S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/13/2016 - 01:41

కారకాస్, ఫిబ్రవరి 12: వెనిజులాలో జికా వైరస్ వల్ల ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు నికొలాస్ మడురో శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. దోమల వల్ల వ్యాపించే జికా వైరస్ కారణంగా మరణాలు సంభవించడం వెనిజులాలో ఇదే మొదటిసారి. దేశంలో మొత్తం 319 మందికి ఈ వైరస్ సోకినట్లు ధ్రువీకరించడం జరిగిందని మడురో నేషనల్ టెలివిజన్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు.

02/12/2016 - 05:46

వాషింగ్టన్: భారతదేశం వలస దేశంగా ఉండిఉంటేనే బావుండేదంటూ బోర్డ్ సభ్యుడు మార్క్ అండర్‌సన్ చేసిన వ్యాఖ్యలపై ఫేస్‌బుక్ సంస్థాపకుడు మార్క్ జుకెర్‌బెర్గ్ తీవ్ర మనస్థాపం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు ఎంతో వేదన కలిగించాయని వాటితో తమ కంపెనీకి, దాని ఆలోచనలకు ఏ రకమైన సంబంధం లేదని ఆయన వెల్లడించారు.

02/11/2016 - 07:52

న్యూయార్క్, ఫిబ్రవరి 10: ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్‌ను భారత్ నిషేధించడాన్ని ఆ సంస్థ బోర్డు మరోసారి తీవ్రంగా మండిపడింది. నిన్న ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకెన్ బర్గ్ ట్రాయ్ నిర్ణయం తనకు తీవ్ర అసంతృప్తి కలిగించందంటూ పరోక్షంగా ఆ నిర్ణయాన్ని దుయ్యబట్టడం తెలిసిందే.

02/11/2016 - 07:47

వాషింగ్టన్, ఫిబ్రవరి 10: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు రానురాను రసవత్తరంగా మారుతోంది. అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ నామినీకోసం ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అందరికన్నా ముందున్న మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు బుధవారం న్యూహాంప్‌షైర్ ప్రైమరీ ఎన్నికల్లో చుక్కెదురైంది.

02/11/2016 - 07:46

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 10: అంతరిక్ష పరిశోధనల్లో ఎప్పటికప్పుడు ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మిస్టరీలు వెలుగుచూస్తునే ఉంటాయి. తాజాగా ఖగోళవేత్తలు జరిపిన పరిశోధనల్లో వందలాది నక్షత్ర మండలాలు వెలుగుచూశాయి. ఇవన్నీకూడా మన పాలపుంత వెనుక భాగంలోనే భూమికి కేవలం 250 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్నాయని పరిశోధకులు నిగ్గుతేల్చారు.

02/10/2016 - 07:16

వాషింగ్టన్, ఫిబ్రవరి 9: భూగోళాన్ని మరో గ్రహశకలం అతి సమీపంగా దాటబోతోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. మార్చి 5న అత్యంత వేగంగా టిఎక్స్-68 అనే ఈ గ్రహ శకలం భూమికి సమీపంగా వెళ్లబోతోందని ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రతి ఒక్కరూ చూసే అవకాశం ఉందని కూడా నాసా తెలిపింది. దాదాపు 30 మీటర్ల వెడల్పు కలిగిన ఈ గ్రహశకలం వచ్చే నెల 5న భూమికి 18వేల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోయే అవకాశం ఉంది.

02/10/2016 - 07:12

ఖాట్మండు: నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. 79 ఏళ్ల కొయిరాల 2014 ఫిబ్రవరి నుంచి 2015 అక్టోబర్ వరకూ ప్రధానిగా పనిచేశారు. ఖాట్మండు శివార్లలోని మహారాజ్‌గంజ్‌లోని స్వగ్రహంలో ఆయన కన్నుమూశారు. నేపాల్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీ నేపాల్ కాంగ్రెస్‌కు సుశీల్ కొయిరాలా అధ్యక్షుడిగా పనిచేశారు.

02/10/2016 - 07:11

వాషింగ్టన్, ఫిబ్రవరి 9: నెట్ న్యూట్రాలిటీకి మద్దతు ఇవ్వాలని టెలికాం రెగ్యులేటర్ ‘ట్రాయ్’ తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ‘ఫేస్‌బుక్’ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో వినియోగదారులు స్వేచ్ఛగా డేటా పొందడానికి తన సంస్థ, ఇతర సంస్థలు చేపట్టిన కార్యక్రమాలకు ట్రాయ్ నిర్ణయం అడ్డంకిగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

02/09/2016 - 06:55

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 8: ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడింది. పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై ఇటీవల జరిగిన దాడిలో జైష్ ఎ మహమ్మద్ (జెఇఎం) అధినేత వౌలానా మసూద్ అజర్ పాత్ర ఉన్నట్లు నిరూపించే ఎలాంటి ఆధారాలు దొరకలేదని పాకిస్తాన్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొన్నట్లు మీడియా కథనాలు తెలిపాయి.

02/09/2016 - 06:30

లండన్, ఫిబ్రవరి 8: భారత స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18వ తేదీన విమాన ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత తైపీలోని ఆసుపత్రిలోనే కన్నుమూశారని ఆయన సహచరుడైన కజునోరి కునిజుకా అనే జపనీయుడు ధ్రువీకరించినట్లు ‘బోస్‌ఫైల్స్.ఇన్ఫో’ వెబ్‌సైట్ స్పష్టం చేసింది.

Pages