S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/24/2016 - 01:27

వాషింగ్టన్, జనవరి 23: అమెరికా రాజధాని వాషింగ్టన్‌పై రికార్డు స్థాయిలో 30 అంగుళాల మంచును కప్పేయవచ్చని భావిస్తున్న మంచు తుపాను శనివారం అమెరికా తూర్పు తీరాన్ని తాకింది. ఈ మంచు తుపాను కారణంగా దేశవ్యాప్తంగా ఎనిమిది మంది చనిపోగా, కనీసం పది రాష్ట్రాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి.

01/23/2016 - 01:14

ఇస్లామాబాద్, జనవరి 22: పాకిస్తాన్‌లో మరిన్ని విద్యాసంస్థలపై దాడి చేస్తామని బచాఖాన్ యూనివర్సిటీలో మారణకాండకు ప్రధాన కుట్రదారుడైన పాక్ తాలిబన్ నేత ఉమర్ మన్సూర్ హెచ్చరించాడు. దేశంలో రాజకీయ, న్యాయ, రక్షణ, ప్రజాస్వామ్య వ్యవస్థలకు మూలం ఇప్పుడున్న విద్యా వ్యవస్థేనని, అందుకే విద్యావ్యవస్థలపై దాడులు చేయడం ప్రారంభించామని ఓ వీడియో సందేశంలో అన్నాడు.

01/23/2016 - 01:14

మెల్‌బోర్న్, జనవరి 22: ఈ భూమి మీదే కాకుండా ఇతర గ్రహాల్లోనూ గ్రహాంతర జీవులున్నాయన్న కథనాలు అడపాదడపా వినిపిస్తునే ఉంటాయి, వీటి గురించి చెప్పుకోవడమే తప్ప వీటి ఉనికి ఎంత వరకు నిజం.. అసలు ఉన్నాయా? లేదా అన్నది దశాబ్దాలుగా మిస్టరీగానే కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఈ గ్రహాంతర జీవుల మిస్టరీని ఛేదించామని శాస్తవ్రేత్తల బృందం స్పష్టం చేసింది.

01/22/2016 - 01:45

వాషింగ్టన్, జనవరి 21: భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పలు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తోందనే విషయం మరోసారి ధ్రువపడింది. లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి), అఫ్గాన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థలు ఐఎస్‌ఐ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయని ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉన్నత స్థాయి కమాండర్ తాజాగా బయటపెట్టాడు.

01/22/2016 - 01:51

చార్‌సద్దా, జనవరి 21: పాకిస్తాన్‌లోని బచాఖాన్ యూనివర్సిటీలో బుధవారం మిలిటెంట్లు 21 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన తర్వాత గురువారం దేశవ్యాప్తంగా సంతాపదినం పాటించారు. నలుగురు సాయుధ మిలిటెంట్లు ఖైబర్-్ఫక్తూన్‌క్వా రాష్ట్రంలోని చార్‌సద్దాలో ఉన్న బచాఖాన్ యూనివర్సిటీలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఒక ప్రొఫెసర్ సహా 20 మంది మృతి చెందడం తెలిసిందే.

01/22/2016 - 01:52

వాషింగ్టన్, జనవరి 21: ఒకవేళ భారత్ గనుక తమపై దాడి చేస్తే దాన్ని నిరోధించడానికి వీలుగా పాకిస్తాన్ 110 నుంచి 130 దాకా అణ్వస్త్రాలను మోహరించి ఉందని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఒక నివేదిక పేర్కొంది.

01/22/2016 - 01:42

బీజింగ్, జనవరి 21: వాయువ్య చైనా ప్రాంతంలో తీవ్ర భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.4గా నమోదైంది. ప్రకంపనల తీవ్రతకు చాలా ప్రాంతాల్లో డజన్లకొద్దీ భవనాలు బీటలు వారాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగినట్లు సమాచారం అందలేదు. చైనా ప్రభుత్వ అధికార వార్తాసంస్థ జిన్‌హువా కథనం ప్రకారం గురువారం తెల్లవారుజామున 1.13కు భూమి కంపించింది.

01/22/2016 - 01:13

ఆధారాలతో సహా కనుగొన్న కాలిఫోర్నియా శాస్తజ్ఞ్రులు

01/21/2016 - 07:48

పెషావర్, జనవరి 20: ఉగ్రవాదులనుంచి తన విద్యార్థులను కాపాడుకోవడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టిన ఓ అధ్యాపకుడి వీరగాథ ఇది.

01/21/2016 - 06:09

లండన్, జనవరి 20: గత నవంబర్‌లో సిరియా పట్టణం రక్కాపై అమెరికా నేతృత్వంలో జరిగిన డ్రోన్ దాడిలో ‘జిహాదీ జాన్’గా పిలవబడే బ్రిటన్‌కు చెందిన ముసుగు మిలిటెంట్ చనిపోయినట్లు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంటు గ్రూపు ధ్రువీకరించింది. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపు విడుదల చేసిన పలువురు పాశ్చాత్య బందీల శిరచ్ఛేదం వీడియోలలో మసుగు ధరించి ఉన్న ఓ టెర్రరిస్టు వారి శిరచ్ఛేదంను అమలు చేస్తూ కనిపించేవాడు.

Pages