S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/02/2016 - 02:46

మెల్‌బోర్న్, ఏప్రిల్ 1: హైదరాబాద్ యూనివర్శిటీ(హెచ్‌సియు) అలాగే ఢిల్లీ జెఎన్‌యు విద్యార్థులపై తీసుకున్న చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గట్టిగా సమర్ధించుకున్నారు. ముంబయిపై దాడికి పాల్పడ్డ, అలాగే పార్లమెంటుపైన తెగబడ్డ వ్యక్తులను బహిరంగంగా కీర్తిస్తే సైద్ధాంతికంగా తీవ్ర స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందన్నది ఎంతైనా వాస్తవమని జైట్లీ తెలిపారు.

04/01/2016 - 17:24

కరాచీ: తమ సముద్ర జలాల్లోకి చొచ్చుకునివచ్చి చేపలను వేటాడుతున్న భారత్‌కు చెందిన 59 మంది జాలర్లను శుక్రవారం పాక్ అధికారులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. గుజరాత్, సింధ్ సరిహద్దుల్లో భారతీయ జాలర్లు వేటకు వెళ్లగా పాకిస్తాన్ సముద్ర జలాల రక్షణ సంస్థ అధికారులు అరెస్టు చేసి పది పడవలను స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద సర్‌క్రీక్ ప్రాంతంలో వేటకు వెళ్లే భారతీయ జాలర్లను పాక్ తరచూ అరెస్టు చేస్తోంది.

04/01/2016 - 17:04

టోక్కో: జపాన్‌లోని హోన్షూ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో జనం ఒక్కసారి ఇళ్లలో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు లేకున్నా పలుచోట్ల బుల్లెట్ ట్రైన్లను నిలిపివేశారు. రిక్టర్ స్కేల్‌పై భూ కంపం తీవ్రత 6.0గా నమోదైందని అధికారులు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు.

04/01/2016 - 03:25

బ్రసెల్స్, మార్చి 31: నాలుగేళ్ల క్రితం కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను ఇద్దరు ఇటలీ నావికులు కాల్చి చంపిన కేసులో ఒక అంగీకారానికి రావడంలో భారత్, యూరోపియన్ యూనియన్ విఫలమయ్యాయి.

04/01/2016 - 03:24

బ్రసెల్స్, మార్చి 31: సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చనే విషయాన్ని అర్థం చేసుకోలేని ‘కొన్ని పొరుగుదేశాలు’ ఉన్నాయం టూ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పరోక్షంగా పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. సరిహద్దు సమస్యతో పాటుగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించుకున్న బంగ్లాదేశ్ ఈ దేశాలకు ఆదర్శం కావాలన్నారు.

04/01/2016 - 03:10

నైపిడా, మార్చి 31: అర్థ శతాబ్దం తరువాత మైన్మార్‌లో ప్ర జాస్వామ్యం పునరుజ్జీవానికి పా టుపడిన వీరనారి ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వంలో ప్రత్యేక సలహాదారు పాత్ర పోషించనున్నారు. దీనికి సంబంధించి నేషనల్ లీగ్ డెమోక్రటిక్ పార్టీ (ఎన్‌ఎల్‌డి) గురువారం కొత్త ప్రతిపాదనను అందజేసింది. సైనిక పాలన నుంచి సూకీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆగ్నేయాసియా దేశాల్లో ఆనందానికి అవధుల్లేవు.

03/31/2016 - 15:37

వాషింగ్టన్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో పర్యటన ముగిసిన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌లో అణుభద్రతపై జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్కొంటారు. అమెరికాలో పర్యటన ముగిశాక ఆయన సౌదీ అరేబియా వెళతారు.

03/31/2016 - 03:26

నైపిడా, మార్చి 30: మైన్మార్‌లో కొత్త శకంలోకి ప్రవేశించింది. ఏభై ఏళ్ల సైనిక పాలనకు తెరదించుతూ ఆంగ్‌సాన్ సూకీ నాయకత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారం చేపట్టింది. మైన్మార్ అధ్యక్షుడిగా ఆంగ్‌సాన్ సూకీ మాజీ డ్రైవర్, ఆమెకు అత్యంత సన్నిహితుడు హితిన్ క్యా బుధవారం దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఏప్రిల్ 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

03/31/2016 - 03:22

బ్రసెల్స్, మార్చి 30: బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్‌తో కలిసి ఆసియాలో అతిపెద్ద ఆర్యభట్ట టెలిస్కోప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బెల్జియం సహాయంతో ఈ టెలిస్కోప్‌ను నిర్మించారు. ఉత్తరాఖండ్‌లోని నైనటాల్ సమీపంలో గల దేవస్థల్ వద్ద ఏర్పాటు చేసిన 3.6 మీటర్ల వెడల్పు కలిగిన అద్దంతో కూడిన ఈ టెలిస్కోప్‌ను రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఆసియాలోనే ఇది అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్.

03/31/2016 - 02:48

బ్రసెల్స్, మార్చి 30: ఉమ్మడి బలంతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఎంతో ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బెల్జియం ప్రధాని చార్లెస్ మైకేల్‌తో బుధవారం సమావేశమైన ఆయన ఉగ్రవాదం ఇరు దేశాలకు ఉమ్మడి శత్రువని, దీన్ని ఉమ్మడి బలంతోనే ఎదుర్కోవాలని ఉద్ఘాటించారు.

Pages