S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/21/2016 - 06:07

వాషింగ్టన్, జనవరి 20: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు మరో దెబ్బ తగిలింది. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే ఎంతో ఆర్థిక నష్టాన్ని చవిచూసిన ఐసిస్ మంగళవారం అర్ధరాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 45 మిలియన్ అమెరికా డాలర్ల నగదు ధ్వంసమైంది. ఇంతటి భారీ నష్టం ఎదురుకావడం వారంలో ఇది రెండోసారి. ఈ నెల 10న జరిగిన వైమానిక దాడుల్లో 90 మిలియన్ డాలర్లను అమెరికా ఫైటర్లు ధ్వంసం చేయగలిగారు.

01/21/2016 - 05:34

పెషావర్, జనవరి 20: పాకిస్తాన్‌లో కల్లోలిత ఖైబర్-్ఫక్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక బచాఖాన్ యూనివర్సిటీపై బుధవారం భారీ ఆయుధాలు ధరించిన తాలిబన్ ఆత్మాహుతి బాంబర్లు దాడి చేసి తరగతి గదులు, హాస్టళ్లలోని విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో కనీసం 25 మంది చనిపోగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు.

01/18/2016 - 07:07

రమల్లా, జనవరి 17: పాలస్తీనా పట్ల దీర్ఘకాలికంగా తాము అనుసరిస్తున్న విధానంలో ఎలాంటి మార్పులేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆ దేశానికి స్పష్టం చేశారు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్న సుష్మా స్వరాజ్ ఆదివారం ఇక్కడ పాలస్తీనా విదేశీ వ్యవహారాల మంత్రితో చర్చలు జరిపారు.

01/18/2016 - 07:05

వాషింగ్టన్/వియన్నా, జనవరి 17: అమెరికా, ఐరోపా సమాజాలు ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఆదివారం ఎత్తివేసాయి. ఇరాన్ అణ్వస్త్రాలను అభివృద్ది చేయకుండా నిరోధించడానికి రూపొందించిన చరిత్రాత్మక ఒప్పందం కింద అన్ని హామీలను ఆ దేశం నెరవేర్చిందని ఐక్యరాజ్య సమితి అణు నిఘా సంస్థ (ఐఎఇఏ) ధ్రువీకరించిన తర్వాత అమెరికా, ఇయు దానిపై విధించిన ఆంక్షలన్నిటినీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాయి.

01/18/2016 - 07:02

వాషింగ్టన్, జనవరి 17: అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఒక సైకియాట్రిస్టును పోలీసులు అరెస్టు చేసారు. అతని వద్దకు వచ్చిన పేషెంట్లలో 36 మంది చనిపోవడంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేసారు. వీరిలో 12 మంది మోతాదుకు మించి ఎక్కువ మందులు ప్రిస్క్రైబ్ చేయడం వల్ల చనిపోయారు.

01/18/2016 - 06:39

వాషింగ్టన్, జనవరి 17: అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా ఒక పువ్వును విజయవంతంగా పూయించి అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ చరిత్ర సృష్టించాడు. అమెరికా దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే ఆరంజ్ జినియా పువ్వును కెల్లీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో విజయవంతంగా పెంచడమే కాదు, పూర్తిస్థాయిలో వికసించేలా చేసాడు.

01/15/2016 - 07:50

జకార్తా, జనవరి 14: ఇండోనేసియా రాజధాని జకార్తా గురువారం పేలుళ్లు, తుపాకీ కాల్పుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది.

01/15/2016 - 07:45

వాషింగ్టన్, జనవరి 14: భారత్‌లో ఆధార్ కార్డులను ప్రవేశపెట్టడాన్ని, వాటివల్ల వస్తున్న సత్ఫలితాలను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ఆధార్ కార్డులను ప్రవేశపెట్టడం వల్ల దేశంలో అవినీతి తగ్గిందని, ఫలితంగా భారత ప్రభుత్వానికి ఏటా సుమారు ఒక బిలియన్ డాలర్లు (రూ.650 కోట్లు) ఆదా అవుతోందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

01/14/2016 - 07:31

కరాచీ, జనవరి 13: పాకిస్తాన్‌లో ప్రధాన నగరాల్లో ఒకటైన క్వెట్టాలో తాలిబన్ ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు. బెలోచిస్థాన్ రాజధాని నగరమైన క్వెట్టాలోని పోలియో కేంద్రం వెలుపల ఈ ఘాతుకం చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది భద్రతాధికారులేనని తెలిసింది. పోలియో నిర్మూలనలో భాగంగా బెలోచిస్థాన్ అంతటా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు.

01/14/2016 - 07:29

వాషింగ్టన్, జనవరి 13: కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు పాకిస్తాన్, అఫ్గానిస్థాన్, మధ్యప్రాచ్య దేశాలు సురక్షితమైన స్థావరాలుగా మారే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బుధవారం దేశ ప్రజలనుద్దేశించి చేసిన తన చివరి అధికారిక ప్రసంగంలో హెచ్చరిస్తూ, అమెరికాను, దాని మిత్ర దేశాలను సురక్షితంగా ఉంచడానికి తాను అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్‌లను వేటాడి తీరుతానని హామీ ఇచ్చారు.

Pages