐక్యరాజ్య సమితిలో నిర్వహించనున్నారు.

04/10/2016 - 05:12

బ్రసెల్స్, ఏప్రిల్ 9: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని విమానాశ్రయంతో పాటు మెట్రో రైల్వే స్టేషన్‌లో ఇటీవల జరిగిన బాంబు దాడులపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో గత ఏడాది పారిస్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న మొహమ్మద్ అబ్రినీ కూడా ఉన్నాడని అధికారులు వెల్లడించారు.

04/10/2016 - 05:10

పనామా సిటీ, ఏప్రిల్ 9: పనామా పేపర్స్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఫ్రాన్స్ పనామాను ‘సహకరించని దేశాల’ జాబితాలో చేర్చడం పొరపాటు నిర్ణయమని పనామా అధ్యక్షుడు జువాన్ కార్లోస్ వారెలా పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్రాన్స్ ప్రభుత్వ నిర్ణయం పొరపాటుదే కాకుండా అనవసర చర్య అని విమర్శించారు.

04/09/2016 - 08:24

వాషింగ్టన్, ఏప్రిల్ 8: భారత్‌తో శాంతి చర్చల ప్రక్రియను నిలిపివేయాలన్న పాకిస్తాన్ నిర్ణయంపై అమెరికా స్పందించింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సడలిపోవాలంటే ప్రత్యక్ష చర్చలే శరణ్యమని అమెరికా స్పష్టం చేసింది.

04/09/2016 - 04:09

లండన్, ఏప్రిల్ 8: ప్రపంచ నేతల్ని హడలెత్తిస్తున్న పనామా అక్రమ కంపెనీల జాబితా ఇప్పుడు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ మెడకు చుట్టుకుంటోంది. ఓ విదేశీ కంపెనీలో వాటా ద్వారా తాను లబ్ధి పొందిన మాట నిజమేనంటూ కామెరూన్ తాజాగా అంగీకరించడంతో ఆయనపై అన్ని వైపుల నుంచి వత్తిడి మొదలైంది. ఆర్థిక అనైతికతకు పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలు బ్రిటన్ ప్రధానిగా ఆయన కొనసాగడాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

04/08/2016 - 06:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: భారత్, పాకిస్తాన్‌ల మధ్య శాంతి ప్రక్రియ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగిపోయిందని భారత్‌లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ గురువారం అన్నారు. రెండు దేశాల మధ్య ఇప్పటికైతే ఎలాంటి చర్చల ప్రతిపాదనలు లేవని ఆయన అన్నారు. విదేశీ విలేకరుల క్లబ్‌లో జరిగిన సమావేశంలో, ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు.

Pages