S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/10/2016 - 07:11

వాషింగ్టన్, ఫిబ్రవరి 9: నెట్ న్యూట్రాలిటీకి మద్దతు ఇవ్వాలని టెలికాం రెగ్యులేటర్ ‘ట్రాయ్’ తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ‘ఫేస్‌బుక్’ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో వినియోగదారులు స్వేచ్ఛగా డేటా పొందడానికి తన సంస్థ, ఇతర సంస్థలు చేపట్టిన కార్యక్రమాలకు ట్రాయ్ నిర్ణయం అడ్డంకిగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

02/09/2016 - 06:55

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 8: ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడింది. పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై ఇటీవల జరిగిన దాడిలో జైష్ ఎ మహమ్మద్ (జెఇఎం) అధినేత వౌలానా మసూద్ అజర్ పాత్ర ఉన్నట్లు నిరూపించే ఎలాంటి ఆధారాలు దొరకలేదని పాకిస్తాన్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొన్నట్లు మీడియా కథనాలు తెలిపాయి.

02/09/2016 - 06:30

లండన్, ఫిబ్రవరి 8: భారత స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18వ తేదీన విమాన ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత తైపీలోని ఆసుపత్రిలోనే కన్నుమూశారని ఆయన సహచరుడైన కజునోరి కునిజుకా అనే జపనీయుడు ధ్రువీకరించినట్లు ‘బోస్‌ఫైల్స్.ఇన్ఫో’ వెబ్‌సైట్ స్పష్టం చేసింది.

02/09/2016 - 06:29

నెపిట్వా, ఫిబ్రవరి 8: నేషనల్ లీగ్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి ఆంగ్ సాన్ సూకీ మైన్మార్ అధ్యక్షపీఠం అధిరోహించడానికి మార్గం సుగమం అవుతోంది. సూకీ అధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు రాజ్యాంగపరమైన ఇబ్బందులు తొలగిపోనున్నాయని ప్రభుత్వం అనుకూల వార్తా చానళ్లు వెల్లడించాయి. మైన్మార్ మిలటరీ చీఫ్‌తో జరిగిన చర్చలు సూకీకి సానుకూలంగా ఉన్నాయని వారు స్పష్టం చేశారు.

02/08/2016 - 06:17

సియోల్, ఫిబ్రవరి 7: నెల రోజుల క్రితం అణ్వస్త్ర పరీక్ష జరిపి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన ఉత్తర కొరియా ఆదివారం ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ప్రకటించి ఉద్రిక్తతను మరింత పెంచింది.

02/07/2016 - 08:52

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ సంస్థ అమెరికా ఉద్యోగుల స్థానంలో తక్కువ వేతనాలకు హెచ్-1బి వీసాలపై వచ్చిన విదేశీ ఉద్యోగులను నియమించుకుందన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది. ‘ఎవర్ సోర్స్ ఎనర్జీ’ అనే ఈ సంస్థ ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో సైతం స్థానం పొందింది.

02/07/2016 - 08:51

వాషింగ్టన్, ఫిబ్రవరి 6: అణు ప్రమాదాలకు సంబంధించిన అనుబంధ నష్టపరిహారాల ఒడంబడికపై సంతకం చేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను అమెరికా స్వాగతిస్తూ, ఈ ముఖ్యమైన చర్య వల్ల భారత్‌లో అణు రియాక్టర్ల నిర్మాణంలో అమెరికా కంపెనీలు పాలుపంచుకోవడానికి వీలవుతుందని పేర్కొంది.

02/07/2016 - 08:50

కొలంబో, ఫిబ్రవరి 6: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ఆ దేశ అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో సమావేశమై పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించారు.

02/07/2016 - 08:49

వాషింగ్టన్: డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రగామిగా ఉందని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉద్ఘాటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని అభివృద్ధికి భారత్‌లో గల అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన ప్రముఖ ఐటి సంస్థలకు పిలుపునిచ్చారు.

02/07/2016 - 08:49

తైనాన్: దక్షిణ తైవాన్‌లో సంభవించిన తీవ్ర భూకంపకానికి 14మంది మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. బహుళ అంతస్తు భవనం కూలిపోయి 14 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. శిథిలాల కింద నుంచి 247 మందిని రక్షించారు. 1200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.

Pages