S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/06/2016 - 01:13

జెనీవా/ లండన్, ఫిబ్రవరి 5: బ్రిటన్, స్వీడన్‌లకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి వేదికగా చేసిన పోరాటంలో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే విజయం సాధించారు. అసాంజేది నిరంకుశ నిర్బంధమేనని ఐరాస వర్కింగ్ గ్రూప్ శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. నిరంకుశ నిర్బంధం వల్ల అసాంజే తన స్వేచ్ఛను కోల్పోయారని పేర్కొంది.

02/05/2016 - 08:42

బ్యాంకాక్, ఫిబ్రవరి 4: రోజురోజుకు పెరుగుతున్న ఉగ్రవాద జాడ్యాన్ని ఎదుర్కోవడానికి భావ సారూప్యత గల దేశాల మధ్య పటిష్ఠమైన సహకారం అవసరమని భారత ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ పిలుపునిచ్చారు. భారత్-్థయిలాండ్ మధ్య రక్షణ సంబంధాల పెరుగుదలకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

02/05/2016 - 08:25

లండన్, ఫిబ్రవరి 4: ఐక్యరాజ్య సమితి వర్కింగ్ గ్రూప్ శుక్రవారం వెలువరించే నిర్ణయం తనకు వ్యతిరేకంగా ఉంటే తాను బ్రిటిష్ పోలీసులకు లొంగిపోతానని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే గురువారం స్పష్టం చేశారు.

02/05/2016 - 04:36

ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన దాడుల ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలో ముంబయి దాడికి కుట్రదారు హఫీజ్ సరుూద్ రెచ్చగొట్టేరీతిలో మాట్లాడాడు. భారత్‌పై మరిన్ని దాడులను చేస్తామని హెచ్చరించాడు. అక్రమిత కాశ్మీర్‌లోని ఓ ర్యాలీలో మాట్లాడిన జమాద్ ఉద్ దవా(జెయుడి) అధ్యక్షుడు సరుూద్‌‘ ఇప్పటికి పఠాన్‌కోట్‌పై దాడినే చూశారు.

02/03/2016 - 06:45

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 2: కాశ్మీరులో ఉగ్రవాద గ్రూపులకు మద్దతునివ్వడం మానుకుని అక్కడ దాడులకు తెగబడుతున్న మూకలపై చర్యలు చేపట్టాలని, తద్వారా అంతర్జాతీయ సమాజంలో భయాందోళనలను తొలగించాలని పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్-ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్) ప్రభుత్వానికి సూచించింది.

02/03/2016 - 06:40

వాషింగ్టన్, ఫిబ్రవరి 2: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఇప్పటివరకు ముందంజలో ఉండిన డొనాల్డ్ ట్రంప్‌కు లోవా రాష్ట్రంలో చుక్కెదురైంది. రిపబ్లికన్ పార్టీ అభిమానుల (కాకస్) మధ్య జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో ఉన్న మరో అభ్యర్థి టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్ ట్రంప్‌పై భారీ ఆధిక్యత సాధించారు.

02/02/2016 - 00:30

లాహోర్, ఫిబ్రవరి 1: పఠాన్‌కోట్‌పై జరిగిన ఉగ్రవాద దాడి విషయంలో పాకిస్తాన్ తన రెండు నాల్కల ధోరణిని మరోసారి చాటుకుంది. ఈ దాడికి కుట్ర పన్నిన వారిని శిక్షిస్తామంటూ దర్యాప్తు చేపట్టిన పాక్ ఇప్పుడు ‘మరిన్ని ఆధారాలు’కావాలంటూ భారత్‌కు స్పష్టం చేసింది. తాజా పరిణామంతో పఠాన్‌కోట్ దర్యాప్తు వ్యవహారం మొదటికొచ్చింది.

02/01/2016 - 07:13

బీజింగ్, జనవరి 31: తమ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన దక్షిణ చైనా సముద్రంలోని ఒక వివాదాస్పద దీవి సమీపానికి ఒక యుద్ధ నౌకను పంపిన అమెరికా చర్య బాధ్యతారహితమైనదని చైనా ఆదివారం తీవ్రంగా విమర్శించింది. అంతేకాదు అమెరికా ఉద్దేశపూర్వకంగా జరిపే రెచ్చగొట్టే చర్యలు ఈ ప్రాంత సుస్థిరతపై అత్యంత ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని కూడా హెచ్చరించింది.

01/31/2016 - 07:57

లాహోర్, జనవరి 30: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తును త్వరలోనే పూర్తిచేసి, దర్యాప్తు నివేదికను బహిరంగ పరుస్తుందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం చెప్పారు. ఈ దాడి పాక్‌పై ప్రతికూల ప్రభావం చూపించడమే కాక, భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ల పాక్ పర్యటన తర్వాత సరయిన దిశలో సాగుతున్న చర్చలను సైతం భగ్నం చేసిందని షరీఫ్ చెప్పారు. ‘పఠాన్‌కోట్ దాడిపై దర్యాప్తు కొనసాగుతోంది.

01/31/2016 - 07:57

వాషింగ్టన్, జనవరి 30: చైనా, తైవాన్, వియత్నాంలు తమదిగా చెప్పుకొంటున్న వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌక గస్తీ నిర్వహించింది. అమెరికా, ఇతర దేశాల హక్కులు, స్వేచ్ఛలను పరిమితం చేసే మితిమీరిన సముద్ర జలాల హక్కులను సవాలు చేయడానికి అమెరికా ఈ గస్తీని నిర్వహించింది.

Pages