• వాట్‌ఫోర్డ్, డిసెంబర్ 4: నాటో కూటమికి చెందిన దేశాధినేతల్లో ఎక్కువ మంది అమెరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/22/2016 - 18:00

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మంగళవారం ఎయిర్ పోర్టు, మెట్రో రైల్వే స్టేషన్‌లో వరుస బాంబు పేలుళ్లలో కనీసం 26 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్ పోర్టులో రెండుసార్లు బాంబులు పేలడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగానే ఉందని వారు తెలిపారు. ఇది ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి అని బెల్జియం పోలీసులు అనుమానిస్తున్నారు.

03/22/2016 - 15:53

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలోని ఎయిర్ పోర్టు, మెట్రో రైల్వేస్టేషన్లలో వరుస బాంబు పేలుళ్లతో విధ్వంసం నెలకొంది. పేలుళ్ల ధాటికి పలువురు మరణించారని, చాలామంది గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. అన్ని మెట్రో స్టేషన్లను, ఎయిర్‌పోర్టును, సిటీ మ్యూజియంను వెంటనే మూసివేశారు. ఈ ఘటనలో భారతీయులెవరూ మరణించలేదని అక్కడి భారత రాయబార కార్యాలయం సిబ్బంది తెలిపారు.

03/21/2016 - 07:05

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ నుంచి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటీవల చికాగోలో ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన ఆందోళనకారులు తాజాగా న్యూయార్క్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించడంతో పాటు అరిజోనా రాష్ట్ర నైరుతి ప్రాంతంలోని ఒక ప్రధాన రహదారిని దిగ్బంధించి ఆయన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

03/21/2016 - 07:02

దుబాయి: రష్యాలో శనివారం కూలిపోయిన తమ విమానంలో ఉన్న మొత్తం 62 మంది ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి 20 వేల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఫ్లై దుబాయి ఎయిర్‌లైన్స్ ఆదివారం ప్రకటించింది.

03/20/2016 - 17:16

ఇస్లామాబాద్‌: చేపల వేటకు వెళ్లి అరెస్టైన భారత జాలర్లలో 86 మందిని పాక్‌ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. వీరిని వాఘా సరిహద్దు అధికారులకు అప్పగించనున్నట్లు కరాచీలోని మాలిర్‌ జైలు సూపరింటెండెంట్‌ తెలిపారు. మరో 363 మంది భారత జాలర్లు పాక్‌ జైల్లో మగ్గిపోతున్నారు.

03/20/2016 - 17:11

స్పెయిన్‌: స్పెయిన్‌లో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సులో 50 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. 30 మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

03/20/2016 - 17:07

పెషావర్‌: పాకిస్థాన్‌లో మట్టిపెళ్లలు విరిగిపడి ఎనిమిది మంది విద్యార్థులు సజీవసమాధి అయ్యారు. ఆఫ్గానిస్థాన్‌ సరిహద్దు ప్రాంతమైన సుసమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
విద్యార్థులు పరీక్షలు రాసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన సంభవించింది. ఇటీవల భారీ వర్షాలకు నానిన మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి.

03/20/2016 - 07:06

సిడ్నీ, మార్చి 19: వాతావరణ మార్పుపై కార్యాచరణకు పిలుపులో భాగంగా గంటసేపు దీపాలను ఆర్పేయాలన్న ఎర్త్ అవర్ పిలుపునకు స్పందిస్తూ శనివారం రాత్రి ఆస్ట్రేలియాలోని సుప్రసిద్ధ ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జి ప్రాంతాలతో పాటుగా నగరమంతా కూడా చీకటిగా మారిపోయింది. పదేళ్ల క్రితం అంటే 2007లో సిడ్నీ నగరంనుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు 176 దేశాలకు విస్తరించినందుకు నిర్వాహకులు ఎంతో సంతోషిస్తున్నారు.

03/20/2016 - 07:04

వాషింగ్టన్, మార్చి 19: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు 47వ యాత్రలో భాగంగా మరో ముగ్గురు సిబ్బంది శనివారం ఐఎస్‌ఎస్‌కు క్షేమంగా చేరుకున్నారు. వీరు అయిదు నెలలపాటు ఐఎస్‌ఎస్‌లో గడపడమే కాకుండా అంగారక గ్రహానికి నాసా ప్రయాణానికి దోహదపడే కీలక ప్రయోగాలు నిర్వహిస్తారని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా తెలియజేసింది.

03/20/2016 - 06:56

ఇస్తాంబుల్, మార్చి 19: బాంబు పేలుళ్లతో అట్టుడుకుతున్న టర్కీలో మరో పేలుడు జరిగింది. ఇస్తాంబుల్‌లో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ విలేఖరులకు తెలిపారు. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యేనని, పేలుడులో ఆత్మాహుతి బాంబర్ కూడా మృతిచెందాడని ఆయన తెలిపారు.

Pages